Prabhas: 'ప్రాజెక్ట్ కె' లో రాజమౌళి హస్తం ఉందా...

ABN , First Publish Date - 2023-08-30T14:30:38+05:30 IST

ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో వస్తున్న 'కల్కి 2898ఏడీ' సినిమాలో రాజమౌళి పాత్ర ఉందనే వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. అయితే రాజమౌళి ఈ సినిమాలో నటిస్తున్నారా, లేక ఏదైనా సలహాలు ఇచ్చారా, అతని పాత్ర ఏంటి అన్నది క్లారిటీ లేదు

Prabhas: 'ప్రాజెక్ట్ కె' లో రాజమౌళి హస్తం ఉందా...
File picture of Prabhas and Rajamouli

ఇప్పుడు సాంఘీక మాధ్యమంలో అగ్ర దర్శకుడు రాజమౌళి (SSRajamouli), అగ్ర నటుడు ప్రభాస్ (Prabhas) గురించిన వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే అదేదో ఇద్దరూ కలిపి తమ తదుపరి సినిమా చేస్తున్నారు అని కాదు, కానీ ఇద్దరు మళ్ళీ కలుస్తున్నారు అనే వార్త. ఇంతకీ ఆ వార్త ఏంటంటే రాజమౌళి, ప్రభాస్ నటిస్తున్న 'కల్కి 2898 ఏడీ' #Kalki2898AD లో భాగం కానున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ విషయం మీద అధికారికంగా మాత్రం ఎటువంటి ప్రకటన రాలేదు.

ఇంతకీ రాజమౌళి 'ప్రాజెక్ట్ కె' #ProjectK లో ఏమి చేస్తున్నారు అనే విషయం మీద కూడా ఇంకా క్లారిటీ రాలేదు. దర్శకత్వ శాఖలో కొంత సలహాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఈ 'కల్కి 2898 ఏడీ' టీజర్ వచ్చినప్పుడు దాని గురించి రాజమౌళి తన సాంఘీక మాధ్యమంలో గొప్పగా మాట్లాడేడు. అందుకని రాజమౌళి కొన్ని సూచనలు చేసినట్టుగా ఒక వార్త చక్కర్లు కొండుతుంటే, ఇంకో వార్త ఈ సినిమాలో రాజమౌళి ఒక అతిధి పాత్రలో కనపడనున్నాడని కూడా అంటున్నారు.

Kalki.jpg

ఈ సినిమాలో ఇప్పటికే చాలామంది నటులు వున్నారు. ఇది ఒక పాన్ ఇండియా సినిమాగా రూపొందిస్తున్నాడు ఈ చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ (NagAshwin). ఇది ఒక సైన్స్ ఫిక్షన్ డ్రామా, ఇందులో ప్రభాస్ ఒక ఐరన్ మేన్ లాంటి పాత్రలో కనపడనున్నాడు. అయితే ఈ సినిమా టైటిల్ ముందుగా 'ప్రాజెక్ట్ కె' అని చాలా కాలం అనుకున్న, తరువాత దాన్ని 'కల్కి 2898 ఏడీ' అనే టైటిల్ గా మార్చారు. ఇందులో మలయాళం స్టార్ దుల్కర్ సల్మాన్ (DulquerSalman) కూడా వున్నాడు అని వార్తలు వచ్చినప్పుడు, అది ఆ చిత్ర నిర్వాహకులు చెపితే బాగుంటుంది అని అయన చెప్పాడు.

అందుకని ఇందులో దుల్కర్ సల్మాన్ కూడా కనపడనున్నాడు అని కూడా అంటున్నారు. ఈ సినిమా మీద ప్రభాస్ అభిమానులకి చాలా అంచనాలు వున్నాయి. ఎందుకంటే ప్రభాస్ ముందు సినిమాలు ముఖ్యంగా 'ఆదిపురుష్' చాలా బాడ్ నేమ్ తీసుకొచ్చింది. ఒకవేళ 'సాలార్' #Salaar అటు ఇటు గా వున్నా, ఈ 'కల్కి 2898 ఏడీ' మీదే ఆశలు ఎక్కువ పెట్టుకున్నారు.

Updated Date - 2023-08-30T14:30:38+05:30 IST