Bholaa Shankar: చిరంజీవి కి, అజిత్ కి కంపేరిజన్ లు మొదలయ్యాయి, తమిళ సినిమా యూట్యూబ్ లో చూడొచ్చు

ABN , First Publish Date - 2023-08-09T14:20:48+05:30 IST

తమిళ సూపర్ స్టార్ అజిత్ నటించిన తమిళ సినిమా 'వేదాళం' కి రీమేక్ చేసిన చిరంజీవి 'భోళాశంకర్' సినిమా శుక్రవారం విడులవుతోంది. అయితే తమిళ సినిమా ఏ ఓటిటి ప్లాటుఫారంలో కూడా లేదని చెప్పుకుంటూ వస్తున్నారు 'భోళాశంకర్' చిత్ర సభ్యులు, కానీ ఆ సినిమా అందరికీ అందుబాటులో ఉండటమే కాకుండా, అజిత్ కీ, చిరంజీవి కీ కంపేరిజన్ లు కూడా మొదలెట్టేసాడు నెటిజన్స్.

Bholaa Shankar: చిరంజీవి కి, అజిత్ కి కంపేరిజన్ లు మొదలయ్యాయి, తమిళ సినిమా యూట్యూబ్ లో చూడొచ్చు
Bholaa Shankar and Vedalam

చిరంజీవి (Chiranjeevi) నటించిన 'భోళాశంకర్' #BholaaShankar ఈ శుక్రవారం థియేటర్స్ లో విడుదలవుతోంది. మెహెర్ రమేష్ (MeherRamesh) దీనికి దర్శకుడు, అనిల్ సుంకర (AnilSunkara) నిర్మాత. ఈ సినిమా తమిళ సూపర్ స్టార్ అజిత్ (Ajithkumar) నటించిన 'వేదాళం' #Vedalam సినిమాకి రీమేక్. తమిళ సినిమాకి దర్శకుడు శివ కాగా, అందులో శృతి హాసన్ (ShrutiHaasan) లాయర్ పాత్రలో కనపడగా, లక్ష్మి మీనన్ (LakshmiMenon) అజిత్ చెల్లెలుగా చేసింది. తెలుగులో ఈ రెండు పాత్రల్లోనూ తమన్నా భాటియా (TamannaahBhatia), కీర్తి సురేష్ (KeerthySuresh) కనిపించనున్నారు.

తెలుగు సినిమా 'భోళాశంకర్' #BholaaShankar నిర్మాత తమిళ సినిమా ఏ ఓటిటి లో కూడా లేదని చెపుతూ వచ్చారు. అదే విషయాన్ని చిరంజీవి కూడా తమ ప్రచార చిత్రాల్లో కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే సాంఘీక మాధ్యమాల్లో మాత్రం నెటిజన్స్ వూరికే వుండరు కదా, "సార్ మీ సినిమా ఓటిటి లో లేదేమో కానీ, ఇక్కడ యూట్యూబ్ లో వుంది సార్' అని చిరంజీవి చెప్పిన ఆ మాటల క్లిప్పింగ్ కి సమాధానంగా పెడుతున్నారు.

bholaashankar3.jpg

ఇంతకీ అజిత్ నటించిన 'వేదాళం' సినిమా ఓటిటి ప్లేట్ ఫార్మ్స్ లో ఉందా? లేదా? కచ్చితంగా వుంది, ఎందుకంటే యూట్యూబ్ లో ఈ సినిమా మొత్తం వుంది. ఎవరైనా చూసుకోవచ్చు కూడా. నెటిజన్స్ అప్పుడే చిరంజీవి సినిమా 'భోళాశంకర్' ట్రైలర్ లో వున్న సన్నివేశాలను, అజిత్ చేసిన 'వేదాళం' లోని సన్నివేశాలను కంపేర్ చేసి చూపిస్తున్నారు. ఈ సినిమా విడుదలకి ముందే అభిమానుల్లో, ప్రేక్షకుల్లో అప్పుడే కంపేరిజన్ మొదలయ్యింది అంటే, తెలుగు సినిమాలో చాలా దమ్ముండాలి అని కూడా నెటిజన్స్ అంటున్నారు. దీనికి తోడు, రజినీకాంత్ (Rajinikanth) సినిమా 'జైలర్' #Jailer కూడా రేపు విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో అందరూ దర్శకుడు 'మెహెర్ రమేష్' ఎటువంటి మార్పులు తమిళ సినిమాకి చేసాడు, ఎలా తెలుగు వెర్షన్ తీసాడు అన్న విషయం మీదే చర్చిస్తున్నారు.

Updated Date - 2023-08-09T14:20:48+05:30 IST