Tamannaah Bhatia: మిల్కీ బ్యూటీ.. గ్లామర్ సీక్రెట్‌ ఇదేనా?

ABN , First Publish Date - 2023-02-24T00:06:01+05:30 IST

దక్షిణాది స్టార్‌ హీరోయిన్‌గా కొనసాగుతున్న మిల్కీబ్యూటీ తమన్నా భాటియా బ్యూటీ సీక్రెట్‌ను తెలుసుకునేందుకు అనేక మంది

Tamannaah Bhatia: మిల్కీ బ్యూటీ.. గ్లామర్ సీక్రెట్‌ ఇదేనా?
tamanna

దక్షిణాది స్టార్‌ హీరోయిన్‌గా కొనసాగుతున్న మిల్కీబ్యూటీ తమన్నా భాటియా (Tamannaah Bhatia) బ్యూటీ సీక్రెట్‌ (Beauty Secret)ను తెలుసుకునేందుకు అనేక మంది ఆసక్తి చూపుతుంటారు. వయసు మీదపడుతున్నప్పటికీ ఆమె అందం మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. ఫిట్‌గా ఉండేందుకు ఆమె సమయం దొరికిందంటే చాలు.. జిమ్‌లో వాలిపోయి వ్యాయామాలు చేస్తున్నారు.

Tam.jpg

తెలుగు, తమిళ్ భాషలలలోని దాదాపు అగ్ర హీరోలందరి చిత్రాలలో నటించిన ఈ మిల్కీబ్యూటీ... ఇప్పుడు సూపర్‌స్టార్‌ రజినీకాంత్ నటించే ‘జైలర్‌’ (Jailer) చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుపుకుంటోంది. అలాగే, తెలుగులోనూ బిజీ హీరోయిన్‌గా కొనసాగుతోంది. మెగాస్టార్ చిరంజీవి సరసన ఆమె ‘భోళాశంకర్’ (Bholaa Shankar) చిత్రంలో చేస్తోంది.

దీంతో తన శరీరాన్ని మరింత స్లిమ్‌గా, ఫిట్‌గా ఉంచుకునేందుకు ఆమె జిమ్‌లో చెమటోడ్చుతోంది. ఆమె వ్యాయామం చేస్తుండగా తీసిన వీడియో, ఫొటోలు ఇపుడు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదేనా నీ గ్లామర్ సీక్రెట్ అంటూ.. ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Updated Date - 2023-02-24T00:06:03+05:30 IST