Kanguva: టీజర్‌ అదరహో.. అంచనాలు పెరగడంతో టార్గెట్‌ మారిపోయింది!

ABN , First Publish Date - 2023-07-24T21:49:38+05:30 IST

సూర్య హీరోగా తెరకెక్కిన శివ దర్శకత్వం వహిస్తున్న ‘కంగువా’ చిత్రం పస్ట్‌ గ్లింప్స్‌ను సూర్య పుట్టినరోజు సందర్భంగా ఆదివారం విడుదల చేశారు. ఈ టీజర్‌ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌ జాబితాలో నిలిచింది.

Kanguva: టీజర్‌ అదరహో.. అంచనాలు పెరగడంతో టార్గెట్‌ మారిపోయింది!

సూర్య (Suriya) హీరోగా తెరకెక్కిన శివ (Shiva) దర్శకత్వం వహిస్తున్న ‘కంగువా’ (kanguva) చిత్రం పస్ట్‌ గ్లింప్స్‌ను సూర్య పుట్టినరోజు సందర్భంగా ఆదివారం విడుదల చేశారు. ‘వేవేల పులిగోళ్ల పదునే వీడు... శతకోటి సర్పాల పొగరే వీడు... చెలరేగు సంద్రాల ముఖమే వీడు... గర్జించు ఢంకాల అదురే వీడు’ అంటూ కథానాయకుడి పాత్రని పరిచయం చేసిన తీరు, విజుల్స్‌, నేపథ్య సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఈ టీజర్‌ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌ (trending in Youtube) జాబితాలో నిలిచింది. దేవిశ్రీ నేపథ్య సంగీతం ప్లస్‌ అని చెబుతున్నారు. తాజాగా ఇంటర్వ్యూలో చిత్ర నిర్మాతల్లో ఒకరైన ధనుంజయ్‌ ఈ గ్లింప్స్‌కి వస్తున్న స్పందన గురించి ఆనందం వ్యక్తం చేశారు. సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయని చెప్పారు. రెవెన్యూ విషయంలో రూ.1000 కోట్ల టార్గెట్‌ (1000 Crores Target) అని తెలిపారు. అంతే కాదు ఈ చిత్రం సీక్వెల్‌కు సంబంధించిన అప్‌డేట్‌ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ గ్లింప్స్‌ చూసిన హిందీ డిస్ర్టిబ్యూటర్లు ఉత్తరాదిలో ఈ చిత్రం సుమారు 400 కోట్లు వసూళ్లు చేస్తుందని అంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రూ. 1000 కోట్ల కలెక్షన్స్‌ చేయాలనే లక్ష్యంతో ఉన్నాం. ఇప్పటి వరకు ఈ సినిమాకి దాదాపు 250 కోట్ల బడ్జెట్‌ అయింది. పార్ట్‌ 2, 3లకు కథలు రెడీగా ఉన్నాయి. పార్ట్‌-1 విజయం ఆధారంగా వాటిని తెరకెక్కించే ప్లాన్‌ చేస్తాం. సూర్యని మరోస్థాయికి తీసుకెళ్లే చిత్రమది. యాక్షన్‌తోపాటు ఎమోషన్స్‌కి మంచి ప్రాధాన్యం ఉంది’’ అని తెలిపారు.

కంగ అనే పరాక్రముడి కథతో ఈ చిత్రం పది భాషల్లో రూపొందుతోంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. యూవీ క్రియేషన్స్‌, స్టూడియో గ్రీన్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో దిశా పటానీ కథానాయికగా నటిస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఈ సినిమా విడుదల కానుంది.

Updated Date - 2023-07-24T21:49:38+05:30 IST