Suriya: తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక కృతజ్ఞతలు!

ABN , First Publish Date - 2023-08-06T14:47:47+05:30 IST

కోలీవుడ్‌ స్టార్‌ సూర్యకు *Suriya) తెలుగులోనూ మంచి ఫ్యాన్‌ బేస్‌ ఉంది. ఆయన నటించిన ‘సూర్య సన్నాఫ్‌ కృష్ణన్‌’ (Surya son of krishnan) చిత్రాన్ని ఈ నెల 4న రీ-రిలీజ్‌ చేశారు. థియేటర్స్‌లో ఫ్యాన్స్‌ చేసిన సందడి వీడియోల రూపంలో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తూనే ఉన్నాయి.

Suriya: తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక కృతజ్ఞతలు!

కోలీవుడ్‌ స్టార్‌ సూర్యకు *Suriya) తెలుగులోనూ మంచి ఫ్యాన్‌ బేస్‌ ఉంది. ఆయన నటించిన ‘సూర్య సన్నాఫ్‌ కృష్ణన్‌’ (Surya son of krishnan) చిత్రాన్ని ఈ నెల 4న రీ-రిలీజ్‌ చేశారు. థియేటర్స్‌లో ఫ్యాన్స్‌ చేసిన సందడి వీడియోల రూపంలో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తూనే ఉన్నాయి. 15 ఏళ్ల తర్వాత విడుదలైన సూర్య క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదు అన్నట్లు కలెక్షన్లు వచ్చాయని మేకర్స్‌ చెబుతున్నారు. తాజాగా ఫ్యాన్స్‌ ఎంజాయ్‌ చేస్తున్న వీడియోను షేర్‌ చేసిన సూర్య.. వారికి ధన్యవాదాలు తెలిపారు. ‘మీ ప్రేమాభిమానాలకు ఆశ్చర్యపోయాను. ‘సూర్య సన్నాఫ్‌ కృష్ణన్‌’ చిత్రబృందానికి ప్రత్యేక ధన్యవాదాలు. మీరు ఎప్పటికీ బెస్ట్‌’ అంటూ థియేటర్లో అభిమానుల సందడి చేస్తున్న వీడియోను పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ వైరల్‌ అవుతోంది. ఇక

సూర్య ద్విపాత్రాభినయంలో సిమ్రన్‌, సమీరారెడ్డి కథానాయికలుగా 2008లో గౌతమ్‌ వాసుదేవ్‌ మేనన్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్‌ హిట్‌ను సొంతం చేసుకుంది. సూర్య ప్రస్తుతం ‘కంగువా’ చిత్రంతో బిజీగా ఉన్నారు. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం టీజర్‌ను ఇటీవల విడుదల చేశారు. ఈ గ్లింప్స్‌కు విశేష ఆదరణ దక్కిన సంగతి తెలిసిందే!

Updated Date - 2023-08-06T14:49:18+05:30 IST