సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

SobhitaDhulipala: నాగ చైతన్యతో వైరల్ అయిన ఈ భామ మళ్ళీ ఏమి చేసిందో చూసారా

ABN, First Publish Date - 2023-05-06T12:57:49+05:30

నాగ చైతన్యతో కనపడి ఆమధ్య వైరల్ అయిన నటి శోభిత ధూళిపాళ, మళ్ళీ వైరల్ అయింది. అయితే ఈసారి ఎందుకంటే..

Sobhita Dhulipala
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శోభిత ధూళిపాళ (Sobhita Dhulipala) పేరు ఇప్పుడు చాలా బాగా వినపడుతోంది ప్రతి దగ్గరా. ఆమె మణిరత్నం (Mani Ratnam) సినిమా 'పొన్నియిన్ సెల్వం' (PonniyinSelvan) రెండో పార్టులో ఉండటం, (PS2) ఆమె నటించిన 'నైట్ మేనేజర్' (TheNightManager) వెబ్ సిరీస్ మంచి హిట్ అవటం రెండు కారణాలు కాగా, మూడో కారణం ఆమె నటుడు నాగ చైతన్య (NagaChaitanya) తో కలిసి వున్న ఫోటోలలో కనపడి వైరల్ అవ్వటం.

ఇలా ఈ తెలుగు అమ్మాయి అయిన శోభిత ధూళిపాళ వార్తల్లో ఉంటూ వస్తోంది. అలాగే సాంఘీక మాధ్యమం లో కూడా ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. తన ఫోటోస్ పోస్ట్ చేస్తూ అభిమానులకు కనువిందు చేస్తూ ఉంటుంది కూడా. ఈసారి కూడా అదిరిపోయే విధంగా, మంచి గ్లామర్ ఫోటోస్ పోస్ట్ చేసింది ధూళిపాళ.

ఫోటోలకి కేప్షన్ 'ది నైట్ మేనేజర్' (TheNightManager) అని ఇచ్చింది, కానీ ఆమె పెట్టిన పోజులు చూస్తుంటే మాత్రం ఎవరికోసమో ఎదురుచూస్తున్నట్టుగా వున్నాయి.

'నర్తనశాల' సినిమాలో పాటలా 'ఎవ్వరికోసం ఈ మందహాసం ఒకపరి వివరించవే సొగసరి ఒకపరి వివరించవే' అన్నట్టుగా వున్నాయి. మళ్ళీ ఈ ఫోటోస్ కూడా సాంఘీక మాధ్యమం లో వైరల్ అవుతున్నాయి కూడా. నెటిజన్స్ ఈ ఫోటో ల మీద చాలా కామెంట్స్ కూడా పెడుతున్నారు.

ఇదిలా ఉంటే, నాగ చైతన్య 'కస్టడీ' అనే సినిమాతో వచ్చేవారం ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇది తెలుగు, తమిళ భాషల్లో విడుదల అవుతోంది. వెంకట్ ప్రభు దీనికి దర్శకుడు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో నాగచైతన్యకి శోభిత గురించి ఎవరూ అడగలేదు, అతను కూడా ఎక్కువ మాట్లాడలేదు. కానీ ఇప్పుడు చాలా సంతోషంగా వున్నాను అని మాత్రం చెపుతున్నాడు. మరి దానర్ధం ఏమిటో?

Updated Date - 2023-05-06T12:57:49+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!