Armaan Malik engagement: తన ప్రియురాలికి వెరైటీగా ప్రొపోజ్ చేసిన ఈ 'బుట్టబొమ్మ' గాయకుడు, ఫోటోస్ వైరల్

ABN , First Publish Date - 2023-08-28T15:00:41+05:30 IST

ప్రముఖ గాయకుడు అర్మాన్ మాలిక్ ఓ ఇంటివాడవ్వబోతున్నాడు. తన ప్రియురాలు అయిన ఆష్నా ష్రాఫ్ కు వెరైటీ గా ప్రొపోజ్ చేసి చెపితే, ఆమె ఒకే చెప్పింది. ఇప్పుడు ఈ ఫోటోలు సాంఘీక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.

Armaan Malik engagement: తన ప్రియురాలికి వెరైటీగా ప్రొపోజ్ చేసిన ఈ 'బుట్టబొమ్మ' గాయకుడు, ఫోటోస్ వైరల్
Armaan Malik and Aashna Shroff get engaged

అర్మాన్ మాలిక్ (ArmaanMalik) గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే తన గాత్రంతో ఎన్నో తెలుగు పాటలతో తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన గాయకుడు అర్మాన్ మాలిక్. ఆమధ్య బాగా హిట్ అయిన పాట ఏదైనా వుంది అంటే అది అల్లు అర్జున్ (AlluArjun) నటించిన 'అల వైకుంఠపురంలో' #AlaVaikuntapuramLo పాడిన 'బుట్ట బొమ్మా' #ButtaBomma పాట. ఆ పాటకి ఎంత క్రేజ్ వుందో అందరికీ తెలిసిన విషయమే. అలాగే చాలా తెలుగు సినిమాలలో అతను పాడాడు. రీసెంట్ గా 'స్కంద' #Skanda సినిమాలో రామ్ పోతినేని (RamPothineni) కి కూడా పాడాడు అర్మాన్ మాలిక్.

armaanmalikengagement1.jpg

అలాగే నితిన్ నటించిన 'ఎక్స్ట్రార్డినరీ మేన్' #ExtraordinaryMan సినిమాలో 'డేంజర్ పిల్లా' #DangerPilla పాడింది కూడా అర్మాన్ మాలిక్. అతను వైవిధ్యమైన పాటలతో ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యాడు. ఒక్క తెలుగులోనే కాకుండా, హిందీ, తమిళం అన్ని భాషల్లో కూడా అర్మాన్ చాలా పాపులర్ అయ్యాడు తన గొంతుతో.

ఇప్పుడు అర్మాన్ సాంఘీక మాధ్యమంలో కొన్ని ఫోటోస్ షేర్ చేసాడు, అవి వైరల్ అయ్యాయి. అదేంటి అంటే తన ప్రియురాలు అయిన ఆష్నా ష్రాఫ్ (Aashna Shroff) కి సినిమా ఫక్కీలో మోకాళ్ళ మీద కూర్చొని ఆమెకి ప్రొపోజ్ చేసాడు. అలాగే వాటికీ ఒక కేప్షన్ కూడా పెట్టాడు. "... మరియు మా ఎప్పటికీ ఇప్పుడే ప్రారంభం అయింది" (and our forever has only just begun). ఆష్నా ష్రాఫ్ ఒక పేషన్ డిజైనర్, బ్యూటీ బ్లాగర్, అలాగే ఆమె ఒక యూట్యూబర్ కూడా. కాస్మో పోలిటన్ లక్జరీ పేషన్ ఇన్ఫ్లుయన్సర్ గా ఆమెని 2023 సంవత్సరానికి సెలెక్ట్ చేశారు.

Updated Date - 2023-08-28T15:00:41+05:30 IST