Shruti Haasan: ఎయిర్ పోర్ట్ ఘటన మీద స్పందించిన శృతి హాసన్, నాకు సెక్యూరిటీ పెట్టుకోవటం ఇష్టం లేదు!

ABN , First Publish Date - 2023-09-21T13:04:16+05:30 IST

ఎయిర్ పోర్టులో శృతి హాసన్ వెనకాల ఒక అపరిచిత వ్యక్తి నడుచుకుంటూ ఆమెని కొంతదూరం వరకు ఫాలో అయ్యాడు. తరువాత శృతి హాసన్ అతన్ని గదమాయించటంతో అతను వెళ్ళిపోయాడు. ఈ సంఘటన గురించి శృతి హాసన్ స్పందించారు.

Shruti Haasan: ఎయిర్ పోర్ట్ ఘటన మీద స్పందించిన శృతి హాసన్, నాకు సెక్యూరిటీ పెట్టుకోవటం ఇష్టం లేదు!
Shruti Haasan

మొన్న ఎయిర్ పోర్టులో నటి శృతి హాసన్ (ShrutiHaasan) వెనకాల ఒక వ్యక్తి ఫాలో అవటం అందరూ వీడియోలో చూసారు. అయితే అతను శృతి హాసన్ దగ్గరకి వెళ్ళటం, ఆ తరువాత శృతి హాసన్ అతన్ని కొంచెం అదమాయించటంతో అతను దూరంగా వెళ్ళిపోవటం ఇదంతా ముంబై ఎయిర్ పోర్టులో ఆమెకి ఎదురైనా ఒక చేదు అనుభవం. దుబాయ్ లో సైమా అవార్డ్స్ #SIIMA కి వెళ్లి వచ్చినప్పుడు ఈ సంఘటన జరగటం, తరువాత ఈ వీడియో సాంఘీక మాధ్యమాల్లో వైరల్ అవటం కూడా జరిగింది.

ఈ సంఘటన మీద శృతి హాసన్ స్పందించింది. తన ఇన్స్టాగ్రామ్ లో అభిమానులతో చిట్ చాట్ చేస్తూ ఉండగా, ఒకరు ఈ ప్రశ్న అడిగారు. ముంబై ఎయిర్ పోర్టులో జరిగిన సంఘటన గురించి ప్రస్తావిస్తూ అతను మీకు తెలుసా అని అడిగారు. దానికి సమాధానంగా శృతి హాసన్ ఈ ప్రశ్న అడిగినందుకు ధన్యవాదములు చెపుతూ ఆ సంఘటన గురించి వివరించింది.

shrutihaasan-new2.jpg

"నేను ఎయిర్ పోర్టులో నడిచి వెళుతున్నాను, అతను నా వెనకాలే నడుచుకుంటూ వస్తున్నాడు. అతనెవరో కూడా నాకు తెలియదు. అయితే అక్కడ చాలామంది ఫోటోగ్రాఫర్స్ వున్నారు, అందులోంచి ఒకరు అతనికి కొంచెం దగ్గరగా వెళ్ళు అని చెప్పడంతో అతను నాకు మరీ దగ్గరగా వచ్చాడు. అయితే నేను ఆ ఫోటోగ్రాఫర్స్ లో ఒకరికి అతను తెలుసేమో అనుకున్నాను, కానీ అతను మరీ దగ్గరికి రావంతో నేను చాలా అసౌకర్యానికి గురయ్యాను. నేను ఎప్పుడూ బాడీ గార్డ్స్ ని పెట్టుకోను, ఎందుకంటే నా వ్యక్తిగత జీవితాన్ని స్వేచ్ఛగా బతకాలని అనుకుంటూ వుంటాను, అందుకే నేను అంగ రక్షకులు లేకుండానే ఎక్కడికైనా వెళుతుంటాను, కానీ నా జాగ్రత్తల్లో నేనుంటాను," అని చెప్పింది శృతి హాసన్.

అయితే ఈ సంఘటన జరిగాక అసలు అక్కడ ఏమి జరిగింది అని తెలుసుకోకుండా దానిమీద ఏవేవో వార్తలు వచ్చాయి, అందుకనే శృతి హాసన్ దానిమీద ఒక క్లారిటీ ఇచ్చినట్టుగా తెలిసింది. ఇక సినిమాల విషయానికి వస్తే శృతి హాసన్ ప్రస్తుతం 'సలార్' #Salaar లో ప్రభాస్ (Prabhas) పక్కన నటిస్తోంది, అలాగే నాని (Nani), మృణాల్ ఠాకూర్ (MrunalThakur) సినిమా 'హాయ్ నాన్న' #HiNanna లో ఒక ముఖ్య పాత్ర పోషిస్తోంది.

Updated Date - 2023-09-21T13:04:16+05:30 IST