Shruti Haasan: ఆరు దశాబ్దాలుగా ఓ చక్రవర్తిలా..

ABN , First Publish Date - 2023-08-12T20:50:55+05:30 IST

విశ్వనాయకుడు కమల్‌హాసన్‌ సినీ రంగ ప్రవేశం చేసి 60 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా ఆయనకు సినీ ప్రముఖులు అభిమానులు శుభాకాంక్షలు చెబుతు ట్వీట్లు చేస్తున్నారు. ఈ మేరకు ఆయన గారాలపట్టీ శ్రుతీహాసస్‌ కూడా తండ్రిని ఉద్దేశించి ట్వీట్‌ చేశారు.

Shruti Haasan: ఆరు దశాబ్దాలుగా ఓ చక్రవర్తిలా..

విశ్వనాయకుడు కమల్‌హాసన్‌(Kamal haasan) సినీ రంగ ప్రవేశం చేసి 60 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా ఆయనకు సినీ ప్రముఖులు అభిమానులు శుభాకాంక్షలు చెబుతు ట్వీట్లు చేస్తున్నారు. ఈ మేరకు ఆయన గారాలపట్టీ శ్రుతీహాసస్‌ (Shruthi Haasan) కూడా తండ్రిని ఉద్దేశించి ట్వీట్‌ చేశారు. అభిమానులు తయారు చేసిన ఫొటోను షేర్‌ చేసి ‘‘నాన్న సినీ ప్రయాణంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నారు. ఉలగనాయగన్‌గా వైవిధ్యమైన పాత్రలు పోషించారు. ఆయన ఎదుగుతూ, సినీ పరిశ్రమ ఎదుగుదల కోసం అలుపెరుగని పోరాటం చేశారు. ఆరు దశాబ్దాలుగా సినీరంగానికి తన సేవలు అందిస్తూ ఓ చక్రవర్తిగా కెరీర్‌ సాగించారు. ఇప్పుడు ిసినిమాల్లో 63 ఏళ్లు పూర్తి చేసుకుని 64వ సంవత్సరంలో అడుగుపెడుతున్న తరుణంలో ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

1.jpg

ప్రస్తుతం కమల్‌హాసన్‌ ‘ఇండియన్‌-2’ (indian 2) చిత్రంతో బిజీగా ఉన్నారు. శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రకుల్‌, కాజల్‌ కథానాయికలు. అలాగే ప్రభాస్‌లో హీరోగా నటిస్తున్న ‘కల్కి 2898 ఎడీ’ చిత్రం షూటింగ్‌లో పాల్గొంటారని టాక్‌ వినిపిస్తోంది. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఆయన ప్రతినాయకుడిగా కనిపిస్తారు.

Updated Date - 2023-08-12T21:01:14+05:30 IST