Samantha: ఒంటిమీద కూడా చైతన్య ఆనవాలు లేకుండా చేసిన సమంత, ఫోటోస్ వైరల్

ABN , First Publish Date - 2023-10-11T11:03:34+05:30 IST

సమంత, నాగ చైతన్యతో వివాహం అయిన తరువాత తన వొంటి మీద మూడు పచ్చబొట్లు పొడిపించుకుంది. అవన్నీ నాగ చైతన్యకి సంబందించినవే. చైతన్యతో విడిపోయాక ఆ పచ్చబొట్లు చాలాకాలం కనిపించినా, ఇప్పుడు సమంత వొంటి మీద అవి కనిపించటం లేదు, అంటే చైతన్య ఆనవాలు మొత్తం చెరిపేసింది అని అంటున్నారు.

Samantha: ఒంటిమీద కూడా చైతన్య ఆనవాలు లేకుండా చేసిన సమంత, ఫోటోస్ వైరల్
Actress Samantha, before and after the tattoo of 'chay'

నటి సమంత (Samantha) తెలుగులో అంచెలు అంచెలుగా కష్టపడి పైకి ఎదిగిన నటి. ఆమెకి కష్టమంటే ఏంటో తెలుసు, అందుకే మనసులో ఏదీ దాచుకోకుండా తనకి ఏది చెప్పాలని అనిపించినా వెంటనే చెప్పేస్తుంది. అటువంటి సమంత ఒక్కోసారి సమాజంలో జరిగే సంఘటనలకు కూడా సాంఘీక మాధ్యమం ద్వారా స్పందిస్తూ ఉంటుంది. కెరీర్ లో ఎలా అయితే కష్టపడి అగ్ర స్థాయికి చేరుకుందో, సమంత వ్యక్తిగత జీవితంలో కూడా చాలా ఆటుపోట్లు వున్నాయి.

samantha-tattoo3.jpg

అందులో ఒకటి ఆమె వైవాహిక జీవితం. అక్కినేని వంశానికి చెందిన నాగచైతన్యని (AkkineniNagaChaitanya) వివాహం చేసుకొని అక్కినేని వారి కోడలు అయింది. అంతవరకు బాగానే వుంది. చైతన్య మీద వున్న ప్రేమకి చిహ్నంగా తన ఒంటిమీద ఒక పచ్చబొట్టు (టాట్టూ అని అంటారు కదా) కూడా వేయించుకుంది, అంటే ఎంతలా చైతన్యని ప్రేమించిందో ఆ పచ్చబొట్టు వేయించుకొని మరీ చెప్పింది. అయితే ఆ తరువాత ఇద్దరి మధ్య ఏవో విభేదాలు వచ్చి విడిపోవాలని అనుకున్నారు, విడిపోయారు. మరి సమంత వొంటి మీద ఆ పచ్చబొట్టు కూడా అలాగే ఉండిపోయింది.

samantha-tattoo2.jpg

కానీ ఇప్పుడు ఆ ఆనవాలు కూడా ఎందుకు అని అనుకుందో ఏమిటో, సమంత ఆ పచ్చబొట్టుని కూడా తీయించేసింది. చైత్యన్యని అంటే అతని స్నేహితులూ, ఇంట్లో వాళ్ళూ 'చై' (Chaitanya) అని పిలుస్తూ అంటారు. అందుకే 'చై' (Chay) అనే పేరుమీద పచ్చబొట్టు నడుము మీద వేయించుకుంది. అయితే మొన్న దుబాయ్ లో ఒక ఈవెంట్ కి హాజరయిన సమంత వంటి మీద ఆ 'చై' పచ్చబొట్టు మాయం అయిపొయింది. అంటే సమంత ఆ గుర్తు కూడా వద్దు అని తీయించేసుకుంది. ఎక్కడా కూడా చైతన్య ఆనవాలు ఇక లేకుండా పచ్చబొట్టు కూడా చెరిపించేసుకుంది.

samantha-tattoo1.jpg

దీనితో సమంత మరి ఇక ఈ జన్మలో చైతన్యని కలవదు అని అర్థం అయిపొయింది అని ఆమె అభిమానులు సాంఘీక మాధ్యమంలో అంటున్నారు. సమంత, చైతన్య మళ్ళీ కలుస్తారేమో అనే వార్తలు ఆమధ్య కొన్ని వచ్చాయి, కానీ సమంత ఇలా చైతన్య ఆనవాలు ఎక్కడా కనపడకుండా కూడా తీసెయ్యడంతో చైతన్యని కలిసే ప్రసక్తి లేదని చెప్పకనే చెప్పింది సమంత. అయితే మొత్తం నాలుగు చోట్ల సమంత పచ్చబొట్లు వేయించుకుంది, అందులో మూడు చైతన్యకి సంబంధించినవే అని ఇంతకు ముందు చాలా సార్లు చెప్పింది. అయితే ఇప్పుడు చై పేరుతో వున్న పచ్చబొట్టు తీయించేసింది. మరి మిగతావి కూడా తీయించేసినట్టేనా అని నెటిజన్స్ అడుగుతున్నారు.

Updated Date - 2023-10-11T11:30:22+05:30 IST