Samantha: సమంత ప్రెస్ మీట్ అది చెప్పడం కోసమేనా? లేక...

ABN , First Publish Date - 2023-11-01T15:19:28+05:30 IST

సమంత హైదరాబాదులో ఈనెల మూడో తేదీన ఒక ప్రెస్ మీట్ పెడుతోందని వార్త హల్ చల్ చేస్తోంది. ఇంతకీ ఈ ప్రెస్ మీట్ దేనికి పెడుతోంది, ఎందుకు హైదరాబాదులో పెడుతోంది, ఆమె వ్యక్తిగతమా, లేక సినిమా కోసమా, వివరాలు చదవండి.

Samantha: సమంత ప్రెస్ మీట్ అది చెప్పడం కోసమేనా? లేక...
Samantha

అగ్ర నటీమణుల్లో ఒకరైన సమంత (Samantha) సినిమాలు చేసినా, చెయ్యకపోయినా తన సాంఘీక మాధ్యమం ద్వారా ఆమె అభిమానులకి తన సమాచారం ఇస్తూ, ఫోటోస్ పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆమె హైదరాబాదులో ఈనెల 3వ తేదీన ఒక ప్రెస్ మీట్ పెడుతోంది అని వార్తలు వస్తున్నాయి. అయితే దేనికోసం సమంత ప్రెస్ మీట్ పెడుతోంది, ఎందుకు పెడుతోంది అని చాలామంది ఆలోచిస్తున్నారు. అలాగే విశ్రాంతి కోసమని అమెరికా వెళ్లిన సమంత ఇండియా మళ్ళీ వచ్చేసింది, దేనికోసం.

samantha-latest.jpg

ఇంకోపక్క ఆమె వైవాహిక జీవితం గురించి కూడా అనేక వార్తలు వస్తూ ఉండటంతో, దానికోసమే ఈ ప్రెస్ మీట్ అని కూడా ఇంకొన్ని వార్తలు వస్తున్నాయి. కానీ ఇవేమీ కాదు, ఆమె సహచరులు చెప్పిన సమాచారం బట్టి, ఆమె ఒక సినిమా ప్రచారానికి ఈ ప్రెస్ మీట్ పెడుతోంది అని అంటున్నారు.

నవంబర్ 10వ తేదీన 'మార్వెల్స్' #TheMarvels అనే ఇంగ్లీష్ సినిమా తెలుగులో విడుదలవుతోంది, దానికి ప్రచారానికి ఆ చిత్ర నిర్వాహకులు సమంత ని తెలుగులో ప్రచారానికి ఎన్నుకున్నారు. అందుకని ఆ సినిమా కోసమని సమంత హైదరాబాదులో ఈ ప్రెస్ మీట్ పెడుతోంది అని ఆమె సహచరులు చెప్పిన సమాచారం.

samantha-latest1.jpg

అలాగే అమెరికా నుండి ఇండియా వచ్చిన తరువాత సమంత ఫోటోషూట్ కూడా చేయించుకుంది. తన డిజైనర్ షాపు 'సాకి' కోసం ప్రత్యేకంగా ఫోటోలు తీయించుకుంటూ ఉంటుంది. తాజాగా తీసిన ఆమె ఫోటోలు సాంఘీక మాధ్యమంలో వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు ఆమె చీరలో పోజు చేసిన ఫోటోస్ అయితే తాజాగా సాంఘీక మాధ్యమంలో షేర్ చేస్తున్నారు, వైరల్ అవుతున్నాయి. అలాగే ఆమె పాత ఫోటోలు చీరలో వున్నవి కూడా పెడుతూ ఆమె చీరలో చాలా బాగుంది అని కూడా చెపుతున్నారు నెటిజన్స్.

Updated Date - 2023-11-01T15:19:28+05:30 IST