Salaar: కుమ్మేస్తున్న కలెక్షన్స్, మేకింగ్ వీడియో వదిలిన నిర్మాతలు

ABN , Publish Date - Dec 25 , 2023 | 03:11 PM

ప్రభాస్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ కుమ్ముతుంటే, ఇంకో పక్క ఆ చిత్ర నిర్వాహకులు ఆ సినిమా మేకింగ్ వీడియో ని విడుదల చేశారు. ఈరోజుతో సెలవలు అయిపోయాయి, మంగళవారం నుండి కలెక్షన్స్ ఎలా వుంటాయో చూడాలి అని ట్రేడ్ అనలిస్ట్స్ అంటున్నారు.

Salaar: కుమ్మేస్తున్న కలెక్షన్స్, మేకింగ్ వీడియో వదిలిన నిర్మాతలు
A still from Salaar

ప్రభాస్ (Prabhas), ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబినేషన్ లో వచ్చిన 'సలార్' #Salaar ప్రేక్షకుల ముందుకి డిసెంబర్ 22 న వచ్చింది. ఈ సినిమాకి మిశ్రమ టాక్ వచ్చినా, సెలవు దినాలు బాగా ఈ సినిమాకి కలిసి రావటంతో సినిమాకి కలెక్షన్స్ కుమ్ముతున్నాయి. మూడు రోజులకు గాని ఈ సినిమా మొత్తం ప్రపంచ వ్యాప్తంగా సుమారు రూ.320 కోట్ల గ్రాస్ కలెక్టు చేసిందని చెపుతున్నారు. సోమవారం కూడా సెలవు దినం కావటంతో ఈ సినిమాకి కలెక్షన్ ఇంకా పెరిగే అవకాశం వుంది అని ట్రేడ్ అనలిస్ట్స్ అంటున్నారు. (#Salaar Collections)

ఇదిలా ఉండగా ఈ చిత్ర నిర్వాహకులు ఈ చిత్రం యొక్క మేకింగ్ వీడియో ని ఈరోజు విడుదల చేశారు. ఇందులో ప్రభాస్, పృథ్విరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran), శృతి హాసన్ (Shruti Haasan) అలాగే మిగతా నటులు వారి మీద తీసిన పోరాట సన్నివేశాలు అన్నీ ఒక చిన్న వీడియోలో పొందుపరచి విడుదల చేశారు. ఈ వీడియో ఇప్పుడు ప్రభాస్ అభిమానులని విపరీతంగా అలరిస్తోంది.

prabhas.jpg

ఈరోజు వరకు వచ్చిన కలెక్షన్స్ అదిరిపోయేట్టు వున్నాయి, అందుకని అలాంటివే ఇక ముందు కూడా ఉండాలని, ఆ సినిమాకి ఇంకా కొంచెం హైప్ ఇవ్వడానికి ఈ మేకింగ్ వీడియో ఈరోజు విడుదల చేసినట్టుగా కనపడుతోంది. ఈ సినిమాకి హోంబలే ఫిలిమ్స్ నిర్మాతలు. నైజాం ఏరియా హక్కులు ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ రూ.60 కోట్లకు కొనుగోలు చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ మూడు రోజుల్లో సగానికి పైగా వాళ్ళ పెట్టుబడి వచేసినట్టుగా తెలుస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా కలెక్షన్స్ విపరీతంగా ఉంటే, హిందీలో మాత్రం పరవాలేదు అనిపించింది. కన్నడంలో, తమిళంలో మాత్రం కొంచెం వెనకపడింది అని చెపుతున్నారు. మలయాళంలో కూడా కలెక్షన్స్ బాగున్నాయని అంటున్నారు. ఓవర్సీస్ మాత్రం ఇరగదీసింది అని చెపుతున్నారు. రేపటి నుండి ఈ సినిమాకి పరీక్ష అని, ఎందుకంటే సెలవులు సోమవారం తో అయిపోయాయి, మంగళవారం నుండి కలెక్షన్స్ ఎలా వుంటాయో చూడాలి అని అంటున్నారు.

Updated Date - Dec 25 , 2023 | 03:11 PM