RGV: సీఎం రేవంత్‌.. ఆర్జీవీ సంచ‌ల‌న ట్వీట్‌

ABN , First Publish Date - 2023-12-03T16:31:34+05:30 IST

నిత్య‌ వివాది రామ్‌గోపాల్ వ‌ర్మ మ‌రోసారి త‌న ట్వీట్‌తో సోష‌ల్‌మీడియాలో ర‌చ్చ లేపాడు. ఇప్పుడు ఈ పోస్టు సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అవుతున్న‌ది. ఎప్పుడు ఏదో ఓ విష‌యాన్ని గెలికి మ‌రి వివాదాలు ల‌చ్చుకేనే ఆర్జీవీ ఈ సారి తెలంగాణ ఎన్నిక‌లు, రేవంత్ రెడ్డి, కాంగ్రెస్‌పై త‌న శైలిలో పోస్టులు పెట్టి ఓ కొత్త చ‌ర్చ‌కు తెర లేపారు.

RGV: సీఎం రేవంత్‌.. ఆర్జీవీ సంచ‌ల‌న ట్వీట్‌
rgv

నిత్య‌వివాది రామ్‌గోపాల్ వ‌ర్మ మ‌రోసారి త‌న ట్వీట్‌తో సోష‌ల్‌మీడియాలో ర‌చ్చ లేపాడు. ఇప్పుడు ఈ పోస్టు సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అవుతున్న‌ది. ఎప్పుడు ఏదో ఓ విష‌యాన్ని గెలికి మ‌రి వివాదాలు ల‌చ్చుకేనే ఆర్జీవీ ఈ సారి తెలంగాణ ఎన్నిక‌లు, రేవంత్ రెడ్డి, కాంగ్రెస్‌పై త‌న శైలిలో పోస్టులు పెట్టి ఓ కొత్త చ‌ర్చ‌కు తెర లేపారు.


ఈరోజు (ఆదివారం 3.12.2023)న నాలుగు రాష్రాల ఎన్నిక‌ల ఫ‌లితాలు విడుద‌లవ‌గా రాజ‌స్థాన్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, ఛ‌త్తీస్ ఘ‌డ్ రాష్ట్రాల‌లో బీజేపీ విజ‌యం సాధించ‌గా తెలంగాణ‌లో మాత్రం కాంగ్రెస్ విజ‌యం సాధించింది. దీనిని ఉద్దేశించి రామ్ గోపాల్ వ‌ర్మ నాలుగు రాష్ట్రాల‌లో పోటీ చేసిన కాంగ్రెస్‌ మూడు రాష్ట్రాల‌లో ఓడింది అంటే అక్క‌డ‌ మీ ప్ర‌భావం ప‌ని చేయ‌లేద‌ని, తెలంగాణ‌లో గెలిచిందంటే ఆది రేవంత్ రెడ్డి వ‌ల్ల‌నే సాధ్య‌మ‌యింద‌ని ఇది ముమ్మాటికి రేవంత్ గెలుపేపన‌ని రేవంత్ లాంటి బాహుబ‌లి మీకు దొరికినందుకు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలు ఆయ‌న‌కు ధ‌న్య‌వాదాలు చెప్పాలి అంటూ సోష‌ల్ మీడియా వేదిక ఎక్స్‌లో ఓ ట్వీట్ చేశాడు. ఇప్పుడు ఇది ట్రెండింగ్‌లో ఉంది.


అదేవిధంగా జూన్ 26 2021న రేవంత్‌రెడ్డిని పీసీసీ ఆధ్య‌క్షుడిగా ప్ర‌క‌టించిన స‌మ‌యంలో ఆర్జీవీ రెస్పాండ్ అయి ‘మొత్తానికి ఇన్ని రోజుల‌కు అదిరిపోయే అద్భుత‌ నిర్ణ‌యం తీసుకున్న‌ది, ఓ సింహాన్ని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్య‌కుడిగా నియ‌మించింద‌ని ఇక పులుల‌న్నీ జాగ్ర‌త్త‌గా ఉండాలంటూ’ చేసిన‌ ఆర్జీవీ చేసిన ట్వీట్‌ను స్క్రీన్‌షాట్ పెట్టాడు.

అంతేగాక సూపర్ డూపర్ ప్రస్తుత ముఖ్యమంత్రి వారియర్ కింగ్ రేవంత్ రెడ్డిని చూస్తుంటే గర్వంగా ఉందని వారిద్దరు కలిసి ఉన్న ఓ ఫొటోను షేర్ చేశాడు.

Updated Date - 2023-12-03T17:18:17+05:30 IST