Biggboss 7 : డబుల్‌ ఎలిమినేషన్‌ .. ఇద్దరు అవుట్‌!

ABN , First Publish Date - 2023-11-27T10:00:26+05:30 IST

బిగ్‌బాస్‌ సీజన్‌-7 ఇంటి సభ్యుల్లో గ్లామర్‌ డాల్స్‌గా పేరు తెచ్చుకున్న అశ్విని, రతిక ఎలిమినేట్‌ అయ్యారు. ఈ ఇద్దరినీ ఆదివారం బయటకు సాగనంపారు. యావర్‌ ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌ తిరిగి ఇచ్చిన కారణంగా ఈ వారం డబుల్‌ ఎలిమినేషన్‌ ఉంటుందని వ్యాఖ్యాత నాగార్జున గత శనివారం ప్రకటించారు.

Biggboss 7 : డబుల్‌ ఎలిమినేషన్‌ .. ఇద్దరు అవుట్‌!

బిగ్‌బాస్‌ సీజన్‌-7 (Biggboss 7)ఇంటి సభ్యుల్లో గ్లామర్‌ డాల్స్‌గా పేరు తెచ్చుకున్న అశ్విని (Ashwini), రతిక (Rathika) ఎలిమినేట్‌ అయ్యారు. ఈ ఇద్దరినీ ఆదివారం బయటకు సాగనంపారు. యావర్‌ ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌ తిరిగి ఇచ్చిన కారణంగా ఈ వారం డబుల్‌ ఎలిమినేషన్‌ (Double elimination) ఉంటుందని వ్యాఖ్యాత నాగార్జున గత శనివారం ప్రకటించారు. అన్నట్లుగా శనివారం అశ్విని, ఆదివారం రతిక ఎలిమినేట్‌ అయ్యారు. వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీగా వచ్చిన అశ్విని తనదైన ఆటతీరుతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే నాలుగో వారం ఎలిమినేట్‌ అయిన రతిక, మళ్లీ హౌస్‌లోకి రీఎంట్రీ ఇచ్చింది. అయితే, రెండోసారి కూడా తన ఆట తీరును  మెరుగుపరుచుకోలేదు. దాంతో ప్రేక్షకుల నుంచి ఓటింగ్‌ తగ్గింది. ఈ ఆదివారం జరిగిన డబుల్‌ ఎలిమినేషన్  లో అశ్వినితోపాటు రతిక కూడా ఎలిమినేట్‌ అయింది. 

ఎలిమినేట్‌ అయి శనివారం బయటకు వచ్చిన అశ్విని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. బిగ్‌బాస్‌ సీజన్‌-7లో హౌస్‌ అంతా రెండు గ్రూపులుగా విడిపోయిందని చెప్పిన ఆమె అమర్‌, ప్రియాంక, శోభ ఒక గ్రూప్‌ అని, శివన్న, యావర్‌, పల్లవి ప్రశాంత్‌, రతిక మరో గ్రూపుగా ఆడుతున్నారని తెలిపింది. తను మాత్రం ఏకాకిగా ఉండటం వల్ల ఎలిమినేషన్కు వచ్చినట్టు చెప్పింది. గౌతమ్‌, అర్జున ఏ గ్రూప్‌ లోనూ లేరని చెప్పగా, మధ్య నాగార్జున అందుకొని హౌస్‌లో ఉన్న గ్రూపులకు పేర్లు కూడా ఉన్నాయన్నారు. ‘‘శోభా, ప్రియాంక, అమర్‌ గ్రూపు ‘స్పా’ బ్యాచ్‌, వీళ్లను ‘చుక్క బ్యాచ్‌’ అని కూడా అంటారు. శివాజీ, ప్రశాంత్‌, యావర్‌ గ్రూప్‌ ‘స్పై’ , వీళ్లను మొక్క బ్యాచ్‌ అని, ఈ రెండు గ్రూపులకు చెందని వారు తొక్క బ్యాచ్‌ అంటూ సరదాగా ఆటపట్టించారు నాగ్‌.

ఎవరు హిట్టు.. ఎవరు ఫ్లాపు.. 

హౌస్‌ నుంచి ఎలిమినేట్‌ అయి, వేదికపైకి వచ్చిన అశ్విని బిగ్‌బాస్‌లో తన జర్నీ చూసి ఎమోషనల్‌ అయింది. ప్రస్తుతం ఉన్న ఇంటి సభ్యుల్లో ఎవరు హిట్‌? ఎవరు ష్లాప్‌ అని నాగార్జున అడగ్గా, అందరూ బాగా ఆడుతున్నారని, లేకపోతే ఇన్ని రోజులు హౌస్‌లో ఉండేవారు కాదని చెప్పింది. ‘ఇలాంటి సేఫ్‌ గేమ్‌ ఆడి నువ్వు సెల్ఫ్‌ నామినేషన్‌ చేసుకుని ఎలిమినేట్‌ అయ్యావు’ అంటూ నాగార్జున చురక అంటించడంతో హౌస్‌లో ఉన్న వాళ్ల గురించి ఇలా చెప్పింది అశ్విని. 

ప్రశాంత్‌: సూపర్‌ హిట్‌. కానీ, కొన్నిసార్లు మాట వినడు.

ప్రియాంక:  ఫ్లాప్‌.. గట్టిగా అరుస్తుంది. నోరు పారేసుకుంటుంది.

గౌతమ్‌: హిట్‌.. హౌస్‌లో గ్రూపులున్నా సోలోగా ఆడతాడు.

శోభా: ఎప్పుడూ హిట్‌. పటాకా. పైకి కోపంగా కనిపిస్తుంది కానీ, మనుషుల్ని అర్థం చేసుకుంటుంది.

అర్జున్‌: సూపర్‌ హిట్‌. గేమ్‌ను ఒక ప్రణాళిక ప్రకారం ఆడతాడు. తన టీమ్‌లో ఉన్న వాళ్లను కూడా అలాగే ఆడిస్తాడు. 

శివాజీ: హిట్‌. అయితే, ఒక చిన్న సలహా అందరినీ కలుపుకొని వెళ్తే బాగుంటుంది. ఎప్పుడూ ప్రశాంత్‌, యావర్‌, రతికలే కాకుండా మిగిలిన వాళ్లను కూడా పట్టించుకోండి. మధ్యలో శివాజీ అందుకొని పిలవగానే అశ్విని పలకదు. అందుకే దూరంగా ఉన్నాను అన్నారు. 

అమర్‌:  హిట్‌. కానీ అమాయకుడు. ఎవరు ఏది చెప్పినా నమ్మేస్తాడు!

యావర్‌: మంచి స్నేహితుడు. యావర్‌ కూడా సూపర్‌ హిట్‌.  

రతిక: గేమ్‌ అంటే భయపడుతూ ఉంటుంది. ప్రస్తుతానికి రతిక ఫ్లాప్‌. 


Updated Date - 2023-11-27T14:10:06+05:30 IST