Ram Pothineni: రామ్ పోతినేని అభిమాని తన కుమారుడికి పేరు ఏమి పెట్టాడో తెలిస్తే షాకవుతారు

ABN , First Publish Date - 2023-09-16T16:24:10+05:30 IST

రామ్ పోతినేని అభిమాని అప్పుడే పుట్టిన తన కుమారుడికి నామకరణం చేసాడు. ఆ ఉత్సవానికి రామ్ అభిమానులని కూడా ఆహ్వానించాడు, ఇంతకీ అతను తన కుమారుడికి పెట్టిన పేరు ఏంటో తెలుసా...

Ram Pothineni: రామ్ పోతినేని అభిమాని తన కుమారుడికి పేరు ఏమి పెట్టాడో తెలిస్తే షాకవుతారు
Ram Pothineni fan Harihara son's naming ceremony

తెలుగులో నటులకి ఉన్నంత అభిమాన సంఘాలు, అభిమానులు ప్రపంచంలో మరెక్కడా ఉండరేమో. తమ అభిమాన నటుడిని చూడటానికి ఒక్కోసారి కొన్ని వందల మైళ్ళు కూడా ప్రయాణించి వస్తూ వుంటారు. ఈ అభిమానం తెలుగులో ఇంకా ఎక్కువ ఉంటుంది, తెలుగు నటులు తమ సినిమాలు విడుదల అయినప్పుడు మొదటి మూడురోజులు ఈ అభిమానులమీదే చాలా ఆశలు పెట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళకే సినిమా ముందు నచ్చాలి, నచ్చితే వాళ్ళీ 'బాగుంది' అనే మాటను ప్రచారం చేస్తారు.

ఇప్పుడు రామ్ పోతినేని (RamPothineni) అభిమాని ఒకరు ఏమి చేసారో తెలిస్తే షాకవుతారు. ఆ అభిమాని చేసిన పనికి రామ్ కూడా చాల సంతోషించి ట్విట్టర్ లో తన శుభాకాంక్షలు తెలియచేయడం ఆ అభిమానికి మరికొంచెం ఆనందంలో మునిగిపోతాడు. రామ్ ఫాన్స్ అసోసియేషన్ కి చెందిన సందీప్ అనే అతను రామ్ అభిమాని అయిన హరిహర కొడుకు నామకరణ (Naming ceremony) మహోత్సవానికి వెళ్ళాడు. అతను రామ్ అభిమాని కావటంతో అతని కుమారుడి పేరు 'స్కంద' #Skanda అని నామకరణం చేసాడు. 'స్కంద' సినిమా రామ్ రాబోయే సినిమా. బోయపాటి శ్రీను (BoyapatiSreenu) దీనికి దర్శకుడు, శ్రీలీల (Sreeleela) ఇందులో కథానాయకురాలు.

rampothineni7.jpg

ఇదే విషయాన్ని సందీప్ తన ట్విట్టర్ లో పంచుకుంటూ హరిహర అనే రామ్ అభిమాని తన కుమారుడి పేరు 'స్కంద' గా నామకరణం చేసాడని పెట్టాడు. అది చూసిన రామ్ పోతినేని వెంటనే దానికి స్పందిస్తూ, ఇది నా మనసుకు చాలా హత్తుకుంది. ఆ పిల్లవాడికి స్కంద దేవుడు యొక్క ఆశీర్వచనాలు ఎల్లప్పుడూ వుంటాయని అన్నాడు. అలాగే ఆ అభిమానికి, అతని కుటుంబానికి దేవుడు చల్లగా చూడాలి అని ట్వీట్ చేసాడు రామ్. ఇది ఇప్పుడు సాంఘీక మాధ్యమంలో బాగా వైరల్ అయింది.

Updated Date - 2023-09-16T20:16:17+05:30 IST