సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Ram Charan and Upasana: మాల్దీవుల్లో ఉన్నా.. మరిచిపోలేదండోయ్..

ABN, First Publish Date - 2023-04-11T18:31:23+05:30

మాల్దీవులకు వెళ్లినా కూడా ఓ విషయం మాత్రం రామ్ చరణ్ మరియు ఉపాసన జంట మరిచిపోలేదు. అదేమిటంటే..

Ram Charan and Upasana
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (MegaPower Star Ram Charan), ఉపాసన (Upasana) ప్రస్తుతం వెకేషన్ నిమిత్తం మాల్దీవులకు వెళ్లిన విషయం తెలిసిందే. అంతకు ముందు దుబాయ్‌(Dubai)లో ఉపాసన బెస్ట్ ఫ్రెండ్స్, సిస్టర్స్ కలిసి ఆమెకు సీమంతం వేడుక (Upasana Baby Shower Party)ను నిర్వహించారు. ఈ వేడుకలో రామ్ చరణ్, ఉపాసన వైట్ డ్రస్‌లో కనిపించి అలరించారు.

ఈ వేడుక తర్వాత ఇద్దరూ వెకేషన్ నిమిత్తం మాల్దీవులకు (Maldives) వెళ్లారు. వారు మాల్దీవులకు వెళ్లే సమయంలో ఈ జంట ఎయిర్‌పోర్ట్‌లో దర్శనమిచ్చిన విషయం తెలిసిందే. ఇంక మాల్దీవులకు వెళ్లినా కూడా ఓ విషయం మాత్రం ఈ జంట మరిచిపోలేదు. అదేమిటంటే.. నేషనల్ పెట్ డే (National Pet Day).

రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ (Global Star) ఇమేజ్‌తో వృత్తిపరంగా శిఖరాగ్రంలో ఉన్నారు. ఆయనకు సినిమాలే కాకుండా మూగజీవాలపై కూడా మక్కువ ఎక్కువ. చరణ్ మాత్రమే కాదు.. ఉపాసన కూడా మూగజీవాలంటే ఎంతో ప్రేమ చూపిస్తుంది. ఈ దంపతులిద్దరూ మూగజీవాలెన్నింటికో ఆశ్రమం కల్పిస్తున్న విషయం తెలిసిందే.

నిత్యం మూగజీవాలకు ఆహారం పెడుతూ, వాటిని సంరక్షిస్తూ.. వ్యక్తిగత జీవితంలో కూడా వారు సంతోషంగా జీవిస్తూ ఉంటారు. ఇక ఈ క్రమంలో ఈ మధ్య రామ్ చరణ్, ఉపాసన దగ్గర ఓ కుక్కపిల్ల బాగా హైలెట్ అవుతుంది. రామ్ చరణ్ ఎక్కడికి వెళితే అక్కడ అది కనిపిస్తుంది. ఆఖరికి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రమోషన్స్‌లో కూడా ఆ కుక్కపిల్ల రామ్ చరణ్‌ని, రామ్ చరణ్ ఆ కుక్కపిల్లని వదలలేదు. అదంటే రామ్ చరణ్‌కు అంత ఇష్టం మరి.

చరణ్ ఆ కుక్కపిల్లకి రైమ్ (Rhyme) అని పేరు పెట్టి.. ఓ ఇన్‌స్టాగ్రమ్ అకౌంట్ కూడా ఓపెన్ చేశారు. ఈ అకౌంట్‌ని దాదాపు 50 వేల మంది ఫాలో కూడా అవుతున్నారు. రామ్ చరణ్ ఎక్కువగా రైమ్‌తో కనిపిస్తూ ఉంటారు. చరణ్, ఉప్సీ దంపతులిద్దరికీ రైమ్ అంటే ప్రాణమని, రైమ్‌ని వారు ఒక బిడ్డలాగా చూసుకుంటారని కుటుంబ సభ్యులు చెబుతుంటారు. (Ram Charan with Rhyme)

రైమ్ ఒక్కటే కాదు.. రామ్ చరణ్‌కి గుర్రాలంటే కూడా చాలా ఇష్టం. ఆ విషయం స్వయంగా రామ్ చరణే ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఆయనకి పుట్టినరోజు గిఫ్ట్‌గా గుర్రాలను ఇచ్చిన వారు కూడా ఉన్నారు. ప్రస్తుతం రామ్ చరణ్, ఉపాసనల ఆశ్రమంలో గుర్రాలు, శునకాలు చాలా ఉన్నాయి. (Upasana with Rhyme)

ఆ మధ్య ‘మగధీర’ (Magadheera) సినిమాలో ‘బాద్షా’గా కనిపించే గుర్రం రామ్ చరణ్ సొంతది అని కూడా అప్పట్లో వార్తలు వైరల్ అయ్యాయి. ఇలా మూగజీవాల కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ.. అందులోనూ ఇద్దరం (చరణ్, ఉపాసన) సంతోషాన్ని పంచుకుంటామని పలు ఇంటర్వ్యూలలో రామ్ చరణ్ కూడా చెప్పి ఉన్నారు.

ఇక విషయంలోకి వస్తే.. రామ్ చరణ్, ఉపాసన (Ram Charan and Upasana) మాల్దీవులలో ఉన్నప్పటికీ.. నేషనల్ పెట్ డే‌ (April 11)ని పురస్కరించుకుని రైమ్‌తో ఉన్న కొన్ని ఫొటోలను విడుదల చేశారు. రైమ్‌తో వారు ఎంతగా కనెక్ట్ అయ్యారనే విషయాన్ని ఈ ఫొటోలు తెలియజేస్తున్నాయి. ఈ ఫొటోలతో పాటు రామ్ చరణ్ తన ట్విట్టర్‌లో మాల్దీవులలో ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను కూడా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. (Ram Charan and Upasana in Vacation)

రామ్ చరణ్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం చరణ్.. కోలీవుడ్ స్టార్ దర్శకుడైన శంకర్ (Shankar) దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) చిత్రం చేస్తున్నారు. ఈ సినిమా అనంతరం బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) దర్శకత్వంలో మరో చిత్రానికి కమిటై ఉన్నారు. ఇవి రెండూ కాకుండా మరో రెండు సినిమాలు చర్చల దశలో ఉన్నట్లుగా సమాచారం.


ఇవి కూడా చదవండి:

*********************************

*Allu Aravind: సాయిధరమ్ ఫోన్ చేస్తుంటే.. గీతా ఆర్ట్స్‌లో సినిమా అడుగుతాడనుకున్నా.. కానీ?

*Raghava Lawrence: రామ్ చరణ్‌లో నాకు నచ్చింది ఏమిటంటే..

*Samantha: నేను ఫేస్ చేసిన స‌మ‌స్య‌ల వ‌ల్లే.. ఇప్పుడిలా మారిపోయా!

*NTR 2 NTR: ‘ఆది’.. జూనియర్ ఎన్టీఆర్ టు సీనియర్ ఎన్టీఆర్.. మాస్ అప్‌డేట్

*Renu Desai: నా బాధ అర్థం చేసుకునే వ్యక్తి ఉన్నందుకు ధైర్యంగా ఉంది

Updated Date - 2023-04-11T18:31:25+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!