Project K: అభాసు పాలైన ప్రభాస్ లుక్

ABN , First Publish Date - 2023-07-19T19:11:39+05:30 IST

ప్రభాస్ ఫస్ట్ లుక్ 'ప్రాజెక్ట్ కె' నుండి సాంఘీక మాధ్యమం లో వైజయంతి మూవీస్ సంస్థ విడుదల చేసింది. అసలే 'ఆదిపురుష్' అనే సినిమాతో ప్రభాస్ అభిమానులు దెబ్బ తగిలి నిరాశలో ఉంటే, ఈ 'ప్రాజెక్ట్ కె' లుక్ పుండు మీద కారం చల్లినట్టుగా అభిమానులను మరింత కృంగదీసింది అని సాంఘీక మాధ్యమం లో ఈ లుక్ మీద విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు.

Project K: అభాసు పాలైన ప్రభాస్ లుక్
Robert Downey Jr from Iron Man and Prabhas from Project K

ప్రభాస్ (Prabhas) అభిమానులు పాపం 'ఆదిపురుష్' #Adipurush సినిమా ఫ్లాప్, ఆ సినిమాకి వచ్చినంత నెగటివిటీ నుండి తేరుకోక ముందే 'ప్రాజెక్ట్ కె' #ProjectK రూపంలో ఇంకో దెబ్బ పడింది అని అనుకుంటున్నారు. లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్ (AmitabhBachchan), ఇంకో లెజెండరీ నటుడు కమల్ హాసన్ (KamalHaasan), బాలీవుడ్ అగ్ర నటి దీపికా పదుకోన్ (DeepikaPadukone), ఇంకో బాలీవుడ్ నటి దిశా పటాని (DishaPathani), ఇంత మంది ప్రభాస్ లీడ్ యాక్టర్ గా నటిస్తున్న ఈ 'ప్రాజెక్ట్ కే' నుండి ప్రభాస్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. దీనికి ముందు చాలా గొప్పగా ప్రచారాలు కూడా చేశారు. 'మహానటి' #Mahanatiలాంటి అవార్డు సినిమాకి దర్శకత్వం వహించిన నాగ్ అశ్విన్ (NagAshwin) ఈ 'ప్రాజెక్ట్ కె' కి దర్శకుడు.

projectkprabhas.jpg

ఇంతమంది భారీ తారాగణం, ఇంత పెద్ద ప్రాజెక్ట్, ఈ ఫస్ట్ లుక్ లో ప్రభాస్ వైవిధ్యంగా ఉంటాడు అనుకుంటే, అభిమానులను నిరాశ పరిచే విధంగా ప్రభాస్ లుక్ వుంది. ఎప్పుడైతే వైజయంతి మూవీస్ బ్యానర్ ప్రభాస్ లుక్ పెట్టిందో, వెంటనే అందరూ ఈ లుక్ ని ట్రోల్ చెయ్యడం మొదలెట్టేసాడు. 'అరె ఈ లుక్ ఎక్కడో చూసినట్టుంది, ఐరన్ మేన్ (IronMan) లుక్ కూడా ఇలానే ఉంటుంది కదా, లేదా ఐరన్ మేన్ ఫోటోలో అతని తల తీసి ప్రభాస్ తల అతికించారా ఏంటి', ఇలా వెంట వెంటనే ఈ లుక్ మీద ట్రోల్ చేస్తూనే వున్నారు.

projectkprabhas1.jpg

ట్రోల్ చెయ్యడం మాట అటుంచితే, అసలు ప్రభాస్ లుక్ కూడా 'ఐరన్ మేన్' రాబర్ట్ డౌనీ జూనియర్ (RobertDowneyJr) లుక్ నుండి కాపీ కొట్టినట్టు వుంది. మరి నాగ్ అశ్విన్ ఎందుకు ప్రభాస్ మొదటి లుక్ ఇలాంటిది విడుదల చేసాడో అని అందరూ అనుకుంటున్నారు. అసలే 'ఆదిపురుష్' సినిమా పోవటం అటుంచి, ఆ సినిమా ప్రభాస్ కి చాలా నెగటివిటీ ని తీసుకువచ్చింది. తప్పుల తడకలతో, రామాయణం ఆధారంగా తీసాం అని చెప్పి, అందుకు పూర్తి విరుద్ధంగా తీసిన సినిమా 'ఆదిపురుష్'. ఆ సినిమా ప్రభాస్ తో సహా ఆ సినిమాకి పని చూసినవాళ్లందరూ నవ్వుల పాలయ్యారు, విపరీతంగా ట్రోల్ చేయబడ్డారు కూడా.

ఇంకా దాని నుండి తేరుకోక ముందే ఇదిగో ఈ 'ప్రాజెక్ట్ కె' ఐరన్ మేన్ లుక్ తో మరికొంచెం అభిమానులను నిరాశ పరిచింది. ఇది ఒక ఫ్యాన్ మేడ్ పోస్టర్ లా ఉందని కొందరు అభిప్రాయపడుతుంటే, పోస్టర్ ఇలా ఉంటే, సినిమాలో ఇంకేమి చూపించబోతున్నారో అని ఇంకొందరు ఇలా ఈ సినిమా మీద అప్పుడే నెగటివిటీ మొదలయింది. ఈ సినిమా ఒక్క తెలుగులోనే కాకుండా, చాలా భాషల్లో ప్రపంచం అంతా విడుదల కాబోతోంది.

Updated Date - 2023-07-19T19:11:39+05:30 IST