Prabhas: పుట్టిన రోజు సందర్భంగా ప్రభాస్ కి భారీ కానుక, మొదటిసారి ఇలా...

ABN , First Publish Date - 2023-10-23T14:05:43+05:30 IST

ప్రభాస్ అభిమానులు, ప్రభాస్ పుట్టినరోజు అయిన ఈరోజు హైద్రాబాదులోని కూకట్ పల్లి లో ఒకా భారీ కట్ అవుట్ ఏర్పాటు చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇది ఇండియాలోనే అత్యంత ఎత్తయిన కట్ అవుట్ అని అంటున్నారు.

Prabhas: పుట్టిన రోజు సందర్భంగా ప్రభాస్ కి భారీ కానుక, మొదటిసారి ఇలా...
Actor Prabhas

ప్రభాస్ (Prabhas) సినిమాలు ఎప్పుడు విడుదల అవుతాయా అని ప్రపంచ స్థాయిలో సినిమా ప్రేక్షకులు ఎదురు చూస్తూ వుంటారు. ఈ డిసెంబర్ 22 వ తేదీన 'సలార్' #Salaar మొదటిపార్టు సినిమా విడుదలవుతోంది. ప్రశాంత్ నీల్ (PrashanthNeel) దీనికి దర్శకుడు. ఈ సినిమా టీజర్ ఇంతకు ముందే విడుదలైంది, అది వైరల్ కూడా అయింది. ఈ సినిమా మొదట సెప్టెంబర్ లో అనుకున్నారు, కానీ ఇప్పుడు డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకి రాబోతోంది.

ఇదిలా ఉండగా, ఈరోజు అంటే అక్టోబర్ 23, ప్రభాస్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ప్రభాస్ అభిమానులు ప్రభాస్ కి ఒక భారీ కానుకని ఇచ్చారు. అది ఏంటంటే, కూకట్ పల్లి లో దేశంలోనే అతి పెద్దదైన ప్రభాస్ కట్ అవుట్ ఏర్పాటు చేశారు. దీనిని ఈరోజు ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు ఊరేగింపుగా ఈ కట్ అవుట్ వున్న ప్రదేశానికి చేరుకొని, పూలతో, పాలతో ఈ ప్రభాస్ కట్ అవుట్ కి అభిషేకం చేస్తున్నారు. (Prabhas fans erected huge cut out of him which is the biggest in India at Kukatpally)

prabhas-cutout1.jpg

ఈరోజు దసరా పండగ కూడా అవటంతో, సెలవు దినం కావటంతో అభిమానులు వెల్లువలా వచ్చారు. ఇది దేశంలోనే అతి పెద్ద కట్ అవుట్ అని అంటున్నారు. 'బాహుబలి' #Baahubali సినిమా ప్రభాస్ ని ప్రపంచ స్థాయికి తీసుకు వెళ్ళింది, ఇప్పుడు అందుకు తగ్గట్టుగానే ప్రభాస్ రాబోయే సినిమాలు అన్నీ వున్నాయి. 'సలార్' #Salaarరెండు పార్టులు, 'కల్కి 2898 ఏడి', డైరెక్టర్ మారుతీ (DirectorMaruthi) తో 'రాజా డీలక్స్', సందీప్ రెడ్డి వంగా (SandeeReddyVanga) తో 'స్పిరిట్' సినిమాలు చేతిలో వున్నాయి. ఇవన్నీ ప్రపంచ స్థాయి ప్రేక్షకులు ఎదురు చూసే విధంగా ఉన్నాయని ఆ సినిమాలు చూస్తేనే తెలుస్తోంది.

Updated Date - 2023-10-23T14:05:43+05:30 IST