Sensational Payal Ghosh: బాలీవుడ్ లో అయితే బట్టలిప్పేస్తారు, సౌత్ లో అలా కాదు

ABN , First Publish Date - 2023-10-02T11:54:32+05:30 IST

'ప్రయాణం' లో కథానాయకురాలిగా చేసిన పాయల్ ఘోష్ మరోసారి వార్తల్లో వుంది. ఈసారి బాలీవుడ్ మీద మరో సంచలన కామెంట్ తన సాంఘీక మాధ్యమంలో పెట్టింది. అలాగే తాను ఎన్టీఆర్ తో నటించిన 'ఊసరవెల్లి' సినిమా గురించి కూడా ఏముందో తెలుసా...

Sensational Payal Ghosh: బాలీవుడ్ లో అయితే బట్టలిప్పేస్తారు, సౌత్ లో అలా కాదు
Payal Ghosh

పాయల్ ఘోష్ (PayalGhosh) గుర్తుంది కదా, తెలుగులో మంచు మనోజ్ (ManchuManoj) పక్కన 'ప్రయాణం' #Prayanam అనే సినిమాతో ఆరంగేట్రం చేసింది. ఆ సినిమా తరువాత పాయల్ ఘోష్ పేరు కూడా ఆ సినిమాలో వేసిన పాత్ర పేరే చాలా సంవత్సరాలు పిలిచారు. అందులో పాయల్, హారిక అనే పాత్రలో కనిపించింది, చంద్రశేఖర్ యేలేటి (ChandrasekharYeleti) దీనికి దర్శకుడు. ఈ సినిమా చాలా బాగుంటుంది, అందరూ మెచ్చుకున్నారు కూడా. ఆ తరువాత కొన్నాళ్ళకి హారిక పేరు మానేసి తన అసలు పేరు అయిన పాయల్ ఘోష్ నే ఉంచుకుంది.

payalghosh.jpg

పాయల్ ఘోష్ అప్పుడప్పుడూ వార్తల్లో ఉంటూ ఉంటుంది. ఎక్కువగా బాలీవుడ్ గురించి మాట్లాడుతూ ఉంటుంది. ఆమధ్య బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కాశ్యప్ (AnuragKashyap) మీద సంచనల ఆరోపణలు చేసిన పాయల్ ఘోష్, తరువాత ఎన్టీఆర్ (NTR) ని ఒక సందర్భంలో బాగా సపోర్ట్ చేసింది. పవన్ కళ్యాణ్ పక్కన (PawanKalyan) 'బంగారం' #Bangaram సినిమాలో నటించిన మీరా చోప్రా (MeeraChopra) ఎన్టీఆర్ ఎవరో తెలియదు అనగానే, ఎన్టీఆర్ అభిమానులు ఆమెని బాగా ట్రోల్ చేశారు, అప్పుడు ఆమె ఫిర్యాదు చెయ్యడమే కాకుండా, ఎన్టీఆర్ కి టాగ్ చేస్తూ అప్పట్లో ట్విట్టర్ లో పెట్టింది.

payalghosh2.jpg

ఆ సమయంలో పాయల్ ఘోష్ తన సాంఘీక మాధ్యమం ద్వారా ఎన్టీఆర్ అభిమానులకి సపోర్ట్ గా నిలించింది. ఆలా వార్తల్లో వున్న పాయల్ ఘోష్ తాజా గా సాంఘీక మాధ్యమంలో సంచలన కామెంట్స్ చేసింది. "నేను దక్షిణాది సినిమాతో ఆరంగేట్రం చేసాను కాబట్టి సరిపోయింది, అదే బాలీవుడ్ లో అయితే బట్టలిప్పేసేవారు చూపించడానికి, అక్కడ క్రియేటివిటీ కన్నా అమ్మాయిల అవయవ సౌందర్యం మీదే ఆధారపడతారు," అని చెప్పింది. పాయల్ ఘోష్ కొన్ని హిందీ సినిమాలలో నటించినా ఆమెకి అక్కడ అంతగా పేరు మాత్రం రాలేదు.

payalghosh3.jpg

ఇప్పుడు ఆమె సినిమాలు ఓటిటి లో వస్తున్నాయి అని ఆమె ట్వీట్ చేసింది. అలాగే 'ఊసరవెల్లి' #Osaravelli సినిమా కూడా నెట్ ఫ్లిక్స్ లో వచ్చేట్టు చూడు అని ఎన్టీఆర్ ని టాగ్ చేస్తూ సాంఘీక మాధ్యమంలో పెట్టింది పాయల్. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Updated Date - 2023-10-02T11:54:32+05:30 IST