Gabbar Singh vs Gudumba Shankar: రాంగ్ టైంలో తప్పుడు నిర్ణయం.. బండ్ల గణేష్‌పై పవన్ ఫ్యాన్స్ ఫైర్

ABN , First Publish Date - 2023-08-10T18:37:35+05:30 IST

బండ్ల గణేష్ మరోసారి వార్తల్లో వున్నాడు. ఈసారి తన గురువు అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ సినిమా రి రిలీజ్ విషయంలోనే. నాగబాబు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా 'గుడుంబా శంకర్' సినిమా విడుదల చేస్తున్నాం అని ఎప్పుడో ప్రకటించారు, అయితే నిన్న బండ్ల గణేష్ తను పవన్ కళ్యాణ్ తో నిర్మించిన 'గబ్బర్ సింగ్' సినిమా కూడా మళ్ళీ విడుదల చేస్తున్నట్టు ట్విట్టర్ లో ప్రకటించాడు. దీనికి పవన్ కళ్యాణ్ అభిమానులు చాలా ఘాటుగా స్పందించారు...

Gabbar Singh vs Gudumba Shankar: రాంగ్ టైంలో తప్పుడు నిర్ణయం.. బండ్ల గణేష్‌పై పవన్ ఫ్యాన్స్ ఫైర్
Gudumba Shankar vs Gabbar Singh

ఇప్పుడు తెలుగు చిశ్ర పరిశ్రమలో రీ-రిలీజ్ ట్రెండ్ బాగా నడుస్తోంది. ‘పోకిరి’ #Pokiri సినిమాతో మొదలైన ఈ ట్రెండ్‌కి అభిమానుల నుంచి విశేష ఆదరణ లభించడంతో.. నిర్మాతలు వరుసగా పాత సినిమాల్ని రీ-రిలీజ్ చేయడం మొదలుపెట్టారు. ముఖ్యంగా కల్ట్ ఫాలోయింగ్, గతంలో మంచి విజయాలు నమోదు చేసిన సినిమాల్నే తిరిగి థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (PawanKalyan) పుట్టినరోజు సందర్భంగా ‘గుడుంబా శంకర్’ని #GudumbaShankar విడుదల చేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు. మెగాబ్రదర్ నాగబాబు (MegaBrotherNagababu) నిర్మించిన ఈ సినిమా రీ-రిలీజ్ పనులు ఇప్పటికే జరుగుతున్నాయి. ఆగస్టు 31వ తేదీన ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇంతకుముందు ‘జల్సా’, #Jalsa ‘ఆరెంజ్’ సినిమాల్ని రీ-రిలీజ్ చేసినప్పుడు వచ్చిన కలెక్షన్లను ఎలాగైతే జనసేన పార్టీ ఫండ్‌గా ఇచ్చారో.. ‘గుడుంబా శంకర్’ ద్వారా వచ్చే ప్రతీ రూపాయిని పార్టీ ఫండ్‌కి అంకితం చేయబడుతుందని నాగబాబు స్పష్టం చేశారు కూడా!

gabbarsingh.jpg

ఇలాంటి తరుణంలో నిర్మాత బండ్ల గణేష్ (BandlaGanesh) ఎంట్రీ ఇచ్చి ఓ షాకింగ్ ట్విస్ట్ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ కెరీర్‌కి మంచి బూస్ట్ ఇవ్వడంతో పాటు ఆయన కెరీర్‌లోనే ఓ మైల్‌స్టోన్‌గా నిలిచిపోయిన ‘గబ్బర్ సింగ్’ #GabbarSingh సినిమాను రీ-రిలీజ్ చేయబోతున్నానని ప్రకటించాడు. ‘‘సెప్టెంబర్ 2వ తేదీన పవర్ స్టార్ రేంజ్ ఏంటో, పవర్ స్టార్ స్టామినా ఏంటో 'గబ్బర్ సింగ్' ద్వారా మరోసారి చూపిస్తాం’’ అంటూ ట్వీట్ చేశాడు. అంతే.. ఈ ట్వీట్ చేసినప్పటి నుంచి, పవన్ ఫ్యాన్స్ బండ్ల గణేష్‌పై విరుచుకుపడుతున్నారు. రాంగ్ టైంలో తప్పుడు నిర్ణయం తీసుకున్నావంటూ అతనిపై మండిపడుతున్నారు. నిజానికి.. ఈ ప్రకటనతో పవన్ ఫ్యాన్స్ చాలా సంతోషించాలి. అప్పట్లో రికార్డులు తిరగరాసిన ‘గబ్బర్ సింగ్’ను మరోసారి థియేటర్లలో చూసే అవకాశం వస్తున్నందుకు.. పండగ చేసుకోవాలి. పైగా.. ‘గబ్బర్ సింగ్’ రీ-రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో వేచి చూశారు కూడా! ఇప్పుడు ఆ సమయం రానే వచ్చినప్పుడు.. ఫ్యాన్స్ ఎగ్జైట్ అవ్వకుండా బండ్లపై రివర్స్‌లో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇందుకు కారణం.. ‘గుడుంబా శంకర్’ రీ-రిలీజే!

gudumbashankar.jpg

బండ్ల గణేశ్ కంటే ముందు పవన్ బర్త్‌డే సందర్భంగా ‘గుడుంబా శంకర్’ని రిలీజ్ చేయబోతున్నట్టు నాగబాబు ప్రకటించారు. అంతేకాదు.. ఈ చిత్రం ద్వారా వచ్చే డబ్బుల్ని పార్టీ ఫండ్‌గా ఇవ్వనున్నారు. పవన్ ఇప్పుడు పాలిటిక్స్‌లో యాక్టివ్‌గా ఉన్న తరుణంలో.. 'గుడుంబా శంకర్' ద్వారా వచ్చే డబ్బులు పవన్ పొలిటికల్ వ్యవహారాలకు తోడ్పడుతాయి. కానీ.. 'గబ్బర్ సింగ్' సినిమాకి వచ్చే కలెక్షన్లు మాత్రం నేరుగా బండ్ల ఖాతాలోకే వెళ్తాయి. దీనికితోడు.. 'గుడుంబా శంకర్‌' రిలీజ్‌ని ముందుగానే అనౌన్స్ చేశారు. అందుకే.. ఇప్పుడు ‘గబ్బర్ సింగ్’ని రిలీజ్ చేయొద్దని పవన్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అవసరమైతే వచ్చే ఏడాది రిలీజ్ చేసుకోమ్మని, ఇప్పుడు 'గుడుంబా శంకర్' ఉంది కాబట్టి ఆ సినిమాని రిలీజ్ చేయొద్దని సూచిస్తున్నారు. మరి.. బండ్ల గణేష్ వెనక్కు తగ్గుతాడా? లేక మొండికెళ్లి రిలీజ్ చేస్తాడా? లెట్స్ వెయిట్ అండ్ సీ!

Updated Date - 2023-08-10T18:38:07+05:30 IST