ShahRukhKhan: రామ్ చరణ్‌‌ను తెలుగులో ఓ కోరిక కోరిన షారుఖ్

ABN , First Publish Date - 2023-01-10T18:46:56+05:30 IST

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan).. మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌ (Ram Charan)ను, ఆర్ఆర్ఆర్ టీమ్‌ను ట్విట్టర్ వేదికగా ఓ కోరిక కోరారు. తాజాగా షారుఖ్ ఖాన్ నటించిన..

ShahRukhKhan: రామ్ చరణ్‌‌ను తెలుగులో ఓ కోరిక కోరిన షారుఖ్
Shahrukh Khan and Ram Charan

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan).. మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌ (Ram Charan)ను, ఆర్ఆర్ఆర్ టీమ్‌ను ట్విట్టర్ వేదికగా ఓ కోరిక కోరారు. తాజాగా షారుఖ్ ఖాన్ నటించిన ‘పఠాన్’ (Pathaan) చిత్ర తెలుగు ట్రైలర్‌ని రామ్ చరణ్ ట్విట్టర్ వేదికగా విడుదల చేసి.. సినీ చరిత్రలో ఇప్పటి వరకు రానటువంటి యాక్షన్ ఎపిసోడ్స్‌లో మిమ్మల్ని చూసేందుకు ఎంతగానో వెయిట్ చేస్తున్నానని తెలుపుతూ.. చిత్రయూనిట్ మొత్తానికి శుభాకాంక్షలు తెలిపాడు. ఈ ట్వీట్‌కు రిప్లయ్ ఇస్తూ.. షారుఖ్ తెలుగులో (తెలుగు భాషలో కాదు) ఓ ట్వీట్ చేశారు. ఇప్పుడా ట్వీట్ వైరల్ అవుతోంది. (Pathaan Trailer Released)

‘‘ట్రైలర్ విడుదల చేసినందుకు ధన్యవాదాలు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్. మీ ఆర్ఆర్ఆర్ టీమ్ ఆస్కార్‌ని ఇంటికి తెచ్చినప్పుడు ఒక్కసారి నన్ను దానిని టచ్ చెయ్యనివ్వండి! (Mee RRR team Oscar ni intiki tecchinappudu okkasaari nannu daanini touch cheyyanivvandi!).. లవ్ యూ..’’ అని రామ్ చరణ్‌ని షారుఖ్ ఖాన్ కోరారు. ఈ ట్వీట్‌కు రామ్ చరణ్ స్పందిస్తూ.. ‘తప్పకుండా షారుఖ్ సార్.. ఆ అవార్డ్ (Oscar) ఇండియన్ సినిమా (Indian Cinema) మొత్తానికి చెందినది’ అని పేర్కొన్నారు.


ప్రస్తుతం ఈ ట్వీట్స్ అన్నీ.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మెగా ఫ్యాన్స్ ఈ ట్వీట్స్ చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్‌కు ఆస్కార్ రావాలని, ఆ అవార్డును షారుఖ్ చేతుల్లో చూడాలని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక షారుఖ్ విషయానికి వస్తే.. ఇటీవల ఆయన ఓ ఇంటర్వ్యూలో.. తన పిల్లలు రామ్ చరణ్‌ని ఎంతగానో ఇష్టపడతారని తెలిపిన విషయం తెలిసిందే. అలాగే చరణ్ ‘బ్రూస్‌లీ’ సినిమా సెట్స్‌లో కూడా అప్పట్లో షారుఖ్ సందడి చేశారు. కాగా, ‘పఠాన్’ సినిమాలో షారుఖ్ సరసన దీపికా పదుకొనే (Deepika Padukone) హీరోయిన్‌గా నటించగా.. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ఆదిత్య చోప్రా నిర్మించారు. జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది.

Updated Date - 2023-01-10T18:48:30+05:30 IST