Pallavi Prashanth: హౌస్‌లో రైతు బిడ్డగా.. బయటకు రాగానే తీరు మారిందంటూ కామెంట్లు!

ABN , Publish Date - Dec 21 , 2023 | 11:19 AM

బిగ్‌బాస్‌-7 విజేత పల్లవి ప్రశాంత్‌పై (Pallavi Prashanth)కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే! అతనితోసహా మరో నలుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోదరుడు మహావీర్‌కు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది.

Pallavi Prashanth: హౌస్‌లో రైతు బిడ్డగా.. బయటకు రాగానే తీరు మారిందంటూ కామెంట్లు!

బిగ్‌బాస్‌-7 విజేత పల్లవి ప్రశాంత్‌పై (Pallavi Prashanth)కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే! అతనితోసహా మరో నలుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోదరుడు మహావీర్‌కు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. బిగ్‌బాస్‌ గ్రాండ్‌ ఫినాలే అయిన తర్వాత ఇంటికి వస్తున్న తరుణంలో అభిమానులు జూబ్లీహిల్స్‌లోని అన్నపూర్ణ స్టూడియో ప్రాంగణం వద్ద కంటెస్టెంట్‌ అమర్‌, అశ్వినిల కార్లను ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో ఈ ఘటనను సుమోటోగా తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. (Biggboss -7)

కేసులో ఏ-1గా పల్లవి ప్రశాంత్‌ (Pallavi Prashanth Arrest)పేరును చేర్చారు. జూబ్లీహిల్స్‌ నుంచి వెళ్లిన పోలీసు బృందం.. బుధవారం రాత్రి స్వగ్రామం గజ్వేల్‌ మండలం కొల్గుర్‌లో పల్లవి ప్రశాంత్‌, మహావీర్‌లలను అదుపులోకి తీసుకుని నగరానికి తరలించింది. గత రాత్రి నుంచి వైద్య పరీక్షలు అనంతరం నాంపల్లి కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. విచారణ జరిపిన 14 రోజులు రిమాండ్‌ (14 days remand) విధించింది. దీంతో ఇద్దరిని జూబ్లీ హిల్స్‌ పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ కేసులో మరో నిందితుడు వినోద్‌ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. దాడిలో పాల్గొన్న మరో 14 మందిని సైతం పోలీసులు విచారిస్తున్నారు. రైతు బిడ్డ ట్యాగ్‌తో బిగ్‌బాస్‌ హౌస్‌లో అడుగుపెట్టిన ప్రశాంత తనదైన శైలిలో ఆట ఆడాడు. అప్పటిదాకా అమాయకంగా ఉన్న అతను టైటిల్‌ గెలుచుకుని బయటకు రాగానే తనలోని మరో కోణాన్ని బయటపెట్టాడు అని నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు.

Pallavi.jpg

Updated Date - Dec 21 , 2023 | 11:20 AM