NandamuriTarakaRamarao: సినిమాల్లోకి రాకముందు అన్నగారు సైకిల్ మీద వెళ్లి ఏమి చేసేవారో తెలుసా...

ABN , First Publish Date - 2023-05-27T13:00:13+05:30 IST

రేపు అంటే మే 28 దివంగత నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు. ఈ సంవత్సరం అయన శత జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నారు. చలనచిత్ర పరిశ్రమలో 300 కి పైగా సినిమాల్లో నటించి, రారాజులా వెలుగొంది, తరువాత రాజకీయాలకు వచ్చి అక్కడ సంచలనం సృష్టించిన గొప్ప వ్యక్తి. అతను చిత్ర పరిశ్రమకి రాక ముందు సైకిల్ మీద తిరుగుతూ ఏమి చేసేవారో చూడండి.

NandamuriTarakaRamarao: సినిమాల్లోకి రాకముందు అన్నగారు సైకిల్ మీద వెళ్లి ఏమి చేసేవారో తెలుసా...
File photo of N T Rama Rao

ఈ సంవత్సరం దివంగత నందమూరి తారక రామారావు (NTRamarao) గారి శతజయంతి సంవత్సరం. అందుకనే ప్రపంచంలో చాలా ప్రదేశాల్లో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు #NTRCentenaryCelebrations జరుపుకుంటున్నారు. ఎన్టీఆర్ (NTR) అంటే ఒక పేరు కాదు, ఒక ప్రభంజనం, ఒక చరిత్ర. ఎన్టీఆర్ (NTR) రాజకీయాల్లోకి వచ్చాకే తెలుగు ప్రజల నాడి, వేడి, ఉనికి ప్రపంచం నలుమూలలా పాకింది, తెలిసింది. అంతటి ప్రభావం చూపించారు ఎన్టీఆర్ గారు. అందరూ ఆప్యాయంగా అన్నగారు #Anna అని పిలుచుకునే అన్న నందమూరి తారక రామారావు నాలుగు దశాబ్దాల పాటు చలన చిత్ర పరిశ్రమలో ఒక మహరాజులా వెలుగొందాడు. 'నా దేశం' #NaaDesam నుండి 'మన దేశం' #ManaDesam వరకు తనకు ఎదురులేని, తనకు తానే సాటి అని నిరూపించుకొని అప్రతిహత జైత్రయాత్ర సాగించారు అన్నగారు.

జానపదం, పురాణాలు, సాంఘికం, చారిత్రాత్మక ఒకటేమిటి అన్ని రకాల సినిమాలు చేసి, తన నటనా విశ్వరూపం చూపించారు. ఎన్నో ప్రయోగాలు కూడా చేశారు. ఒకే సినిమాలో 'దాన వీర శూర కర్ణ' #DanaVeeraSuraKarnaలో మూడు పాత్రలు, 'శ్రీ మద్విరాటపర్వం' #SriMadvirataParvam లో అయిదు పాత్రలు వేసి అన్ని పాత్రల్లోనూ వైవిధ్యం చూపించిన గొప్ప నటుడు అయన. పురాణాల్లో వుండే ప్రతినాయకుడి పాత్రలను, రావణాసురుడు, దుర్యోధనుడు, కీచకుడు, కర్ణుడు ఇలాంటి ఎన్నో పాత్రలను తన నట కౌశలంతో వాటికి వన్నె తెచ్చిన గొప్ప నట చక్రవర్తి ఎన్టీఆర్.

NTRmilk.jpg

అయితే ఇక్కడ ఇంకొక ఆసక్తికర విషయం వుంది. రేపు మే 28 ఎన్టీఆర్ పుట్టినరోజు. గత కొన్ని రోజులుగా ఎన్టీఆర్ ఫోటోస్ చాలా వైరల్ అవుతున్నాయి, సాంఘికా మాధ్యమాల్లో. అలాగే ఇంకొక ఫోటో కూడా వైరల్ అవుతోంది. అదేంటో తెలుసా. ఎన్టీఆర్ సినిమాల్లోకి రాకముందు విజయవాడలో పాలు పోసేవారు అని చెపుతూ ఉండేవారు. సైకిల్ మీద వెళ్లి కొన్ని హోటల్స్ లో, ఇళ్లలో పాలు పోసేవారు అని, పల వ్యాపారం చేసేవారు అని అంటూ ఉండేవారు. ఆలా సైకిల్ మీద వెళ్లి పాలు పోస్తున్నప్పుడు తీసిన ఫోటో ఇది. ఇది 1943 లో తీసినది. ఇప్పుడు ఈ ఫోటో చాలా వైరల్ అవుతోంది.

Updated Date - 2023-05-27T13:00:13+05:30 IST