NTR: ఎన్టీఆర్ ఇంకా ఎందుకు ట్రేండింగ్ లో వున్నాడు అంటే...

ABN , First Publish Date - 2023-05-14T14:16:15+05:30 IST

ఎన్టీఆర్ పుట్టినరోజు అయిన మే 20 దగ్గర పడుతోంది. ఎన్టీఆర్30 నుండి ఏదైనా లుక్, టీజర్ లాంటిది అభిమానులు ఆశిస్తున్నారు, అలాగే ఎన్టీఆర్ పాత సినిమా ఇండస్ట్రీ హిట్ అయిన 'సింహాద్రి' సినిమాను కూడా మళ్ళీ రికార్డు స్థాయిలో విడుదల చేస్తున్నారు.

NTR: ఎన్టీఆర్ ఇంకా ఎందుకు ట్రేండింగ్ లో వున్నాడు అంటే...
A still from Simhadri

ఎన్టీఆర్ (NTR) ఇంకా సాంఘీక మాధ్యమంలో ట్రెండ్ అవుతున్నాడు, ఎందుకంటే అతని పుట్టినరోజు మే 20 (May20) దగ్గర పడుతోంది అందుకని. #NTRBirthday అయితే ఈసారి అతని పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా అభిమానులు చేసేటట్టు కనపడుతున్నారు. అదే రోజు ఎన్టీఆర్ నటించిన, ఇండస్ట్రీ హిట్, రాజమౌళి (Rajamouli) దర్శకత్వం వహించిన 'సింహాద్రి' (Simhadri) సినిమా మళ్ళీ విడుదల చేస్తున్నారు. ఈమధ్య ఈ రీ-రిలీజ్ సినిమాలే ఎక్కువయ్యాయి, #Simhadri4K వాటికి కూడా బాగానే వస్తున్నారు అభిమానులు.

simhadri1.jpg

కానీ ఇప్పుడు మళ్ళీ విడుదల చేస్తున్న ఎన్టీఆర్ 'సింహాద్రి' #Simhadri4k మాత్రం ఎలా అయినా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), మహేష్ బాబు (Mahesh Babu) ల రికార్డు బద్దలు కొట్టాలని చూస్తున్నారు ఎన్టీఆర్ అభిమానులు. ఎందుకంటే మొదటి ఇలా మళ్ళీ విడుదల మొదలయింది మహేష్ బాబు 'పోకిరి' (Pokiri) సినిమాతో, తరువాత అతని సినిమా 'ఒక్కడు' (Okkadu) కూడా విడుదల అయింది. అది విజయవంతం అవటంతో తరువాత పవన్ కళ్యాణ్ సినిమా 'ఖుషీ' (Kushi) విడుదలయి విజయం సాధించింది. అలాగే ప్రభాస్ సినిమాలు కూడా మళ్ళీ కొన్ని విడుదల అయ్యాయి. కానీ ఎన్టీఆర్ అభిమానులు మాత్రం, మహేష్, పవన్ కళ్యాణ్ రి-రిలీజ్ రికార్డులను బద్దలు కొట్టాలని చూస్తున్నారు.

అందుకే ఈ 'సింహాద్రి' సినిమాని బాగా ప్రమోట్ చేస్తున్నారు. ప్రతి సినిమా విడుదలకి ముందు ప్రీ-రిలీజ్ ఈవెంట్ అని పెడతారు, కానీ మొదటి సారిగా ఇలా మళ్ళీ విడుదల అవుతున్న ఒక సినిమాకి కూడా రి-రిలీజ్ ఈవెంట్ ని ఈనెల 17న పెడుతున్నారు. అయితే ఈ ఫంక్షన్ కి అతిధులు ఎవరు వస్తారు అనేది ఇంకా క్లారిటీ లేదు. 'సింహాద్రి' సినిమాకి దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి కాగా, ఇందులో భూమిక, (BhumikaChawla) అంకిత (Ankita), నాసిర్ (Nasser) మున్నగువారు నటించారు. ఇది అప్పట్లో ఒక సంచలనం సృష్టించింది.

simhadri2.jpg

ఇవన్నీ ఇలా ఉంటే, ఎన్టీఆర్, కొరటాల శివ (KoratalaSiva) కాంబినేషన్ లో వస్తున్న ఎన్టీఆర్30 #NTR30 సినిమా ఫస్ట్ లుక్, లేదా చిన్న ప్రచార టీజర్ లాంటిది మే 20వ తేదీ విడుదల చేయొచ్చు అని కూడా అంటున్నారు. ఎందుకంటే తెలుగు అగ్ర నటుల పుట్టినరోజు నాడు ఇలా ఎదో ఒకటి విడుదల చెయ్యడం ఆనవాయితీగా వస్తోంది. అందుకని ఈ సినిమా నుండి కూడా ఏదైనా బయటకి రావచ్చు అని అంటున్నారు.

Updated Date - 2023-05-14T14:16:15+05:30 IST