NTR: దుబాయ్ నుండి తిరిగి వచ్చిన ఎన్టీఆర్

ABN , First Publish Date - 2023-09-19T10:02:19+05:30 IST

ఎన్టీఆర్ దుబాయిలో 'ఆర్ఆర్ఆర్' సినిమాకి గాను బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్న తరువాత నిన్న రాత్రి హైదరాబాద్ తిరిగి వచ్చాడు. ఎన్టీఆర్ కుటుంబంతో ఎయిర్ పోర్ట్ నుండి బయటకి వస్తున్న వీడియోలు వైరల్ అవుతూ వున్నాయి.

NTR: దుబాయ్ నుండి తిరిగి వచ్చిన ఎన్టీఆర్
NT Rama Rao at the SIIMA awards function

జూనియర్ ఎన్టీఆర్ (JrNTR) సైమా (SIIMA-2023) సినిమా అవార్డులలో పాల్గొనడానికి దుబాయ్ (Dubai) వెళ్లిన సంగతి తెలిసిందే. 'ఆర్ఆర్ఆర్' #RRR లో ఎన్టీఆర్ నటనకి గాను బెస్ట్ యాక్టర్ అవార్డు (BestActorAward) అందుకున్న సంగతి తెలిసిందే. కుటుంబంతో వెళ్లిన ఎన్టీఆర్ తిగిరి నిన్న రాత్రి హైద్రాబాదు చేరుకున్నాడు. ఈరోజు నుండి 'దేవర' #Devara షూటింగ్ లో పాల్గొంటాడని అంటున్నారు. ఇప్పుడు అందరి దృష్టి ఎన్టీఆర్ మీదే వుంది. ఎందుకంటే తెలుగు దేశం అధినేత నారా చంద్రబాబు నాయుడుని (NaraChandrababuNaidu) కొన్ని రోజుల క్రితం అక్రమంగా అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

కుటుంబ సభ్యుడిగా ఎన్టీఆర్ ఈ అక్రమ అరెస్టును ఖండించకుండా ఎందుకో మౌనంగా వుండిపోయాడు, అందుకని ఎన్టీఆర్ ఎక్కడికి వెళ్లినా, వచ్చినా, అతనిమీదే అందరి దృష్టి వుంది. అతను ఏమైనా మాట్లాడుతాడా అని. కానీ ఎన్టీఆర్ మాత్రం ఈసారి తన దృష్టి అంతా సినిమాల మీదీ కేంద్రీకరించాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే రాజకీయాల్లోకి రావటానికి ఇంకా చాలా కాలం పడుతుంది కాబట్టి, అంతవరకు ముందు సినిమాల మీదే దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది.

ntr-dubai1.jpg

అదీ కాకుండా, ఎన్టీఆర్ కెరీర్ ఇప్పుడు ఒక కీలక దశలోకి చేరుకుంది. 'ఆర్ఆర్ఆర్' సినిమా అతన్ని గ్లోబల్ స్టార్ చేసింది. ఆ సినిమా ఆస్కార్ అవార్డుల నామినేషన్ ఉండటం, ఎన్టీఆర్ అమెరికా వెళ్లి అక్కడ మీడియా వాళ్ళతో, రేడియోలలో ఆ సినిమా గురించి మాట్లాడటం, ఇక అతన్ని గ్లోబల్ స్టార్ ని చేశాయి. అందుకనే ఇప్పుడు 'దేవర' సినిమాని చాలా పెద్ద బడ్జెట్ లో పాన్ ఇండియన్ సినిమాగా తీస్తున్నాడు. దీని తరువాత, హ్రితిక్ రోషన్ (HrithikRoshan) తో 'వార్' #War2 సినిమాలో కూడా నటించనున్నాడు.

ఇక తెలుగు నుండి, తన కెరీర్ ఇప్పుడే ఇండియా, వరల్డ్ లెవెల్ కి వెళుతూ ఉండటంతో, ఇటువంటి సమయంలో ఎటువంటి రాజకీయ ప్రకటనలు చేసిన తన కెరీర్ కి ఇబ్బంది కలుగుతుందని కాస్త మౌనం వహించినట్టుగా తెలుస్తోంది. రానున్న రోజుల్లో ఈ పరిణామాలు ఎలా వుంటాయో చూడాలి మరి.

Updated Date - 2023-09-19T10:02:19+05:30 IST