Pawan Kalyan: పవర్ స్టార్ కొడుకు అకిరా నందన్ భవిష్యత్తు ఏంటో తెలిసిపోయింది

ABN , First Publish Date - 2023-08-21T19:05:55+05:30 IST

ఒక్క ఫోటో ఇద్దరి భవిష్యత్తు ఏంటో చెప్పేసింది. లెజెండరీ దర్శకుడు రాఘవేంద్ర రావు పవన్ కళ్యాణ్ కుమారుడు అకిరా నందన్, తన మానవుడు కార్తికేయ తో వున్న ఫోటోని సాంఘీక మాధ్యమాల్లో పెట్టారు. దానితో విషయం మొత్తం తేటతెల్లం అయింది.

Pawan Kalyan: పవర్ స్టార్ కొడుకు అకిరా నందన్ భవిష్యత్తు ఏంటో తెలిసిపోయింది
Akira Nandan, K Raghavendra Rao and his grandson Karthikeya at an event in Norway

ఇప్పుడు సినిమా పరిశ్రమలో ప్రతి స్టార్ కుమారుడు మళ్ళీ సినిమాల్లోకి వస్తున్నారు, ఎవరిని చూసిన అదే విషయం అర్థం అవుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (PawanKalyan)కుమారుడు అకిరా నందన్ (AkiraNandan) పెద్దవాడు అవుతున్నాడు, సినిమాల్లోకి వస్తాడా రాడా అనే సందేహం పవన్ కళ్యాణ్ అభిమానుల్లో చాలా కాలం నుండి వుంది. అయితే ఇప్పుడు అభిమానులు ఆ విషయం క్లియర్ గా అర్థం అయిపొయింది. ఎలా అంటే, లెజెండరీ దర్శకుడు కె రాఘవేంద్ర రావు (KRaghavendraRao) ఒక ఫోటో సాంఘీక మాధ్యమంలో పెట్టారు, ఆ ఫోటోతో అన్ని విషయాలు అర్థం అయిపోయాయి.

రాఘవేంద్ర రావు, అతని అల్లుడు శోభు యార్లగడ్డ (ShobuYarlagadda), దర్శకుడు రాజమౌళి (SSRajamouli) అందరూ నార్వే దేశం వెళ్లారు. అక్కడ 'బాహుబలి' #Baahubali మ్యూజిక్ సింఫనీ ఉంటే వెళ్లారు. అక్కడ శోభు కుమారుడు, రాఘవేంద్ర రావు మానవుడు కార్తికేయ (Karthikeya), అలాగే పవన్ కళ్యాణ్ కుమారుడు అకిరా నందన్ రాఘవేంద్ర రావుని కలిశారు. వాళ్ళిద్దరితో రాఘవేంద్ర రావు ఫోటో షేర్ చేశారు. అయితే ఇప్పుడు తీసేసినా చాలామంది ఆ ఫోటోని అప్పుడే వైరల్ చేసేసారు.

akiranandan1.jpg

ఆ ఇద్దరి ఫోటో పెడుతూ ఫోర్త్ జనరేషన్ అఫ్ బాయ్స్ అంటూ ఫోటో పెట్టారు. అందులోనే ఆ ఇద్దరూ, అకిరా నందన్, కార్తికేయ అమెరికాలోని ఫిలిం స్కూల్ లో జాయిన్ అయ్యారు, కలిసి వెళుతున్నారు అంటూ పెట్టారు. దానితో పవన్ కళ్యాణ్ అభిమానులకి అర్థం అయిపొయింది, అకిరా నందన్ పరిశ్రమలోకి కథానాయకుడిగా ఎంటర్ అవుతున్నాడు అని. ఎందుకంటే ఫిలిం స్కూల్ కి వెళుతున్నాడు అంటే, సినిమాల మీద ఆసక్తి వుండబట్టే కదా. అందుకని పవన్ కళ్యాణ్ వారసుడు అకిరా నందన్ ఇక వచ్చేస్తున్నాడు అని అప్పుడే పవన్ కళ్యాణ్ అభిమానులు సాంఘీక మాధ్యమాల్లో ఈ ఫోటోని వైరల్ చేస్తున్నారు.

Updated Date - 2023-08-21T19:05:55+05:30 IST