Mega Star Chiranjeevi: పుట్టినరోజు నాడు ఆ ప్రకటన లేనట్టేనా !

ABN , First Publish Date - 2023-08-16T15:27:52+05:30 IST

ఈసారి చిరంజీవి పుట్టినరోజు అయిన ఆగస్టు 22 వ తేదీన అభిమానులు కొంచెం నిరాశ పడే అవకాశం వుంది. ఎందుకంటే ఆరోజు చిరంజీవి ఒక ముఖ్యమైన ప్రకటన చేయాలని అనుకున్నారు, కానీ ఇప్పుడు మనసు మార్చుకున్నారు అని తెలిసింది. ఇంతకీ ఏమిటా ప్రకటన...

Mega Star Chiranjeevi: పుట్టినరోజు నాడు ఆ ప్రకటన లేనట్టేనా !
Mega Star Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి #MegaStarChiranjeevi పుట్టినరోజు అయిన ఆగస్టు 22 (Chiranjeevi Birthday) తేదీకి ఇంకా కొన్ని రోజులు మాత్రమే వుంది. ఈసారి పుట్టినరోజు చిరంజీవి అభిమానులు చాలా ఘనంగా చెయ్యాలని అనుకుంటున్నారు, కానీ చిరంజీవి ప్రస్తుతం కాలుకి శస్త్ర చికిత్ర చేసుకున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. అదీ కాకుండా చిరంజీవి నటించిన 'భోళాశంకర్' #BholaaShankar సినిమా ఈమధ్యనే విడుదలైంది. మెహెర్ రమేష్ (MeherRamesh) దర్శకత్వం వహించిన ఈ సినిమా ఒక పెద్ద డిజాస్టర్ గా చిరంజీవి కెరీర్ లో నిలిచింది. ఇది ఎవరూ ఊహించనిది. ఎందుకంటే అంతకు ముందు సినిమా 'వాల్తేరు వీరయ్య' #WaltairVeerayya సుమారు రూ.150 కోట్లు వరకు బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్టు చేసిన తరువాత, ఈ సినిమా ఇలా అతని అభిమానులకు కూడా నచ్చని విధంగా ఉంటుందని ఎవరూ అనుకోలేదు. అందువలన ఈసారి అభిమానులు కొంచెం నిరాశ పడ్డారు అనే మాట వినపడుతోంది.

bholaashankar4.jpg

'భోళాశంకర్' సినిమా అజిత్ (AjithKumar) నటించిన తమిళ సినిమా 'వేదాళం' #Vedalam కి రీమేక్. దర్శకుడు మెహెర్ రమేష్ (MeherRamesh) కనీసం తమిళంలో వున్నది వున్నట్టుగా తీసిన చిరంజీవి సినిమా కొంచెం అయినా నడిచేది అని విమర్శకులు అంటున్నారు. ఏమైనా కూడా ఈ 'భోళాశంకర్' సినిమా కొంచెం చిరంజీవి ఆలోచన విధానంలో మార్పు తెచ్చింది అంటున్నారు. ఎందుకంటే అభిమానులు ఇక రీమేక్ లు చెయ్యొద్దు అని సాంఘీక మాధ్యమంలో చిరంజీవి కి విజ్ఞప్తులు చేస్తున్నారు, దానికి తోడు 'భోళా శంకర్' ఫ్లాప్ అవటంతో, చిరంజీవి కూడా ఆలోచనలో పడినట్టు తెలుస్తోంది. చెయ్యబోయే సినిమాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.

ఇదిలా ఉండగా, ఆగస్టు 22న చిరంజీవి కొత్త సినిమా ఒకటి ప్రారంభం కావాల్సి వుంది అని కూడా తెలిసింది. అయితే ఇప్పుడు ఆ సినిమా లాంచ్ ని వాయిదా వేసినట్టుగా కూడా పరిశ్రమలో టాక్ నడుస్తోంది. ఎందుకంటే 'భోళా శంకర్' ప్రభావం చాలా పడింది అని, అందువలన ఇప్పుడు చిరంజీవి తాను చెయ్యబోయే సినిమాలు అన్నిటినీ కొన్ని రోజులు వాయిదా వేయాల్సిందిగా చెప్పినట్టుగా తెలిసింది. అందువల్ల ఈసారి చిరంజీవి పుట్టినరోజునాడు అభిమానుల సంబరాలు ఉంటాయి, కానీ చిరంజీవి సినిమా గురించి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం లేదేమో అని ఒక టాక్ నడుస్తోంది. దానికి తోడు చిరంజీవి కాలికి శస్త్ర చికిత్ర జరిగింది అంటే అతను కొన్నాళ్ల పాటు విశ్రాంతి కూడా అవసరం కాబట్టి, బయటకి వచ్చే అవకాశం కూడా లేదు అని తెలుస్తోంది.

bholaashankar3.jpg

ఇవనీ క్రోడీకరించి చూస్తే, ఈసారి చిరంజీవి పుట్టినరోజు నాడు అభిమానులకు కొంచెం నిరాశగానే ఉండొచ్చు అని తెలుస్తోంది. అయితే ప్రతి పుట్టినరోజుకి అతని అభిమానులు చేసే రక్త దానం, సామజిక సేవ లాంటివి కొనసాగుతాయని తెలుస్తోంది. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ (KalyanKrishna)తో ఒక సినిమా, 'బింబిసార' #Bimbisara దర్శకుడు వసిష్ఠతో (Vassishta) ఒక సినిమా చేస్తున్నట్టుగా చిరంజీవి స్వయంగా తన సినిమా ప్రచారంలో భాగంగా చెప్పారు.

Updated Date - 2023-08-16T15:27:52+05:30 IST