NiharikaKonidela: ఆమెకి ఇష్టమైన నటుడు ఎవరో తెలిస్తే షాకవుతారు

ABN , First Publish Date - 2023-05-13T18:01:39+05:30 IST

నిహారిక కొణిదెల ఒక యూట్యూబ్ కి ఇచ్చిన తాజా ఇంటర్వ్యూ లో పలు ఆసక్తికర అంశాలని చెప్పారు. అన్న రామ్ చరణ్ ఐపీఎల్ టీం గురించి, తనకి ఇష్టమైన నటుడు, ఇంకా చాలా....

NiharikaKonidela: ఆమెకి ఇష్టమైన నటుడు ఎవరో తెలిస్తే షాకవుతారు
Niharika Konidela

నిహారిక కొణిదెల (Niharika Konidela) నటించిన 'డెడ్ పిక్సల్స్' (Dead Pixels) అనే వెబ్ సిరీస్ విడుదల అవుతోంది. ఇందులో ఆమె ఒక పాత్ర వెయ్యగా, మిగతావి అక్షయ్ లాగసాని, వైవా హర్ష (VivaHarsha), సాయి రోనాక్ చేశారు. ఈమధ్య చాలామంది, గేమ్స్ ఆన్లైన్ లో ఆడుతూ బయట ప్రపంచాన్నే మరిచిపోతుంటారు. కొంతమంది స్నేహితులు అలా ఈ గేమ్స్ ఆడుతూ ఏమి చేశారు, మళ్ళీ బయటకి ఎలా వచ్చారు అన్నది ఈ వెబ్ సిరీస్ సారాంశం అని అంటున్నారు.

niharikakonidelanew1.jpg

అయితే ఈ వెబ్ సిరీస్ కి సంబంధించి నిహారిక కొణిదెల కొంతమంది సెలెక్టెడ్ మీడియా కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఎందుకంటే సెలెక్టెడ్ మీడియా ఆమె వివాహానికి సంబంధించి ప్రశ్నలు ఏమీ అడగకుండా వుంటారు అని. అయితే అటువంటి ప్రశ్నలు ఏమి లేకుండా ఈ ఇంటర్వ్యూ సాగింది. అదే #NiharikaMarriage ఇంటర్వ్యూ లో ఆమెని మెగా నటులు కాకుండా, బయట హీరో ఎవరు ఆమెకి నచ్చిన వ్యక్తి అని అడిగితే నిహారిక చెప్పిన సమాధానం ఏంటి అంటే 'ఎన్టీఆర్' (NTR) అని.

NTR-Hero.jpg

ఎందుకు అంటే, ఎన్టీఆర్ గ్రేట్ పెర్ఫార్మర్ అని చెప్పింది, అలాగే అతను ఒక అల్ రౌండర్ అని కూడా చెప్పింది. అందుకని ఎన్టీఆర్ #NTR అంటే ఇష్టమట. అతని సినిమాలు అన్నీ చూస్తుందట. అలాగే నిహారికకు దెయ్యం సినిమాలంటే చాలా భయం అని చెప్పింది. అయినా 'విరూపాక్ష' (Virupaksha) సాయితేజ (Sai Dharam Tej) బావ కోసం చూసాను అని చెప్పింది.

ముందు ముందు తాను సినిమాల్లో నటిస్తానని కూడా చెప్పింది నిహారిక. ఏదైనా అవకాశం వస్తే నటనను కంటిన్యూ చేస్తానని, చాలామంది ఇది చిన్న రోల్, ఇది మీరు చేయరేమో, చేస్తారో చేయ్యరో అని ఊహించుకొని నా వరకు రాకుండానే వెళ్లిపోయారు అని చెప్పింది, అందుకని ఇప్పుడు చేస్తాను అని చెప్పినట్టుంది నిహారిక. అలాగే ట్రోల్స్, మిమ్స్ ఒక్కోసారి చాల రూడ్ గా వుంటాయని చెప్పింది. ఎందుకంటే వాటిని చూడటం మానేసాను అని చెప్పింది. అలాగే అల్లు అర్జున్ (Allu Arjun) నటిస్తున్న 'పుష్ప 2' (Pushpa 2) లో తను నటించటం లేదు అని క్లారిఫై చేసేసింది.

niharikakonidelanew2.jpg

అన్న రామ్ చరణ్ (Ram Charan) ఐపీల్ (IPL టీంని కొంటున్నారుట కదా అని అడిగినప్పుడు, "అవునా, కొంటున్నాడా? ఏ టీమ్ కొంటున్నాడు, హైదరాబాద్ (SRH) టీం నా, నాకు తెలీదే" అని జవాబిచ్చింది. ఇందులో వివాహానికి సంబంధించి ప్రశ్న అడగలేదు, ఆమె చెప్పలేదు కానీ నిహారిక భవిష్యత్తులో పూర్తిగా నటిస్తాను అని చెప్పింది అంటేనే అర్థం అవుతోంది. అదీ కాకుండా, ఒకవేళ కలిసి ఉన్నట్టయితే అతని గురించి మాట్లాడేది కదా, అంటే ఆ రూమర్స్ అన్నీ నిజమే అన్నమాట!

Updated Date - 2023-05-13T18:02:29+05:30 IST