కొత్త అవ‌తార్‌లో సినిమాల్లోకి నిహారిక రీ ఎంట్రీ.. హీరో మ‌నోజేనా?

ABN , Publish Date - Dec 19 , 2023 | 12:16 PM

మన రెండు తెలుగు రాష్ట్రాలలో పరిచయం అక్కరలేని పేరు నిహారిక కొణిదెల తాజాగా సినిమాలోకి రీ ఎంట్రీ ఇస్తుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. అమె జన్మదినం సందర్భంగా ‘వాట్‌ ద ఫిష్‌’ చిత్రంలో ఆమె ప్రధాన పాత్ర పోషిస్తున్న అష్టలక్ష్మి అకా ఏయస్‌ హెచ్‌ పాత్ర ఫస్ట్‌ లుక్‌ పోస్టర్ ను సోమవారం ఉదయం విడుదల చేశారు.

కొత్త అవ‌తార్‌లో సినిమాల్లోకి నిహారిక రీ ఎంట్రీ.. హీరో మ‌నోజేనా?
NIHARIKA

మన రెండు తెలుగు రాష్ట్రాలలో పరిచయం అక్కరలేని పేరు నిహారిక కొణిదెల (Niharika Konidela). వెబ్ సిరిస్ లతో, గేమ్ షో లతో ఇప్పటికే సుపరిచితమైన ఈ అమ్మడు ఒక మనసు సినిమాతో వెండితెర ప్రవేశం కూడా చేసింది. ఆ తర్వాత మరో రెండు చిత్రాలు చేసి సినిమాలలకు ఫుల్ స్టాప్ పెట్టింది. అనంతరం పెళ్లి చేసుకోవడం, విడాకులు తీసుకోవడం చకచకా అయిపోయాయి. ఆపై నిర్మాతగా మారి ఓటీటీకి వెబ్ సిరీస్, సినిమాలు నిర్మించింది. అయితే తాజాగా నిహరికా సినిమాలోకి రీ ఎంట్రీ ఇస్తుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సోమవారం అమె జన్మదినం సందర్భంగా సిక్స్‌ సినిమాస్‌ (6ix Cinemas) సంస్థ నిర్మిస్తున్న ‘వాట్‌ ద ఫిష్‌’ What The Fish (వెన్‌ ద క్రేజీ బికమ్స్‌ క్రేజీయర్‌) చిత్రంలో ఆమె ప్రధాన పాత్ర పోషిస్తున్న అష్టలక్ష్మి అకా ఏయస్‌ హెచ్‌ పాత్ర ఫస్ట్‌ లుక్‌ పోస్టర్ ను సోమవారం ఉదయం విడుదల చేశారు. ఇందులో నిహారిక (Niharika Konidela) స్టైలిష్ గా నడుస్తూ కనిపించింది. ఈ పాత్రని యూనిక్‌గా డిజైన్‌ చేసినట్లు దర్శకుడు చెప్పారు. ఈ సినిమాతో వరుణ్‌ కోరుకొండ (Varun Korukonda) దర్శకుడిగా పరిచయమవుతుండగా శక్తికాంత్‌ కార్తీక్‌ (Shakti kanth ) సంగీతం అందిస్తున్నారు.

ఇదిలా ఉండగా 10 నెలల క్రితంమొదటిసారి ఈ సినిమా టైటిల్ ను వాట్ ది ఫిష్ What The Fish (మనం మనం బరంపురం) ప్రకటించగా, ఈ యేడాది మే నెలలో మనోజ్ (Manchu Manoj) జన్మదినం సందర్భంగా ఫస్ట్ లుక్ తో మరో గ్లింప్స్ విడుదల చేసి ‘వాట్‌ ద ఫిష్‌’ What The Fish (వెన్‌ ద క్రేజీ బికమ్స్‌ క్రేజీయర్‌) అంటూ సినిమా ట్యాగ్ లైన్ మార్చారు. ఆ తర్వాత వెన్నెల కిషోర్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. మళ్లీ ఇన్నాళ్లకు దాదాపు 6 నెలల తర్వాత నిహారికా ఆన్ ది బోర్డ్ అంటూ ఫస్ట్ లుక్ విడుదల చేయడంతో మరోసారి ఈ సినిమా ట్రెండింగ్ లోకి వచ్చింది.


నిహారిక (Niharika Konidela) ఫస్ట్ లుక్ విడుదల సందర్భంగా విడుదల చేసిన ప్రకటనలో ఎక్కడా మంచు మనోజ్ (Manchu Manoj) పేరు ప్రస్తావన లేకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాల్లోనూ ఎక్కడా ఆయన పేరు కనబడలేదు అఖరుకు చిత్ర నిర్మాతలు మనోజ్ పేరును కూడా ట్యాగ్ చేయకపోవడం వెనకాల మతలబేంటి అనే విషయం తెలియాల్సి ఉంది.

ఈ సినిమా నుంచి మనోజ్ ఏమైనా తప్పుకున్నాడా, నిహారికా హీరోయినా లేక ప్రధాన పాత్ర చేస్తుందా, అనే చాలా విషయాలపై క్లారిటీ రావాల్సి ఉంది. పాన్ ఇండియాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని త్వరలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి చిత్ర నిర్మాతలు విశాల్‌ బెజవాడ (Vishal Bezawada), సూర్య బెజవాడ (Surya Bezawada) సన్నాహాలు చేస్తున్నారు.

Updated Date - Dec 19 , 2023 | 12:16 PM