Neha Shetty: సమ్మోహనుడా... నడుమిస్తా నీకే నలుగే పెట్టుకోవా.. అక్కడే కాదు, ఇక్కడ కూడా చూడచ్చు

ABN , First Publish Date - 2023-08-05T16:08:26+05:30 IST

తమన్నా, నేహా శెట్టి ఇద్దరి కథానాయికల పాటలూ చాలా పెద్ద హిట్ అయ్యాయి. సాంఘీక మాధ్యమాల్లో ఇద్దరివీ వైరల్ అయ్యాయి, అలాగే ఈ ఇద్దరి నటీమణులు తమ పాటలకు తామే డాన్స్ చేస్తూ ఆ వీడియోలను కూడా పోస్ట్ చేస్తున్నారు.

Neha Shetty: సమ్మోహనుడా... నడుమిస్తా నీకే నలుగే పెట్టుకోవా.. అక్కడే కాదు, ఇక్కడ కూడా చూడచ్చు
Neha Shetty

ఆమధ్య తమన్నా భాటియా (TamannahBhatia), రజినీకాంత్ (Rajinikanth) తో డాన్స్ చేసిన 'జైలర్' #Jailer సినిమాలో సాంగ్ 'కావాలయ్యా... ' బాగా వైరల్ ఆయిన సంగతి తెలిసిందే. ఏ సాంఘీక మాధ్యమం చూసిన అందరూ ఆ పాటకి డాన్స్ చేసి ఆ వీడియోని పోస్ట్ చేసి ఆ పాటని బాగా వైరల్ చేశారు. తమన్నా కూడా ఆ పాటలో డాన్స్ అదరగొట్టింది. అయితే తమన్నా ఆ సినిమాతో పాటు చిరంజీవి (Chiranjeevi) పక్కన 'భోళాశంకర్' #BholaaShankar లో కూడా చేస్తోంది. ఈ రెండు సినిమాలలో ఆమె కథానాయికగా చేస్తూ ఉంటడంతో ప్రేక్షకులు ఒకరకమైన తికమకలో వున్నారు. ఎందుకంటే ఆమె పాట ఏ సినిమాలోది అని.

nehashetty-new.jpg

ఇప్పుడు తమన్నా పాటలాంటిదే ఇంకో కొత్త పాట వచ్చింది. అయితే ఇది తమన్నా కాదు, నేహా శెట్టి (NehaShetty) పాట. ఈమె పాట కూడా పెద్ద హిట్ అయ్యేట్టు వుంది... ఇంతకీ ఈ పాట ఏదో తెలుసా... 'సమ్మోహనుడా... నా పెదవిస్తా...' అంటూ నేహా శెట్టి, కిరణ్ అబ్బవరంతో (KiranAbbavaram) డాన్స్ చేసే పాట. ఇందులో కొంచెం శృంగార రసం పాటలో వుంది. ఇది 'రూల్స్ రంజన్' #RulesRanjan సినిమాలోది, ఇందులో కిరణ్ అబ్బవరం కథానాయకుడు.

nehashetty-new1.jpg

ఈ నేహా శెట్టి కూడా రెండు సినిమాలలో నటిస్తోంది, ఒకటి ఈ 'రూల్స్ రంజన్' లో కిరణ్ అబ్బవరం పక్కన అయితే, ఇంకోటి 'బెదురులంక 2012' #Bedurulanka2012 లో కార్తీక్ గుమ్మకొండ (KarthikGummakonda) పక్కన కూడా నటిస్తోంది. అయితే ఒక సినిమా ప్రచార చిత్రం ఏదైనా విడుదలైన వెంటనే, రెండో సినిమా కూడా ఆ ప్రచార చిత్రాన్ని విడుదల చేసేస్తోంది. ఇంతకీ ఈమె ఈ సినిమాలో పాటకి డాన్స్ చేస్తోందో అని ప్రేక్షకులు కొంచెం తికమక పడేలా వున్నాయి ఈ రెండో చిత్రాలు. రెండింటిలోనూ ఒకే కథానాయిక అవటం వలన వచ్చిన చిక్కన్నమాట ఇది.

nehashetty-new3.jpg

అయితే నేహా శెట్టి ఈ రెండు సినిమాలలోనూ కొంచెం గ్లామర్ గా కనిపిస్తోంది అని ఆ సినిమా ట్రైలర్, పాటలు చూస్తే ఇట్టే అర్థం అయిపోతోంది. ఇప్పుడు ఈ 'సమ్మోహనుడా ...' పాటా బాగా వైరల్ అయింది. తమన్నా లాంటి అగ్ర నటి పాట ఎంత హిట్ అయిందో, ఈ నేహా శెట్టి పాట కూడా అంతే హిట్ అయింది. అయితే నేహా శెట్టి సాంఘీక మాధ్యమాల్లో కూడా ఆ పాటకి డాన్స్ చేసి ఆ వీడియోలు బాగా పెడుతోంది, అలాగే గ్లామరస్ ఫోటోస్ కూడా పెడుతోంది.

Updated Date - 2023-08-05T16:08:26+05:30 IST