SobhitaDhulipala: నాగచైతన్య ‘గాళ్ ఫ్రెండ్’ ఏమి చేసిందో చూసారా..

ABN , First Publish Date - 2023-04-29T17:43:32+05:30 IST

పొన్నియిన్ సెల్వన్ షూటింగ్ అయిపోయాక, ఆ సినిమాలో నటించే నటీమణులు ఫోటోలు తీసుకుంటూ ఎంత సరదాగా వుండే అల్లరి చేశారో మీరే చూడండి

SobhitaDhulipala: నాగచైతన్య ‘గాళ్ ఫ్రెండ్’ ఏమి చేసిందో చూసారా..
Sobhita Dhulipla

మణిరత్నం (ManiRatnam) సినిమా 'పొన్నియన్ సెల్వన్' (PooniyinSelvan) రెండో పార్టు కూడా నిన్ననే విడుదల అయింది. తమిళ నాడులో ప్రేక్షకులు ఈ సినిమాని బాగానే ఆదరిస్తున్నారని ఒక టాక్ నడుస్తోంది. ఈ సినిమాలో చాలామంది నటీనటులు వున్నారు, అందులో ఐశ్వర్య రాయ్ (AishwaryaRaiBachchan), త్రిష (Trisha), శోభిత ధూళిపాళ (SobhitaDhulipala), ఐశ్వర్య లక్ష్మి (AishwaryaLekshmi), విక్రమ్ (ChiyanVikram), కార్తీ (Karthi), జయం రవి (JayamRavi) ఇలా అందరూ వున్నారు.

sobhitaaishwarya.jpg

శోభిత ధూళిపాళ తెలుగు అమ్మాయి, తెలుగు సినిమాల్లోనూ చేసింది, అలాగే ఈ 'పొన్నియన్ సెల్వన్' లో కూడా మంచి పేరు తెచ్చుకుంది. ఆమె ఈ సినిమాలో యువరాణి వానతి గా వేసింది, తరువాత మహారాణి కాబోతోంది, ఎందుకంటే పొన్నియన్ సెల్వన్ ని వివాహం చేసుకొని, ఎన్నో సంవత్సరాలు పరిపాలన సాగిస్తారు. ఆ పొన్నియిన్ సెల్వన్ చాలాకాయలం పాటు రాజ రాజ చోళుడుగా పరిపాలించి ప్రసిద్ధికెక్కుతాడు.

sobhitaaishwarya1.jpg

ఆ సినిమా చివరి రోజులు షూటింగ్ లో శోభిత, ఐశ్వర్య లక్ష్మి చేసిన సరదా వీడియో, అలాగే వీళ్లిద్దరు సరదాగా తీసుకున్న ఫోటోలు ఇప్పుడు సాంఘీక మాధ్యమం లో తిరుగుతున్నాయి. ఈ సినిమాలో చేసినందుకు ఆమెకి ఇది ఒక మెమరీ లాగా, అలాగే గౌరవం కూడా అని చెప్పింది శోభిత. ధన్యవాదములు అని తమిళంలో చెప్పింది.

sobhitadhulipala4.jpg

శోభిత ఇప్పుడు తెలుగులో సినిమాలు ఏవీ ఒప్పుకున్నట్టు లేదు, హిందీ సినిమా ఒకటి చేస్తున్నట్టుగా వుంది. అలాగే ఒక ఇంగ్లీష్ సినిమా షూటింగ్ పూర్తయింది. అయితే ఈమధ్య నాగ చైతన్య తో చాల ఫోటోస్ లో లంచ్, డిన్నర్ చేస్తుండగా కనబడి వైరల్ అయింది. నాగ చైతన్య తో శోభిత అనే వార్తలు ఈమధ్య బాగానే వైరల్ అయ్యాయి, కానీ ఈ వార్తల్ని ఇద్దరూ కందించలేదు. అది ఆసక్తికరం.

Updated Date - 2023-04-29T18:36:50+05:30 IST