కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ANR Statue: జయసుధ ఫోన్ చూస్తుంటే మోహన్ బాబు ఏమి చేశారో చూస్తే షాకవుతారు

ABN, First Publish Date - 2023-09-21T11:30:42+05:30

మంచు కుటుంబం ఎక్కడున్నా వార్తలకి కొదవ ఉండదు అని అంటూ వుంటారు, మరి అది అది ఎంత నిజమో తెలీదు కానీ, నిన్న అక్కినేని నాగేశ్వర రావు విగ్రహావిష్కరణలో జయసుధ ఫోన్ చూస్తుంటే పక్కనే వున్న మోహన్ బాబు ఏమి చేసారో చూడండి

Mohan Babu and Jayasudha at the ANR Statue unveiling function

సెప్టెంబర్ 20, 2023 అక్కినేని నాగేశ్వర రావు (AkkineniNageswaraRao) గారి 100వ పుట్టినరోజు #CelebratingANR100 కావటంతో, అయన కుటుంబ సభ్యులు, అన్నపూర్ణ స్టూడియోలో #AnnapurnaStudios నాగేశ్వర రావు గారి విగ్రహం ఏర్పాటు చేశారు. మాజీ ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు (MVenkaiahNaidu) ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ వేడుకకు సినీ పరిశ్రమ, రాజకీయ, ఇతర రంగాలకు చెందిన చాలామంది హాజరయ్యారు. అందరితోపాటు విలక్షణ నటుడు మోహన్ బాబు (MohanBabu) కూడా ఈ వేడుకకు హాజరయ్యారు.

ఇదే వేడుకకు సీనియర్ నటీమణి జయసుధ (Jayasudha) కూడా హాజరయ్యారు. అయితే జయసుధ, మోహన్ బాబు పక్కపక్కనే కూర్చోవటం జరిగింది ఈ వేడుకలో. నాగేశ్వర రావు గారు కుమార్తె నాగ సుశీల (NagaSusheela) మాట్లాడుతూ ఉండగా, జయసుధ తనకి ఎదో మెసేజ్ వచ్చింది అనేమో ఒక్కసారి ఫోన్ బయటకి తీసి చూసుకుంటున్నారు. పక్కనే వున్న మోహన్ బాబు వెంటనే ఫోన్ ఇప్పుడు చూడటం ఎందుకు అని వెంటనే ఆ ఫోన్ లాక్కొని, జయసుధకు ఇచ్చేసారు. #ANRLivesOn

మోహన్ బాబు గారు ఎక్కడవున్నా వార్తలకు కొదవ ఉండదు అంటారు, అది ఒక నానుడి అయిపొయింది. నిన్న ఈ అక్కినేని విగ్రహావిష్కరణలో కూడా ఇలా మోహన్ బాబు, జయసుధ ఫోన్ లాక్కోవడం వీడియో వాళ్ళ కంట బడింది, అది మరి లైవ్ వెళుతోంది కదా, వెంటనే సాంఘీక మాధ్యమాల్లో ఆ ఒక్క వీడియో క్లిప్పింగ్ కట్ చేసి పెట్టేసారు. ఇంకేముంది ఇది ఇప్పుడు వైరల్ అవుతోంది అక్కడ. జయసుధ ఫోన్ లాక్కున్న మోహన్ బాబు అంటూ ఇక వార్తలు. అతను ఫోన్ ఏమీ లాక్కోలేదు, జయసుధ చేతిలో నుండి తీసుకొని, మళ్ళీ ఆమెకే ఇచ్చేసారు. ఆ సమయంలో ఫోన్ చూడటం అవసరమా అన్నట్టుగా. అయితే వాళ్లిద్దరూ కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు, వాళ్ళిద్దరికీ మంచి అనుబంధం వుంది, అందుకని మోహన్ బాబు ఆ చనువుతో ఆలా చేసి ఉండొచ్చు అని అంటున్నారు.

Updated Date - 2023-09-21T12:10:48+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!