కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chiranjeevi: దిల్ రాజు ని ఇమిటేట్ చేసిన మెగాస్టార్.. అదిదా సార్

ABN, First Publish Date - 2023-08-07T17:34:40+05:30

డాన్స్ వేణుమా డాన్స్ ఇరుక్కు, ఫైట్స్ వేణుమా ఫైట్స్ ఇరుక్కు... ఈ మాటలు ఎక్కడో విన్నట్టున్నారు కదా ! అప్పుడెప్పుడో చెన్నైలో జరిగిన 'వారిస్' ప్రీ రిలీజ్ వేడుకలో ఆ సినిమా నిర్మాత దిల్ రాజు సినిమా గురించి, విజయ్ గురించి తమిళంలో మాట్లాడిన మాటలు. అవి అప్పుడు వైరల్ అయ్యాయి, ఇప్పుడు చిరంజీవి దిల్ రాజు ని ఇమిటేట్ చేస్తూ ఏవ్ మాటలు తన సినిమా గురించి చెప్పారు

Tamannah, Chiranjeevi, Keerthy Suresh in a promotional video of their film Bholaa Shankar

అగ్ర నిర్మాత దిల్ రాజ్ (Dil Raju) ఆమధ్య తమిళ సూపర్ స్టార్ విజయ్ (Vijay) తో 'వారసుడు/ వారిసు' (Vaarasudu/Varisu) సినిమా చేసాడు. ఆ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలు చెన్నైలో #Chennai అయ్యాయి, ఆ వేడుకలో నిర్మాత దిల్ రాజు (Dil Raju) తమిళంలో మాట్లాడేడు. అయితే దిల్ రాజు వచ్చీ రాని తమిళంలో అప్పుడు మాట్లాడిన మాటలు బాగా వైరల్ అయిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఒక సందర్భంలో అతను మాట్లాడిన ఆ మాటలు చాలా మాధ్యమాల్లో ఒక టాకింగ్ పాయింట్ లా తయారయ్యాయి కూడా. అతను ఆ వేడుకలో విజయ్ గురించి, సినిమా గురించి మాట్లాడుతూ, సినిమాలో, అన్నీ వున్నాయి అని తమిళంలో చెప్పాడు. అందుకు 'డాన్స్ వేణుమా డాన్స్ ఇరుక్కు , ఫైట్స్ వేణుమా ఫైట్స్ ఇరుక్కు' (Dance venuma dance irukku, fights venuma fights irukku) అని చెప్పాడు. అదే ప్రసంగంలో విజయ్ చాలా భేషజం లేని మనిషి అంటూ అతని ముందు ఏ మెగాస్టార్ కూడా పనికిరాడు అని చెపుతూ, 'అదిదా సార్' (adidaa sir) అని కూడా చెప్పాడు దిల్ రాజు.

ఆ విషయం ఆలా ఉంచితే, ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి (MegaStar Chiranjeevi) నటించిన 'భోళాశంకర్' (BholaaShankar) సినిమా ఈనెల 11న విడుదలవుతోంది. మెహెర్ రమేష్ (MeherRamesh) దీనికి దర్శకుడు కాగా ఇందులో కీర్తి సురేష్ (KeerthySuresh) చిరంజీవి చెల్లెలుగా, తమన్నా (Tamannah) చిరంజీవి పక్కన కథానాయకురాలిగా నటిస్తున్నారు. ఇంకా ఇందులో చాలామంది వున్నారు. చిరంజీవి ఆ ఇద్దరు కథానాయకులు, శ్రీముఖి (Sreemukhi), రాజా రవీంద్ర (RajaRavindra), దర్శకుడు మెహర్ రమేష్ (MeherRamesh) ఇంకా జబర్దస్త్ (Jabardasth) ఆర్టిస్టులు కొంతమందితో కలిసి ప్రచారంలో భాగంగా వీడియో ఇంటర్వ్యూ ఇచ్చారు.

ఇది కామన్ ఇంటర్వ్యూ, ఈ ఇంటర్వ్యూ లో కొన్ని ముఖ్య భాగాలను ఈరోజు ఆ సినిమా పీఆర్ టీం విడుదల చేసింది. అయితే ఇందులో చిరంజీవి, అప్పుడు దిల్ రాజు అన్న మాటలని ఆటపట్టిస్తూ, దిల్ రాజుని ఒక ఆట ఆడుకున్నారు. తన సినిమాలో అన్నీ ఉన్నాయని చెప్పడానికి ఆ దిల్ రాజు వాడిన మాటలనే వాడారు. "డాన్స్ వేణుమా డాన్స్ ఇరుక్కు , ఫైట్స్ వేణుమా ఫైట్స్ ఇరుక్కు, కామెడీ వేణుమా కామెడీ ఇరుక్కు, గ్లామర్ వేణుమా గ్లామర్ ఇరుక్కు" అని మెగాస్టార్ నవ్వుతూ చెప్పారు. వెంటనే శ్రీముఖి అందుకొని సెంటిమెంట్ వేణుమా సెంటిమెంట్ ఇరుక్కు అని అంది. దీనికి మెగా స్టార్ వెంటనే ... 'అదిదా సార్' అని తనవైపు వేలు చూపించుకుంటూ అన్నారు.

అయితే ఈ మాటలు నిర్మాత దిల్ రాజు ని బాగా ఆటపట్టించేవిగా వున్నాయి. ఎందుకంటే అప్పట్లో దిల్ రాజు తమిళంలో చెప్పిన ఈ మాటలని మెగా స్టార్ ఈవిధంగా తన సినిమా ప్రచారంలో భాగంగా వాడేశారు. దిల్ రాజు మరి చూసారో లేదో, చూస్తే అతను ఎలా స్పందిస్తారో చూడాలి, లేదా స్పోర్టివ్ గా తీసుకోవాలి కూడా, ఎందుకంటే ఇక్కడ అన్నది ఎవరో కాదు మెగాస్టార్.

Updated Date - 2023-08-07T17:35:50+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!