Animal: ఎవరీ తృప్తి డుమ్రి, అంత బోల్డ్ గా ఎలా నటించింది? ఆమె గురించే ఎక్కువ ఆరా...

ABN , First Publish Date - 2023-12-02T19:05:27+05:30 IST

ఇప్పుడు చాలామంది వెతుకుతున్నది 'యానిమల్' సినిమాలో రణబీర్ తో శృంగార సన్నివేశంలో నటించిన నటి తృప్తి డిమ్రి. ఎవరు ఈమె, ఎక్కడ నుండి వచ్చింది, ఏ సినిమాలు చేసింది, అన్నీ వివరాలు ఇక్కడ వున్నాయి చదవండి...

Animal: ఎవరీ తృప్తి డుమ్రి, అంత బోల్డ్ గా ఎలా నటించింది? ఆమె గురించే ఎక్కువ ఆరా...
Many are now surfing to know more about this 'Animal' actress Tripti Dimri

నిన్న విడుదలైన 'యానిమల్' #Yanimal సినిమా అటు బాలీవుడ్ లోనూ, ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ మొదటి రోజు కలెక్షన్ల పరంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో రణబీర్ కపూర్ (Ranbir Kapoor) పక్కన దక్షిణాదికి చెందిన రష్మిక మందన్న (Rashmika Mandanna) నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఆమె బాలీవుడ్ లో ఈ సినిమాతో తన పేరు నమోదు చేసుకుందని ఒక వార్త చక్కర్లు కొడుతోంది. అయితే ఈ సినిమాలో ఒక చిన్న పాత్రలో తళుక్కున మెరిసిన తృప్తి డిమ్రి (TriptiDimri) పేరు కూడా మారుమోగుతోంది. నెటిజన్స్ ఈ అమ్మాయి ఎవరు, ఏ సినిమాలు చేసింది అంటూ తెగ వెతుకుతున్నారని వార్త. (Know more about the actress Tripti Dimri, who acted in some intimate scenes with Ranbir in Animal)

triptidimrinews.jpg

తృప్తి డిమ్రి ఈ 'యానిమల్' సినిమాలో రణబీర్ కపూర్ ప్రేయసిగా రెండో సగంలో కనపడుతుంది. అలాగే రణబీర్ కపూర్ తో కొన్ని బోల్డ్ సన్నివేశాల్లో కనపడటమే కాకుండా, ఒక సన్నివేశంలో ఏకంగా నగ్నంగా కూడా దర్శనం ఇస్తుంది. ఈ అమ్మాయి చాలా అందంగా నవ్వితే నవరత్నాలు వస్తాయి అన్నట్టుగా వున్న ఆ నవ్వు, మొహంలో కనిపిస్తున్న ఒకరకమైన ఆకర్షణ, ఇవన్నీ ఆమెకి చాలా అదనంగా వుండే పాయింట్స్. ఇంతకీ ఈ తృప్తి డిమ్రి ఏమి సినిమాలు చేసింది, ఎక్కడ నుండి వచ్చిందో ఇక్కడ చదవండి.

TriptiDimriinsaree.jpg

తృప్తి ఉత్తరాఖండ్ లో పుట్టి అక్కడే పెరిగింది, ముంబై వచ్చి మొదటగా మోడలింగ్ చేసింది. చాలా వ్యాపారాత్మక ప్రకటనల్లో చేసింది, అందులో సంతూర్ మామ్ గా తృప్తి చాలా పాపులర్ అయింది. తరువాత 2017 లో వచ్చిన 'పోస్టర్ బాయ్స్' అనే హిందీ సినిమా ద్వారా కథానాయకురాలిగా పరిచయం అయింది. శ్రేయాస్ తల్పడే దీనికి దర్శకుడు, కాగా ఇందులో సన్నీ డియోల్, బాబీ డియోల్, సోనాలి కులకర్ణి లాంటి నటులు కూడా చేశారు.

ఆ తరువాత 2018లో వచ్చిన 'లైలా మజ్ను' అనే సినిమాలో కథానాయికగా నటించి, మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించింది. దీనికి సాజిద్ అలీ దర్శకుడు కాగా ఏక్తా కపూర్, ప్రీతి అలీ నిర్మాతలు. విచిత్రం ఏంటంటే ఈ సినిమా కోసమని తృప్తి 2016లో ఆడిషన్ కి వెళితే రిజెక్ట్ చేసారని చెప్పింది, కానీ మళ్ళీ ఆమెనే ఈ సినిమాలో కథానాయకురాలి పాత్రకి ఎంపిక చేశారు. అదే కదా డెస్టినీ అంటే!

TriptiDimrihotpic.jpg

బాలీవుడ్ అగ్రనటి, విరాట్‌ కోహ్లీ భార్య అనుష్క శర్మ నిర్మాతగా, అన్విత దత్ దర్శకత్వంలో వచ్చిన 'బుల్ బుల్' అనే సినిమాలో తృప్తి నటించి తన ప్రతిభా పాటవాలని చూపింది. ఈ సినిమా నేరుగా ఓటిటి లో విడుదలైంది, మంచి పేరు సంపాదించింది. ఇక తృప్తి నెమ్మదిగా తన స్థానాన్ని సుస్థిరపరుచుకుంటోంది. మళ్ళీ అన్విత దత్ దర్శకత్వంలోనే 'ఖలా' అనే సినిమా చేసింది.

Triptidimriknowmoreabouther.jpg

ఇప్పుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్ పక్కన ఈ హాట్ భామ నటించింది. ఇందులో నగ్నంగా వుండే సన్నివేశంలో నటించడమే కాకుండా, రణబీర్ తో ఇంటిమసీ వున్న సన్నివేశంలో కూడా చేసింది. ఆమె వచ్చేది రెండో సగంలో అయినా, ఆమె చాలా హాట్ గా ఉండటం, శృంగార సన్నివేశంలో నటించడంతో ఇప్పుడు చాలా పాపులర్ అయిపొయింది. అందరూ ఈమె ఎవరా అని బాగా వెతుకుతూ ఆమెకి సంబందించిన వార్తలు చదువుతున్నారు అని తెలుస్తోంది. అలాగే ఇంకో రెండు హిందీ సినిమాల్లో కూడా తృప్తి నటిస్తోంది. ఈ 'యానిమల్' సినిమా విజయంతో ఆమె ఒక పెద్ద స్టార్ అయ్యే సూచనలు కనపడుతున్నాయి.

TriptiDimrinewsabouther.jpg

తృప్తి తండ్రి నటుడు అవ్వాలని అవలకేపోయారట, అందుకని తృప్తి నటనలోకి ప్రవేశించింది. ఈమెకి మొదట్లో కెమెరా అంటే చాలా షై అని చెప్పింది. కానీ ఇప్పుడు 'యానిమల్' సినిమా చూసాక, అందులోనూ ఆ శృంగార సన్నివేశం చూసాక, ఈమెకేనా కెమెరా ముందు నిలబడటం అంటే సిగ్గు అని మొదట్లో సినిమాలు చెయ్యాలని అనుకోలేదు అని అందరూ కామెంట్స్ చేస్తున్నారు. ఈమెకి ట్రావెలింగ్ అంటే ఎంతో ఇష్టమట. ఈమెని కొందరు తృప్తి డుమ్రి అని, కొందరు తృప్తి దుమ్రి అని ఇలా పిలుస్తూ వున్నారు.

Updated Date - 2023-12-02T19:05:29+05:30 IST