KeerthySureshMarriage: మిస్టరీ మ్యాన్ ని అవసరం అయినప్పుడు నేనే బయటపెడతా: కీర్తి సురేష్

ABN , First Publish Date - 2023-05-23T14:27:20+05:30 IST

'దసరా' సినిమాతో మంచి విజయాన్ని చాలా కాలం తరువాత అందుకున్న నటి కీర్తి సురేష్. ఆమె ఇప్పుడు వార్తల్లో బాగా వైరల్ అవుతోంది, ఎందుకంటే ఆమె ఎవరో బిజినెస్ మ్యాన్ ని పెళ్లిచేసుకోబోతోంది అని. అయితే ఈ వార్తల మీద కీర్తి సురేష్ స్పందించింది, తాను అవసరం వచ్చినప్పుడు ఆ మిస్టరీ మ్యాన్ ని బయటపెడతా అని చెప్పింది.

KeerthySureshMarriage:  మిస్టరీ మ్యాన్ ని అవసరం అయినప్పుడు నేనే బయటపెడతా: కీర్తి సురేష్
Keerthy Suresh

నటి కీర్తి సురేష్ (KeerthySuresh) ఈమధ్య సాంఘీక మాధ్యమంలో బాగా వైరల్ అవుతోంది. అదే ఆమె పెళ్లి గురించిన వార్తలు, ఎవరో బిజినెస్ మ్యాన్ ని పెళ్లిచేసుకోబోతోందని వార్తలు బాగా వైరల్ అయ్యాయి. ఆమె తన సాంఘికమాద్యమంలో #KeerthySureshMarriage క్లోజ్ గా వున్న ఒక అబ్బాయితో ఫోటోస్ షేర్ చెయ్యడం, వాళ్లిద్దరూ ఒకేలాంటి అవుట్ ఫైట్స్ వేసుకోవడం, ఇవన్నీ చూసి, ఆమె పెళ్లి చేసుకుంటోంది అన్న వార్త వైరల్ అయింది. అదీ కాకుండా అతనికి పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా కీర్తి చెప్పడంతో నెటిజన్స్ అతనే అని ఫిక్స్ కూడా అయిపోయారు.

keerthysuresh.jpg

కీర్తి సురేష్ తెలుగు సినిమా 'దసరా' (Dasara) పెద్ద విజయం సాధించింది. ఇందులో ఆమె నాని (Nani) పక్కన కథానాయకురాలిగా నటించింది. అదీ కాకుండా, తెలంగాణ యాస ఈ సినిమాలో మాట్లాడింది, తానే డబ్బింగ్ కూడా చెప్పుకుంది. కీర్తి సురేష్ కి చాలా కాలం తరువాత ఈ 'దసరా' రూపం లో ఒక హిట్ వచ్చింది.

keerthysuresh1.jpg

అయితే ఈ పెళ్లివార్తల మీద కీర్తి సురేష్ స్పందించింది. అనవసరంగా తన స్నేహితుడిని ఇందులోకి లాగవలసిన అవసరం లేదు, అని చెప్పింది. నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు అసలు మిస్టరీ మ్యాన్‌ని బయటపెడతాను, మీరందరూ అప్పటి వరకు చిల్ పిల్ వేసుకోండి, అని అన్నిటికీ సమాధానం చెప్పింది కీర్తి సురేష్. దీనిని బట్టి కీర్తి సురేష్ జీవితం లో ఒక మిస్టరీ మ్యాన్ వున్నాడని అనుకోవచ్చా!

Updated Date - 2023-05-23T14:27:20+05:30 IST