సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kangana Ranaut: హీరో-దర్శకుడిని ఓ ఆట ఆడుకుంది!

ABN, First Publish Date - 2023-07-30T15:49:51+05:30

బాలీవుడ్‌ ఫైర్‌బ్రాండ్‌ కంగరా దర్శకుడు కరణ్‌ జోహార్‌పై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. కరణ్‌ దర్శకత్వం వహించిన ‘రాకీ ఔర్‌ రాణీ కి ప్రేమ్‌ కహానీ’ని విమర్శిస్తూ ఆమె ఇన్‌స్టాలో వరుస పోస్ట్‌లు చేశారు. కరణ్‌ జోహార్‌ దర్శకత్వంలో రణవీర్‌సింగ్‌, అలియాభట్‌ జంటగా నటించిన ఈ చిత్రం ఈ నెల 28న విడుదలైంది. ఈ చిత్రాన్ని వీక్షించిన కంగనా కరణ్‌పై ఫైర్‌ అయ్యారు.

బాలీవుడ్‌ ఫైర్‌బ్రాండ్‌ కంగరా దర్శకుడు కరణ్‌ జోహార్‌పై (Karan johar) మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. కరణ్‌ దర్శకత్వం వహించిన ‘రాకీ ఔర్‌ రాణీ కి ప్రేమ్‌ కహానీ’ని (Rakhi aur rani ki prem kahani) విమర్శిస్తూ ఆమె ఇన్‌స్టాలో వరుస పోస్ట్‌లు చేశారు. కరణ్‌ జోహార్‌ దర్శకత్వంలో రణవీర్‌సింగ్‌, అలియాభట్‌ జంటగా నటించిన ఈ చిత్రం ఈ నెల 28న విడుదలైంది. ఈ చిత్రాన్ని వీక్షించిన కంగనా (kangan ranaut) కరణ్‌పై ఫైర్‌ అయ్యారు. రణ్‌వీర్‌ సింగ్‌ డ్రెస్సింగ్‌ స్టైల్‌పై ఆమె తీవ్రంగా మండిపడ్డారు. రూ.250 కోట్లతో కరణ్‌ ఓ డైలీ సీరియల్‌ తీశారని కామెంట్‌ చేశారు. ‘‘ఇండియన్‌ ఆడియన్స్‌ మూడు గంటల సినిమాలో ఎన్నో వింతలు చూస్తున్నారు. అటమిక్‌ సైన్స్‌ న్యూక్లియర్‌ వెపన్స్‌ నేపథ్యంలో సినిమాలు తీసి అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఈ నెపోటిజం గ్యాంగ్‌ మాత్రం రూ.250 కోట్ల బడ్జెట్‌తో డైలీ సీరియల్స్‌ తీస్తున్నారు. 90ల్లో వచ్చిన చిత్రాలను కాపీ కొట్టి వాటికి రూ.250 కోట్ల బడ్జెట్‌తో సినిమా చేసినందుకు కరణ్‌ సిగ్గుపడాలి. డబ్బు ఎందుకు దుర్వినియోగం చేస్తున్నావ్‌. టాలెంట్‌ ఎంతో మంది యువత సరైన వనరులు లేక సినిమాలు తీయలేకపోతున్నారు. అలాంటి వాళ్లకి అవకాశం ఇస్తే కొత్త కథలతో సినిమాలు తీసి విప్లవాత్మక మార్పు తీసుకొస్తారు. ఫస్ట్‌ నువ్వు రిటైర్‌ అయిపో కరణ్‌. కొత్త టాలెంట్‌కు అవకాశాలు కల్పించు’’ అని రాసుకొచ్చారు.

అంతే కాదు హీరో రణ్‌వీర్‌కు సూచనలిచ్చారు. ‘‘రణ్‌వీర్‌ .. దయచేసి నువ్వు డెస్సింగ్‌ విషయంలో కరణ్‌ జోహార్‌ను ఫాలో కావద్దు. ధరేంద్ర, వినోద్‌ ఖన్నా వంటి పెద్దలను స్ఫూర్తిగా తీసుకొని దుస్తులు ధరించు. భారతీయులు కార్టూన్‌ లుక్‌లో ఉన్నవారిని హీరోలుగా పరిగణించరు. దక్షిణాది నటులను చూసి తెలుసుకో. వారు ఎంత హుందాగా ఉంటారో! వాళ్ల లుక్‌లో ఓ డిగ్నిటీ, ఇంటెగ్రిటీ ఉంటాయి’’ అని రణ్‌వీర్‌సింగ్‌ను విమర్శించింది.

Updated Date - 2023-07-30T16:06:17+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!