Akkineni Nagarjuna: నాగార్జునపై కాదంబరి కిరణ్ సంచలన వ్యాఖ్యలు, 17 ఏళ్లుగా....

ABN , First Publish Date - 2023-11-03T14:14:02+05:30 IST

కాదంబరి కిరణ్ తాను ఎందుకు ఎదగలేకపోయాడో అనే విషయం ఒక యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇందులో భాగంగా అక్కినేని నాగార్జున మీద సంచలన కామెంట్స్ చేసాడు కాదంబరి. అతను తనని ఎలా దూరం చేసిందీ, నాగార్జున కి కథ చెప్పాక ఎన్ని సంవత్సరాలు తాను తిరిగాడో, ఇంకా చాలా...

Akkineni Nagarjuna: నాగార్జునపై కాదంబరి కిరణ్ సంచలన వ్యాఖ్యలు, 17 ఏళ్లుగా....
Akkineni Nagarjuna and (inset) Kadambari Kiran

నటుడు, దర్శకుడు కాదంబరి కిరణ్ (KadambariKiran) పరిచయం లేని వ్యక్తి. సుమారు 250 సినిమాల్లో నటుడిగా చేసి, 'మనం సైతం' (ManamSaitham) అనే సంస్థను స్థాపించి పేద వాళ్లకి, సహాయం కావాల్సిన వాళ్ళకి తనవంతు సహాయం చేస్తూ వస్తూ వున్నాడు. కాదంబరి కిరణ్ 'కుర్రాళ్ల రాజ్యం' అనే ఒక సినిమాకి దర్శకత్వం కూడా వహించాడు. ఇప్పుడంటే చాలా టీవీ చానెల్స్ వచ్చాయి, డిజిటల్ చానెల్స్ వచ్చేసేయి, కానీ అప్పట్లో కేవలం కొన్ని చానెల్స్ మాత్రమే ఉండేవి.

అటువంటి సమయంలో కాదంబరి కిరణ్ టీవిలో తనదైన మార్కు వేసాడు. చాలా సీరియల్స్ నిర్మించానని, ఏదైనా కొత్త ఛానల్ వస్తే అందులో తన సీరియల్ తప్పనిసరిగా ఉండేదని చెప్పాడు ఒక ఇంటర్వ్యూ లో చెపుతూ తనదైన రీతిలో తనకి ఎందుకు పేరు రాలేదు అనేదానికి తన పేట్ అని చెప్పాడు. అదే విధంగా నాగార్జున మీద సంచలన వ్యాఖ్యలు కూడా చేసాడు. "నాగార్జున ఇంటికి వెళ్లి రెండున్నర గంటలు కథ చెప్పాను నేను. అది ఒక మిరాకిల్ అని చెప్పాలి, ఎందుకంటే అయన ఇంటికి వెళ్లి ఆయన్ని రెండున్నర గంటలు కూర్చోపెట్టి కథ చెప్పాను. అతను కథ విని రెండు సన్నివేశాల్లో కరెక్షన్స్ చెప్పారు, నేను ఆ రెండు చేసి అతనికి చెప్పడానికి తిరుగుతూనే వున్నాను. ఇది 17వ సంవత్సరం," అని చెప్పాడు కాదంబరి కిరణ్.

kadambarikiran1.jpg

'కుర్రాళ్ళ రాజ్యం' సినిమా ఫెయిల్ అయ్యాక తాను ఏంటో తనకే అర్థం కాలేదు అని చెప్పాడు. జర్నలిస్టునా, దర్శకుడైనా, ఆర్టిస్టు నా, రచయితనా, నిర్మాతనా అనేది నాకు తెలియలేదు. ఎక్కడికీ పారిపోలేను, ఎందుకంటే పరిశ్రమలో ఇన్నాళ్లు ఉన్నాక వేరే దగ్గరికి వెళ్లి పని చెయ్యలేను. నాకంటూ ఒక బాధ్యత వుంది, పోనీ ఎక్కడికైనా వెళ్ళిపోదాం అంటే మిత్రులు కొంతమంది తనకి టాలెంట్ వుంది అని అంటూ ఉండటం వలన. పరిశ్రమలో ఇంత కాలం వుండి ఇక వేరే దగ్గరికి వెళ్ళలేకపోయాను అని చెప్పాడు కాదంబరి కిరణ్.

ప్రతి కొత్త ఛానల్ లో సీరియల్ ప్రొడ్యూసర్ చేసి చాలా నష్టపోయానని చెప్పాడు కాదంబరి. ఎవరు దగ్గరికి రానియ్యలేదని, ఎవరూ వేషం ఇవ్వడానికి కూడా తిరస్కరించారని, దర్శకుడికి వేషం ఎలా ఇస్తామని చెప్పారు. అందుకని ఇక్కడే వుంది పరిశ్రమలో మంచి, చెడు పరిశీలిస్తూ వున్నాను అని చెప్పాడు కాదంబరి కిరణ్. ఎందుకంటే తాను ఎదగలేకపోయాను అని, కేవలం తెలుగు చలన చిత్ర పరిశ్రమ వాచ్ మాన్ గా ఉండిపోయాను అని చెప్పాడు కాదంబరి.

నాగార్జున (AkkineniNagarjuna) తో 'బావ' సినిమా చెయ్యాల్సింది కానీ అది మధ్యలో ఆగిపోయింది. ఎందుకంటే అది పేట్ అని అంటాడు కాదంబరి. కొంతమందికి కొన్ని వర్కవుట్ అవుతాయి, కొంతమందికి అవ్వవు అని అన్నాడు కాదంబరి. నాగార్జున తనకి ఛాన్స్ ఇవ్వనంత మాత్రాన తనకేమీ పోయేది లేదని, తాను కాదంబరి కిరణ్ గా వున్నాను అని చెప్పాడు. తరువాత రమ్యకృష్ణతో (RamyaKrishna) ఒక సినిమా 'గజ్జెల గుర్రం' కూడా కాలేదు. అలాగే సిమ్రాన్ (Simran) తో కూడా ఒక సినిమా అవలేదు, ఉషా కిరణ్ మూవీస్, బాబు మోహన్ కొడుకుతో, బ్రహ్మానందం (Brahmanandam) తో ఒక సినిమా ఇవేమీ అవలేదు అని చెప్పుకొచ్చాడు కాదంబరి కిరణ్. అంత తన తలరాత అని అన్నాడు.

akkineninagarjuna3.jpg

టీవీలో సీరియల్స్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు నాగేశ్వర రావు (AkkineniNageswaraRao) గారితో పరిచయం అయింది. అతనితో సాన్నిహిత్యం బాగా పెరిగింది, అసలు ఒక టైములో నాగార్జున గారు కూడా నన్ను పిలిచి నాన్నతో టీవిలో ఒక ప్రోగ్రాం కి యాంకరింగ్ చేయిస్తే బాగుంటుంది అని నాకు చెప్పారు. అప్పుడు నేను యాంకరింగ్ అంటే నాగేశ్వర రావు గారు పళ్ళు రాలగొడతారు అని చెప్పాను. కానీ ఆ తరువాత నాగేశ్వరరావు గారితో మాట్లాడుతూ ఒక సందర్భంలో నేను మీ అనుభవాలు చలన చిత్ర పరిశ్రమలో ఒక 'లైబ్రరీ ఫిలిం' అవుతుంది అని నాగేశ్వర రావు గారితో చెపితే, అతను ఒప్పుకున్నారు. నాగేశ్వర రావు గారే 'గుర్తుకొస్తున్నాయి' అనే టైటిల్ పెట్టి చేద్దాం అని చెప్పారు. అప్పుడు నాగార్జున వేరే యాంకర్ ని పెట్టి, నన్ను కట్ చేసేసారు. నాగార్జున వ్యాపారాత్మకంగా చూసారు, నన్ను కట్ చేశారు. అలాగే నాగార్జున కి నేను ఇంట్లో కథ చెప్పడంతో నాకు టాలెంట్ వుంది అని నాగార్జున సన్నిహితుడు చెప్పడంతో నేను పొగుడుతున్నాడేమో అనుకున్నాను, కానీ తరువాత తెలిసింది, నన్ను అక్కడ కూడా కట్ చేశారు అని. ఇదంతా పేట్ అని అన్నాడు కాదంబరి.

Updated Date - 2023-11-03T14:14:03+05:30 IST