సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Jayasudha: పెళ్లి చేసుకున్నట్లుగా వస్తున్న వార్తలు పచ్చి అబద్ధం

ABN, First Publish Date - 2023-01-13T18:14:24+05:30

సహజనటిగా బాగా ప్రాచుర్యం పొందిన నటి జయసుధ (Jayasudha) మళ్లీ పెళ్లి చేసుకున్నారంటూ ఈమధ్య కొన్ని మాధ్యమాల్లో (ఆంధ్రజ్యోతి కాదు) వార్తలు చక్కర్లు కొట్టాయి.. కొడుతున్నాయి. ‘వారసుడు’ (Vaarasudu) ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌లో...

Jayasudha Actress
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సహజనటిగా బాగా ప్రాచుర్యం పొందిన నటి జయసుధ (Jayasudha) మళ్లీ పెళ్లి చేసుకున్నారంటూ ఈమధ్య కొన్ని మాధ్యమాల్లో (ఆంధ్రజ్యోతి కాదు) వార్తలు చక్కర్లు కొట్టాయి.. కొడుతున్నాయి. ‘వారసుడు’ (Vaarasudu) ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌లో జయసుధతో పాటుగా వున్న ఒక పర్సన్‌ని చూసి.., కనీసం జయసుధని అడగకుండా, ఆమెతో పాటు వచ్చిన అతన్ని ఆమె భర్తగా అనుకోని కొన్ని మాధ్యమాలు పెళ్లి చేసేశాయి. ఈ వార్తలపై జయసుధకి ఆంధ్రజ్యోతి ఫోన్ చేసి అదే విషయం అడగ్గా, ఆమె నవ్వి, ‘పెళ్లా, నాకా? ఎవరితో?’ అని ఆశ్చర్యంగా అడిగారు. ఎవరో బిజినెస్‌మ్యాన్‌ని చేసుకున్నారట కదా.. అని అడిగితే.. ఆమె నవ్వుతూ.. అతను తనకు స్నేహితుడు అని, అమెరికా నుండి వచ్చాడని, తన బయోపిక్ తీసేందుకు అన్నీ దగ్గరుండి గమనిస్తున్నాడని.. సహజనటి జయసుధ తెలిపారు. (Jayasudha Clarity About Marriage Rumours)

అతని పేరు ఫెలిపే (Felipe Ruelas), అతను అమెరికన్ అని చెప్పారు జయసుధ. ‘‘అతను, నేను ఒక సినిమా కొలాబరేషన్‌కి కలిశాము. నా బయోపిక్ తీస్తున్నారు. ఇది స్పిరిట్యుయల్ బయోపిక్, అంటే నేను క్రిస్టియానిటీ‌కి ఎలా మారాను, ఎప్పుడు మారాను? ఆ తరువాత ఏంటి? అలా మారక ముందు నేను ఎలా ఉండేదాన్ని? ఇవన్నీ ఈ బయోపిక్‌లో ఉంటాయి’’ అని తెలిపారు జయసుధ.

‘‘అతను నా గురించి రీసెర్చ్ చేసేటప్పుడు ఇంటర్నెట్, ఇతర మాధ్యమాల్లో నా గురించి చదివి తెలుసుకుంటాడు. కానీ నన్ను కలిసి నాకు ఇక్కడ ఎటువంటి ఫాలోయింగ్ వుంది. నన్ను అందరూ ఎలా గౌరవిస్తారు.. నా సినిమాలు, షూటింగ్స్ ఎలా అవుతున్నాయి.. ఇవన్నీ తెలుసుకునేందుకు ఇండియా వచ్చి నాతో ట్రావెల్ చేస్తున్నాడు. అంతే, ఇంకేమీ లేదు. అతను ఇలా Faith-based సినిమాలు తీస్తూ ఉంటాడు’’ అని చెప్పారు జయసుధ. ఆమె ఆమధ్య అమెరికా వెళ్లి అతన్ని కలిశారు కూడా.

Felipe Ruelas కొడుకుతో ఒక సినిమా తీసినప్పుడు ఆ సినిమా స్క్రీనింగ్ అప్పుడు జయసుధని ఆహ్వానిస్తే, ఆమె కూడా అమెరికా వెళ్లారు. అతని కొడుకు కూడా జయసుధతో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నాడని చెప్పారు. జయసుధ కొన్ని సంవత్సరాల కిందట బ్యాంకాక్ లో నీటిలో పడిపోయినపుడు నీటి అడుగుకి వెళ్లి ఏమి అవకుండా, కనీసం నీరు ముక్కులోకి కూడా పోలేదు, బతికి బయట పడ్డారు. అప్పుడు జయసుధ‌కి జీసస్ (Jesus) కనిపించారు. అది ఒక మిరాకిల్, సూపర్ నేచురల్ అని చెప్తారు జయసుధ. ఆ మిరాకిల్ ఆధారంగా ఈ బయోపిక్ తీస్తున్నట్టుగా చెప్పారు.

Updated Date - 2023-01-13T18:27:22+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!