Allu Arjun: పుష్పరాజ్ తో ఒకరోజు, ఇది నిజంగానే ఒక సర్ప్రైజ్ !

ABN , First Publish Date - 2023-08-30T11:24:46+05:30 IST

ముందు రోజు చెప్పినట్టుగానే అల్లు అర్జున్ అందరినీ సర్ప్రైజ్ చేశాడు. ఉత్తమ నటుడిగా ఎంపికైన అతని జీవితంలో ఒక రోజు, అంటే అతను లేచిన దగ్గర నుండి, షూటింగ్ కి వెళ్లడం, మళ్ళీ ప్యాక్ అప్ చెప్పేంత వరకు ఏమేమి చేస్తాడు అనే విషయాలు అతను ఇన్స్టాగ్రామ్ తో కొలాబరేట్ అయి చేసిన వీడియో వైరల్ అయింది. ఇది మొదటిసారి ఒక భారతీయ నటుడితో ఇన్స్టాగ్రామ్ ఇలా చెయ్యడం, ఆ నటుడు అల్లు అర్జున్ అవటం, నిజంగా అన్నీ సర్ప్రైజ్ విషయాలే

Allu Arjun: పుష్పరాజ్ తో ఒకరోజు, ఇది నిజంగానే ఒక సర్ప్రైజ్ !
A day in Allu Arjun life

అల్లు అర్జున్ (AlluArjun) నిన్న తన ఇన్స్టాగ్రామ్ లో ఈరోజు ఒక సర్ప్రైజ్ ఉంటుందని చెప్పాడు. నిజంగానే ఒక సర్ప్రైజ్ ఇచ్చాడు. స్టైలిష్ స్టార్ గా, ఐకాన్ స్టార్ (IconStar) గా పిలవబడే అల్లు అర్జున్ రోజులో అతని దిన చర్య, షూటింగ్ ముందు ఏమి చేస్తాడు, ఎలా ప్రిపేర్ అవుతాడు, ఇంట్లో, కుటుంబం, పిల్లలు, షూటింగ్ ఇలా అన్నీ కలిపి ఒక వీడియో లో చేసి, ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసాడు.

ఇలా ఇన్స్టాగ్రామ్ ఒక భారతీయ నటుడి తో కొలాబరేట్ అయి, అతని జీవితంలో అతను లేచింది మొదలు షూటింగ్ కి వెళ్లి, ప్యాక్ అప్ చెప్పేంత వరకు ఏమి చేస్తాడు అనేది ఒక వీడియో రూపంలో చూపించటం ఇదే మొదటిసారి. ఈ ఘనత ఇప్పుడు అల్లు అర్జున్ దక్కించుకున్నాడు అని చెప్పాలి. అల్లు అర్జున్ కి విపరీతమైన ఫాలోయింగ్ వుంది, అది 'పుష్ప' #Pushpa సినిమాతో మరింత ఎక్కువయింది కూడా.

alluarjun-therule.jpg

ప్రపంచ వ్యాప్తంగా అల్లు అర్జున్ అభిమానులకోసం ఇన్స్టాగ్రామ్ (Instagram) మొదటిసారిగా, ఇండియా వచ్చి, హైదరాబాద్ (Hyderabad) వచ్చి, అల్లు అర్జున్ తో కలిసి వీడియో చెయ్యటం నిజంగానే ఒక సర్ప్రైజ్. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అయింది, అతని అభిమానులకి అయితే పండగే పండగ. సుకుమార్ దర్శకత్వం వహించిన 'పుష్ప' #Pushpa:TheRise సినిమా ప్రపంచ వ్యాప్తంగా విజయ ఢంకా మోగించింది. అల్లు అర్జున్ కి జాతీయ ఉత్తమ నటుడు అవార్డు కూడా తెచ్చిపెట్టింది, మొదటిసారి ఒక తెలుగు నటుడి కి ఇలా ఉత్తమ నటుడు అవార్డు రావటంతో అల్లు అర్జున్ చరిత్ర సృష్టించినట్టే. ఇప్పుడు ఈ వీడియోతో 'పుష్ప 2' #Pushpa2:The Rule మీద కూడా భారీ అంచనాలు పెరిగాయని చెప్పాలి. 'పుష్ప 2' షూటింగ్ కూడా చూపించారు, ఇండియాలో అభిమానులు ఎలా వుంటారు, వాళ్ళని అల్లు అర్జున్ ఎలా రిసీవ్ చేసుకుంటాడు, ఇవన్నీ ఇందులో చూపించారు.

alluarjun-therule1.jpg

మధ్యాహ్నం వంటి గంట అవగానే తన పిల్లలతో వీడియో కాల్ చేసి అల్లు అర్జున్ రోజు మాట్లాడతాడు. అలాగే అతను వుడ్ కటింగ్ అంటే ఇషం, అందుకని చాలా పరికరాలు పెట్టుకుంటాడు. అలాగే మార్నింగ్ లేవగానే, బయట గార్డెన్ కి రావటం, బ్లాక్ కాఫీ తాగటం, ఇలా అన్నీ అందులో చూపించారు. దర్శకుడు సుకుమార్ (Sukumar) తో సినిమా గురించి చర్చ, తన పాత్ర గురించి వివరణ, అలాగే ప్యాక్ అప్ చెప్పటం, ఇలా అన్ని చూపించి అబ్బురపరిచారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది.

ఉదయం లేవటం, యోగ, పిల్లలు, కుటుంబం ఇవన్నీ అల్లు అర్జున్ చాలా సరదాగా ఉంటూ, ఒక్కసారిగా షూటింగ్ వెళ్లేసరికి మాత్రం తన పాత్రలోనే లీనమయిపోతాడు, అందులోనే ఉంటాడు. మళ్ళీ షూటింగ్ అవగానే యోగ, తరువాత మళ్ళీ మామూలుగా ఉంటాడు. ఇలా అల్లు అర్జున్ గురించి చాలా ఆసక్తికర విషయాలు షేర్ చేశారు.

Updated Date - 2023-08-30T11:24:46+05:30 IST