సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Ilaiyaraaja: గోల్డెన్ గ్లోబ్ అవార్డ్.. మీ కష్టానికి దక్కిన ఫలితమిది

ABN, First Publish Date - 2023-01-11T15:24:14+05:30

ఆర్ఆర్ఆర్ (RRR) చిత్రంలోని ‘నాటు నాటు...’ (Naatu Naatu) ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ (Golden Globe) పురస్కారం దక్కించుకోవడంతో.. భారతీయులంతా గర్వంగా..

Ilaiyaraaja on Golden Globe Award to RRR
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆర్ఆర్ఆర్ (RRR) చిత్రంలోని ‘నాటు నాటు...’ (Naatu Naatu) ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ (Golden Globe) పురస్కారం దక్కించుకోవడంతో.. భారతీయులంతా గర్వంగా ఫీలవుతున్నారు. సంగీత దిగ్గజం, మాస్ట్రో ఇళయరాజా (Ilaiyaraaja) ట్విట్టర్ వేదికగా ఆర్ఆర్ఆర్ టీమ్‌కు అభినందనలు తెలిపారు. ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ పడిన కష్టానికి దక్కిన ఫలితంగా ఆయన ఈ అవార్డును అభివర్ణించారు. ప్రస్తుతం ఇళయరాజా చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

‘‘కీరవాణి, రాజమౌళి, ఆర్ఆర్ఆర్ టీమ్.. మీ కష్టానికి దక్కిన ఫలితమిది. నాకు చాలా సంతోషంగా ఉంది. టీమ్ అందరికీ అభినందనలు’’ అని ఇళయరాజా తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ కూడా ఆర్ఆర్ఆర్ టీమ్‌కు అభినందనలు తెలిపారు. ప్రస్తుతం ఈ సంగీత దిగ్గజాలు చేసిన ట్వీట్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. వీరే కాదు.. ఇండియన్ సినిమా ప్రేమికులందరూ.. ‘ఆర్ఆర్ఆర్’ సాధించిన ఘనతతో సంతోషం వ్యక్తం చేస్తూ.. టీమ్‌‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. (Golden Globe Award to RRR)

Updated Date - 2023-01-11T15:24:16+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!