సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Krithi Shetty: కృతిశెట్టి కూడా ఆ ట్రెండ్‌కి అలవాటైంది

ABN, First Publish Date - 2023-01-13T19:21:29+05:30

ఈ మధ్య స్టార్ హీరోలు, హీరోయిన్లు ఓ ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. ఇప్పుడా ట్రెండ్‌కు కృతిశెట్టి కూడా అలవాటయ్యింది. ఆ ట్రెండ్ ఏమిటంటే..

Krithi Shetty with Fans
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఈ మధ్య స్టార్ హీరోలు, హీరోయిన్లు ఓ ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. ఇప్పుడా ట్రెండ్‌కు కృతిశెట్టి కూడా అలవాటైంది. ఆ ట్రెండ్ ఏమిటంటే.. తమని ఎంతగానో ఆదరించే, అభిమానించే అభిమానులతో కలిసి కాసేపు స్పెండ్ చేయడం. అప్పట్లో రజినీకాంత్ ఈ ట్రెండ్‌ని సెట్ చేస్తే.. ఈ మధ్య మహేష్ బాబు, అల్లు అర్జున్, నాని, కీర్తి సురేష్ వంటి వారు.. మళ్లీ ఆ ట్రెండ్‌ని బయటికి తీశారు. ఇప్పుడీ గ్రూపులోకి యంగ్ బ్యూటీ కృతి శెట్టి కూడా చేరి.. అభిమానులతో సరదాగా కాసేపు టైమ్ స్పెండ్ చేసింది.

హైదరాబాద్ శ్రీనగర్ కాలనీ (Hyderabad Srinagar Colony)లో జరిగిన ఈ అభిమానుల సమావేశానికి తెలంగాణ (Telangana), ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) నుంచి ఆమె అభిమానులు పాల్గొనడం విశేషం. ఈ మీట్‌లో ప్రతి ఒక్కరినీ ఆమె ప్రేమగా పలకరించి.. పక్కన కూర్చుని కాసేపు ముచ్చట్లు చెప్పింది. దీంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవంటే నమ్మాలి. అలాగే ప్రతి ఒక్కరితో ఫొటో దిగి, వారి యోగ క్షేమాలను సైతం కృతి శెట్టి అడిగి తెలుసుకోవడం గమనార్హం. (Krithi Shetty Meets Fans)

ఒక వ్యక్తిని కొందరు అభిమానించడం అంటే.. అది ఏ జన్మలోనో చేసుకున్న పుణ్యంగా మన స్టార్ హీరోలు వేదికలపై చెబుతుంటారు. అలా అభిమానించే వారిని అప్పుడప్పుడు ఇలా కలుసుకోవడంలో ఎంతో తృప్తి ఉంటుంది. ఆ తృప్తిని కృతిశెట్టి పొందడమే కాకుండా.. ఇకపై అభిమానులను తరచూ ఇలా కలవాలనే నిర్ణయానికి ఆమె వచ్చినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం సౌత్‌లో ఉన్న యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరోయిన్లలో కృతిశెట్టి టాప్ ప్లేస్‌లో దూసుకెళుతోంది. రిజల్ట్‌తో సంబంధం లేకుండా.. ఆమెను అవకాశాలు వరిస్తున్నాయి. ‘ఉప్పెన’ (Uppena)తో బ్లాక్‌బస్టర్ అందుకున్న ఈ భామ ప్రస్తుతం నాగచైతన్య ‘కస్టడి’ (Custody), శర్వానంద్‌తో మరో చిత్రం, అలాగే మలయాళంలో టోవినో థామస్ సరసన ఇలా.. సౌత్‌లో దాదాపు అరడజనుకు పైగా చిత్రాలలో నటిస్తూ.. బిజీ హీరోయిన్‌గా గడుపుతోంది. (Heroine Krithi Shetty)

Updated Date - 2023-01-13T19:27:48+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!