Drugs Case: టాలీవుడ్ హీరోయిన్ భర్త అరెస్ట్

ABN , First Publish Date - 2023-01-02T15:38:54+05:30 IST

హైదరాబాద్, గోవా, ముంబైలోని పలువురు డ్రగ్ సప్లయర్స్‌తో పరిచయాలు పెంచుకున్న మైరాన్ మోహిత్.. ఆ తర్వాత తను కూడా డ్రగ్స్ సప్లయ్ చేయడం మొదలెట్టారని..

Drugs Case: టాలీవుడ్ హీరోయిన్ భర్త అరెస్ట్
Drugs Case

‘బిచ్చగాడా.. మజాకా’, ‘ది బెల్స్’, ‘వజ్రాలు కావాలా నాయనా’, ‘దడ పుట్టిస్తా’, ‘తిప్పరా మీసం’ వంటి చిత్రాలలో నటించిన హీరోయిన్ నేహా దేశ్ పాండే (Neha Deshpande) భర్త మైరాన్ మోహిత్‌ (Myron Mohit)ను డ్రగ్స్ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. టాలీవుడ్, బాలీవుడ్ చిత్రాలలో నటించిన నేహా దేశ్ పాండే.. సరైన అవకాశాలు రాకపోవడంతో ఇంటర్నేషనల్ డీజే ఆర్గనైజర్ అయిన మైరాన్ మోహిత్‌ను కొంత కాలం కిందట వివాహం చేసుకుంది. 12 సంవత్సరాల క్రితం హైదరాబాద్ వదిలి ముంబైకి వెళ్లిన మైరాన్ హైహిత్.. అక్కడ పబ్‌లో వెయిటర్‌గా పనిచేస్తూ.. డ్రగ్ సప్లయిర్‌గా మారినట్లుగా తెలుస్తోంది.

హైదరాబాద్, గోవా, ముంబైలోని పలువురు డ్రగ్ సప్లయర్స్‌తో పరిచయాలు పెంచుకున్న మైరాన్ మోహిత్.. ఆ తర్వాత తను కూడా డ్రగ్స్ సప్లయ్ చేయడం మొదలెట్టారని సమాచారం. తాజాగా హైదరాబాద్, బంజారా హిల్స్‌లో‌ని ఓ పబ్‌లో డ్రగ్స్ తీసుకుంటూ ఉండగా పోలీసులు ఆయనని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడంతో.. సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హైదరాబాద్‌లోని పలు పబ్‌లకు, అలాగే సినీ వ్యాపారవేత్తలకు మన్యం కృష్ణ కిషోర్ రెడ్డితో కలిసి మోహిత్ డ్రగ్స్ సప్లై చేస్తున్నారని.. బెంగుళూరు నుంచి వారు డ్రగ్స్ తెప్పిస్తున్నట్లుగా పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనతో మరోసారి డ్రగ్స్ వార్తలు టాలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. (Heroine Husband)

Updated Date - 2023-01-02T15:42:41+05:30 IST