కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Sukumar: ఇతను అచ్చం దర్శకుడు సుకుమార్ లా వున్నాడు కదా, ఇంతకీ ఇతనెవరు?

ABN, First Publish Date - 2023-11-01T13:22:44+05:30

మనిషిని పోలిన మనుషులని ఎంతోమందిని చూస్తూ ఉంటాం. అలాగే ఒక సెలెబ్రిటీని పోలిన వ్యక్తిని చూస్తే అతన్నీ కూడా నిజమైన సెలబ్రిటీ అనుకుంటూ ఫోటోలు, సెల్ఫీలు తీసుకుంటూ వుంటారు. ఇప్పుడు ఇతను అచ్చం అగ్ర దర్శకుడు సుకుమార్ లా వున్నాడు చూడండి. ఇంతకీ ఇంతనెవరో తెలుసా...

The lookalike of director B Sukumar

మనిషిని పోలిన మనుషులు ఎనిమిది మంది వుంటారు అని నానుడి. ఈ ప్రపంచంలో మనం ఎంతోమంది మనుషులు పోలిన మనుషులని చూస్తూ ఉంటాం, ఒకరు అనుకొని అదే పోలికలతో వున్న ఇంకో మనిషిని పిలిచి మాట్లాడేస్తూ ఉంటాం కూడా. అది సర్వ సాధారణమైన విషయం, ఆ తరువాత అతను తాను అతను కాదని చెప్పిన తరువాత ఆశ్చర్యపోతూ ఉంటాం. అయితే ఒక సెలబ్రిటీ పోలికలు వున్న ఇంకో వ్యక్తి కనపడినప్పుడు మాత్రం అతనికి తెలిసినవాళ్లే కాకుండా, మామూలు ప్రజలు కూడా అతన్ని చూసి ఫోటోలకి ఎగబడటం చూస్తూ ఉంటాం.

పై ఫోటోలో వున్న వ్యక్తిని చూస్తే అతను అచ్చం అగ్ర దర్శకుడు సుకుమార్ (Sukumar) లానే వున్నాడు కదా. ఆసక్తికరం ఏంటంటే ఇతని పేరు కూడా బి. సుకుమార్. ఇతని నడవడిక అచ్చం దర్శకుడు సుకుమార్ లానే ఉంటుంది. మొన్న ఒక కొత్త చిత్రం ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు ఇతన్ని అందరూ దర్శకుడు సుకుమార్ అనే అనుకున్నారు, అంటే ఇతను అచ్చం అలానే వున్నాడు కదా. అందుకని. అలాగే అతనితో ఎంతోమంది సెల్ఫీ లు, ఫోటోలు తీసుకున్నారు కూడా. చాలామంది అతన్ని సుకుమార్ అనే ముందు పలకరించి ఆ తరువాత అతను తాను ఎవరో చెప్పాక, అప్పుడు నవ్వుకుంటూ వుంటారు, ఆశ్చర్యపోతూ వుంటారు.

ఇతని వివరాలు అడిగితే ఎక్కువగా చెప్పలేదు కానీ తన పేరు కూడా బి సుకుమార్ అనీ, ప్రొఫెషన్ డాక్టర్ అని చెప్పాడు. మణికొండ ప్రాంతంలో తన క్లినిక్ ఉంటుందని చెప్పాడు. అయితే తాను యాక్టర్ కూడా అని చెప్పాడు, యాక్టింగ్ అనే ఇష్టమని, కొన్ని సినిమాలలో చిన్న చిన్న పాత్రల్లో నటించానని, దర్శకుడు సుకుమార్ ని కూడా కలిసానని చెప్పాడు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న 'పుష్ప 2' #Pushpa2 లో ఇతను ఒక పాత్ర కూడా చేసాడు.

దర్శకుడు సుకుమార్ ని కలిసినప్పుడు అతను కూడా చాలా ఆశ్చర్యపోయాడట ఇతన్ని చూసి. ఏంటి అచ్చం నాలానే వున్నవే అని సరదాగా పలకరించాడట దర్శకుడు సుకుమార్. అలాగే ఇతను నడక, వేషం అన్నీ దర్శకుడు సుకుమార్ ఎలా చేస్తాడో అలానే ఇతనివి కూడా ఉంటాయి.

Updated Date - 2023-11-01T13:24:21+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!