కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Guntur Kaaram: మహేష్‌కి ముద్దు.. సెకండ్ సింగిల్ రిలీజ్‌కు సర్వం సిద్ధమైనట్లే..

ABN, First Publish Date - 2023-12-09T19:07:43+05:30

సూపర్ స్టార్ మహేష్ బాబు.. మాటల మాంత్రికుడు, దిగ్గజ రచయిత-దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటోన్న సినిమా ‘గుంటూరు కారం’. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగా వెయిట్ చేస్తున్నారో.. తెలియంది కాదు. తాజాగా ఈ సినిమా సెకండ్ సింగిల్ విడుదల వివరాలు తెలియజేస్తూ.. మహేష్‌ని శ్రీలీల ముద్దాడుతున్న పోస్టర్‌ని విడుదల చేశారు.

Guntur Kaaram Movie Poster

సూపర్ స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu).. మాటల మాంత్రికుడు, దిగ్గజ రచయిత-దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) కాంబినేషన్‌లో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ (Haarika Hassine Creations) పతాకంపై ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటోన్న సినిమా ‘గుంటూరు కారం’ (Guntur Kaaram). ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగా వెయిట్ చేస్తున్నారో.. తెలియంది కాదు. ఏదైనా చిన్న అప్‌డేట్ వస్తే చాలు.. సోషల్ మీడియాలో ట్రెండ్ బద్దలు కొట్టేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ అప్‌డేట్ వచ్చిందో.. లేదో.. అప్పుడు ‘గుంటూరు కారం’ టైటిల్ ట్రెండ్‌లోకి వచ్చేసింది.

ఇక అప్‌డేట్ విషయానికి వస్తే.. ఈ సినిమా నుండి సెకండ్ సింగిల్ విడుదలకు అంతా సిద్ధం చేసినట్లుగా మేకర్స్ తాజాగా ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో సూపర్ స్టార్ మహేష్ బాబును టాలీవుడ్ క్రష్ శ్రీలీల (Sreeleela) ముద్దాడుతోంది. పోస్టర్ కలర్‌ఫుల్‌గా ఉండటమే కాకుండా.. ఈ సాంగ్ రొమాంటిక్ ప్రియులకు తెగ నచ్చేస్తుందనే ఫీల్‌ని ఇస్తోంది. ‘ఓ మై బేబీ’ (Oh My Baby) అంటూ సాంగ్ ఈ పాట ప్రోమోను డిసెంబర్ 11 సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు, ఫుల్ సాంగ్‌ను డిసెంబర్ 13న విడుదల చేయనున్నట్లుగా మేకర్స్ ఈ పోస్టర్‌పై పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. (Guntur Kaaram Poster)


దాదాపు 13 సంవత్సరాల తర్వాత మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌ని మూడోసారి సెట్ చేసిన ఘనత మాత్రం నిర్మాత రాధాకృష్ణ‌దే అని చెప్పుకోవాలి. ఈ కలయికలో సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచి, అభిమానులు ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్లు కావాలంటూ పదే పదే కోరుతున్నారు. షూటింగ్ ఎప్పుడు జరుగుతోంది, సినిమా ఎలా రూపొందుతోంది మరియు ఎలాంటి పాటలు కంపోజ్ చేస్తున్నారు, ఇలా సినిమా గురించి ప్రతిదీ తెలుసుకోవాలనే ఇంట్రస్ట్‌ను ప్రదర్శిస్తున్నారు. అభిమానుల ఆసక్తిని గమనించి మేకర్స్ కూడా వారిని డిజప్పాయింట్ చేయకుండా.. ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూనే ఉన్నారు. మీనాక్షి చౌదరి, జగపతి బాబు, జయరామ్, ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ వంటి ప్రముఖ తారాగణం నటిస్తున్న ఈ సినిమాని 12 జనవరి, 2024న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. (Guntur Kaaram Second Single Update)


ఇవి కూడా చదవండి:

====================

*Director Sai Kiran Daida: స్క్రీన్‌కి అతుక్కొని మరీ ‘పిండం’ సినిమా చూస్తారు..

********************************

*Thandel: నాగ్ స్విచ్.. వెంకీ క్లాప్.. అరవింద్ స్క్రిఫ్ట్

***********************************

Updated Date - 2023-12-09T19:07:45+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!