సినీ, బిగ్‌బాస్‌ తారలు ఆవిష్కరించిన గ్రాండ్‌ గాలా కార్నివాల్‌ బ్రోచర్

ABN , Publish Date - Dec 25 , 2023 | 09:25 PM

సౌత్‌ ఇండియాలోనే అతిపెద్ద గ్రాండ్‌ గాలా కార్నివాల్‌ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో జరపబోతున్నారు. ఈ కార్యక్రమ బ్రోచర్‌ని సినీ, బిగ్ బాస్ సెలబ్రిటీలు తాజాగా జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు.

సినీ, బిగ్‌బాస్‌ తారలు ఆవిష్కరించిన గ్రాండ్‌ గాలా కార్నివాల్‌ బ్రోచర్

సౌత్‌ ఇండియాలోనే అతిపెద్ద గ్రాండ్‌ గాలా కార్నివాల్‌ (Grand Gala Carnival) ఈవెంట్‌ నిర్వహించబోతున్నట్లు‌గా నిర్వాహకులు మనిందర్‌రెడ్డి, గుమ్మడి శిరీష, ముప్పిడి సాహితి, సింగిరెడ్డి మనీష తెలిపారు. సోమవారం ఈ గ్రాండ్‌ కార్నివాల్‌కు సంబంధించిన సన్నాహక కార్యక్రమం ఫిలింనగర్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిగ్‌బాస్‌–7 కంటెస్టెంట్‌ శుభశ్రీ రాయగురుతో పాటు, నయని పావని, ఆర్‌జే చైతన్య, యావర్, శోభా శెట్టి, టేస్టీ తేజ, డైరెక్టర్‌ గోవిరెడ్డి శ్రీనివాస్, గీతూ రాయల్‌ తదితర సినీ, బిగ్ బాస్ తారలు పాల్గొని కార్యక్రమ బ్రోచర్‌ను ఆవిష్కరించారు.


Grand-Gala-Carnival.jpg

ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ సౌతిండియాలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే గ్రాండ్‌ గాలా కార్నివాల్‌ను తొలిసారిగా హైదరాబాద్ నగరంలోని ఎన్‌ కన్వెన్షన్‌లో ఫిబ్రవరి 3వ తేదీన నిర్వహించబోతున్నామని అన్నారు. ఈ కార్నివాల్‌లో దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన అనేక రుచులు, ఫ్యాషన్, జ్యువెలరీ, దుస్తులు, కిడ్స్‌ వర్క్‌షాప్‌తో పాటు లైవ్‌బ్యాండ్‌ వంటి పలు ఎంటర్‌టైన్‌మెంట్‌ కార్యక్రమాలు నిర్వహించబోతున్నట్లు తెలిపారు. ఈ గ్రాండ్‌ గాలా ఈవెంట్‌లో పలువురు సినీ ప్రముఖులు కూడా పాల్గొనబోతున్నట్లు వారు వెల్లడించారు.

Updated Date - Dec 25 , 2023 | 09:25 PM