Konidela family: మెగా ప్రిన్సెస్ క్లీంకార ఫేస్ కనపడింది, రామ్ చరణ్ పోలికలున్నాయంటూ ఫోటోస్ వైరల్

ABN , First Publish Date - 2023-10-30T17:12:54+05:30 IST

రామ్ చరణ్, ఉపాసన దంపతులు చాలా జాగ్రత్తలు తీసుకొని క్లీంకార మొహం కనపడకుండా, చూపించకుండా ఇన్నిరోజులు వచ్చారు. కానీ ఇటలీలో కొణిదెల, కామినేని కుటుంబాల గ్రూప్ ఫోటో ఒకటి బయటకి వచ్చింది. అందులో క్లీంకార మొహం చాలా క్లియర్ గా వుంది. అదెలా జరిగింది అంటే...

Konidela family: మెగా ప్రిన్సెస్ క్లీంకార ఫేస్ కనపడింది, రామ్ చరణ్ పోలికలున్నాయంటూ ఫోటోస్ వైరల్
Konidela and Kamineni family group photo is going viral

టాలీవుడ్ పవర్ ఫుల్ కపుల్ రామ్ చరణ్ (RamCharan), ఉపాసన కామినేని (UpasanaKamineni) లకి జూన్ 20న కుమార్తె పుట్టిన సంగతి తెలిసిందే. మెగా ప్రిన్సెస్ (MegaPrincess) అని ముద్దుగా పిలుచుకునే ఆమెకి క్లీంకార కొణిదెల (KlinKaaraKonidela) అని పేరు కూడా పెట్టారు. అయితే పుట్టిన దగ్గర నుండి ఆమె ఫేస్ ను ఎక్కడా చూపించకుండా చాలా జాగ్రత్తపడ్డారు. ఆ అమ్మాయికి బాలసారె చేసినప్పుడు కానీ, ఉయ్యాలలో వేసినప్పుడు, తాతయ్య చిరంజీవి (Chiranjeevi) ఇంటికి ఆమెని తీసుకు వచ్చినప్పుడు ఆమె మొహం కనపడకుండా చాలా జాగ్రత్త పడ్డారు.

klinkara.jpg

అలాగే రామ్ చరణ్, ఉపాసన ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా ఆమె మొహం కనపడకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఒకవేళ ఆమెతో వున్న ఫోటోలను మీడియాకి పంపినప్పుడు కూడా క్లీంకార మొహం మీద ఒక లవ్ సింబల్ వేసేసేవారు మొహం కనపడకుండా. అంతటి జాగ్రత్తలు తీసుకున్న ఆ దంపతులు ఇప్పుడు ఇటలీ వెళ్లారు. నాగబాబు కుమారుడు వరుణ్ కొణిదెల (VarunKonidela), లావణ్య త్రిపాఠి (LavanyaTripathi) ల వివాహం నవంబర్ 1 వ తేదీన జరుగనున్న సందర్భంగా మెగా, కామినేని (MegaFamily) కుటుంబాలు ఇటలీ వెళ్లారు.

అయితే ఇటలీలో కొణిదెల, కామినేని కుటుంబాలు కలుసుకున్న సందర్భంగా ఒక గ్రూప్ ఫోటో మీడియా కి విడుదల చేశారు. అందులో అమ్మమ్మ ఒళ్ళో కూర్చొన్న క్లీంకార కూడా వుంది, కానీ ఆమె మొహంకి మళ్ళీ లవ్ సింబల్ వేసేసారు కనపడకుండా. అయితే ఇక్కడే ఒక పొరపాటు చేశారు. ఆ ఫోటో ఒక పూల్ దగ్గర తీసుకోవటంతో, ఈ ఫోటోలో వున్నవాళ్ళందరి నీడలు ఆ నీళ్లలో చాలా క్లియర్ గా కనపడుతున్నాయి. నీడలో కూడా లవ్ సింబల్ వెయ్యటం మరిచిపోయారు. నీళ్లల్లో క్లీంకార మొహం చాలా క్లియర్ గా కనపడుతోంది.

Klinkara2.jpg

ఇంకేముంది, సాంఘీక మాధ్యమాల్లో ఆ ఫోటో ఇక వైరల్ అయింది. కొందరు నీళ్లలో వున్న క్లీంకార ఫోటో ఒకటి పెట్టి, పక్కనే రామ్ చరణ్ చిన్నప్పటి ఫోటోలు పెట్టి కంపేరిజన్ చేస్తున్నారు. కొందరైతే ఫోటోని తిప్పి చూడండి, క్లీంకార కనపడుతుంది అని ఫోటోని రివర్స్ చేసి పెడుతున్నారు. మొత్తానికి క్లీంకార మొహం కనపడింది, అంటూ నెటిజన్స్ ఈ ఒక్క ఫోటోని తెగ వైరల్ చేస్తున్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎక్కడో ఒక చిన్న విషయం మర్చిపోవటం వలన, నెటిజన్స్ ఆ ఒక్కటే పట్టుకుంటారు. ఈ ఫోటో ఇలా వైరల్ అవుతూనే వుంది.

Updated Date - 2023-10-30T17:12:54+05:30 IST