Suriya Accident: సూర్య ప్రమాదంపై అధికారిక ప్రకటన, డాక్టర్లు ఏమి చెప్పారంటే...

ABN , First Publish Date - 2023-11-23T15:14:21+05:30 IST

'కంగువా' సినిమా షూటింగ్ జరుగుతూ ఉండగా ఆ సినిమా కథానాయకుడు తమిళ నటుడు సూర్య ప్రమాదం బారిన పడిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రమాదం గురించి డాక్టర్లు ఏమి చెప్పారంటే...

Suriya Accident: సూర్య ప్రమాదంపై అధికారిక ప్రకటన, డాక్టర్లు ఏమి చెప్పారంటే...
Update on Suriya accident

తమిళ నటుడు సూర్య (Surya) 'కంగువా' #Kanguva సినిమా షూటింగ్ చేస్తుండగా ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈరోజు జరిగిన షూటింగ్ లో ఒక పోరాట సన్నివేశం చిత్రీకరిస్తుండగా షూటింగ్ కి వాడిన కెమెరా ఒకటి సడన్ గా పడిపోయింది. అది సూర్య భుజం మీద పడింది అని, అతనికి గాయం అయిందని వార్త వచ్చిన విషయం కూడా తెలిసిందే. 'కంగువా' సినిమాకి శివ దర్శకత్వం వహిస్తుండగా, సూర్య స్నేహితుడు ప్రముఖ నిర్మాత జ్ఞానవేల్ రాజా (GnanavelRaja), ప్రభాస్ (Prabhas) స్నేహితులు అయిన యూవీ క్రియేషన్స్ (UVCreations) తో ఈ సినిమా నిర్మిస్తున్నారు.

kanguva-teaser.jpg

సూర్య గాయపడిన విషయాన్ని సినిమా పీఆర్ మేనేజర్ ధ్రువీకరించారు, అయితే అదేమీ పెద్ద గాయం కాదని చెప్పారు. "మాకు ఇప్పుడే నిర్మాతల నుండి వార్త వచ్చింది. 'కంగువా' సినిమా షూటింగ్ లో సూర్య గాయపడిన మాట వాస్తవం, కానీ అదేమీ పెద్ద గాయం కాదు అని నిర్మాత చెప్పారు. వైద్యులు పరీక్షించి ఒక రెండు మూడు గంటలు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది అని చెప్పారు. ఈరోజు షూటింగ్ జరగకపోవచ్చు, విశ్రాంతి తీసుకున్నాక అతను కోలుకున్న వెంటనే షూటింగ్ మొదలెడతారు," అని పీఆర్ మేనేజర్ చెప్పారు.

షూటింగ్ కెమెరా ఒకటి సూర్య భుజం మీద పడిన విషయం తెలిసిందే. అయితే ఇది అంత పెద్ద గాయం కాదని విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని చెప్పారు.

తాజా అప్‌డేట్:

సూర్య కూడా తనకు జరిగిన ప్రమాదంపై సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. ‘‘మిత్రులు, శ్రేయోభిలాషులు మరియు నా ప్రాణ సమానమైన అభిమానుల నుండి వస్తున్న ‘గెట్ వెల్ సూన్’ సందేశాలకు ధన్యవాదాలు. ఇప్పుడంతా బాగానే ఉంది. మీరంతా చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతలు’’ అని ట్వీట్ చేశారు.

Updated Date - 2023-11-24T00:38:02+05:30 IST