కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Revanth Reddy: తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి ఎవరి అభిమానో తెలుసా....

ABN, First Publish Date - 2023-12-04T15:27:49+05:30

తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిమాన నటుడు ఎవరో తెలుసుకోవాలని ఉందా. అతను ఇంతకు ముందు పలు ఇంటర్వ్యూలలో ఆ నటుడు గురించి చెప్పిన వీడియోలు ఇప్పుడు సాంఘీక మాధ్యమంలో వైరల్ అవుతూ వున్నాయి.

Revanth Reddy

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రక్రియ ముగిసింది, ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా వున్న రేవంత్ రెడ్డి #RevanthReddy తెలంగాణ ముఖ్యమంత్రిగా ఈరోజు సాయంత్రం ప్రమాణ స్వీకారం చేయనున్నారు అని వార్తలు కూడా వస్తున్నాయి. ఇంతకు ముందు వున్న ప్రభుత్వాలు తెలుగు చిత్ర పరిశ్రమతో మంచి సంబంధాలు కొనసాగించాయని, ఇప్పుడు రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వం కూడా అటువంటి సహాయ సహకారాలు వుంటాయని పరిశ్రమలోని పెద్దలు ఆశిస్తున్నారు. (Revanth Reddy is going to sworn in as Chief Minsiter of Telangana State)

ఇక రేవంత్ రెడ్డి వ్యక్తిగత విషయానికి వస్తే, అతను సినిమాలు చూస్తారా, అతనికి ఏ నటుడు అంటే ఇష్టం అని చాలామందికి ఆసక్తికరంగా వుండే ప్రశ్న. అయితే ఆమధ్య చాలా ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు రేవంత్ రెడ్డి తనకి సూపర్ స్టార్ కృష్ణ (Super Star Krishna) అంటే ఎంతో అభిమానం అని చెప్పేవారు. అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ సినిమాలు ఎక్కువ చూసేవాడినని, అతనికి అభిమానిని అని చెప్పారు రేవంత్ రెడ్డి పలు ఇంటర్వ్యూ లలో. ఇప్పుడు ఆ వీడియో క్లిప్పింగ్స్ అలాగే కృష్ణ గారి పుట్టినరోజు నాడు రేవంత్ రెడ్డి చేసిన ఒక ట్వీట్ కూడా ఇప్పుడు సాంఘీక మాధ్యమంలో వైరల్ అవుతోంది. (Revanth Reddy is a fan of Super Star Krishna)

ప్రస్తుత తరంలో ఎవరు బాగా ఇష్టమైన నటుడు అని అడిగినప్పుడు, ఇప్పుడు తాను అంతగా సినిమాలు చూడనని, అప్పుడప్పుడు ఏవో సినిమాలు చూస్తూ వుంటాను అని చెప్పారు రేవంత్ రెడ్డి, అంతేకానీ ప్రత్యేకంగా పలనా నటుడు అంటే అభిమానం వుంది చెప్పలేదు. కానీ రేవంత్ రెడ్డికి మాత్రం కృష్ణగారు అంటే అభిమానం అని, అతని సినిమాలు అప్పట్లో చాలా చూసేవాడినని చెప్పారు. అతను రెండేళ్ల క్రితం కృష్ణగారి పుట్టినరోజు నాడు 'ఎక్స్' (Twitter) లో చేసిన ట్వీట్ సాంఘీక మాధ్యమంలో బాగా వైరల్ అవుతూ ఉండటం విశేషం.

Updated Date - 2023-12-04T15:30:54+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!