DimpleHayathi: వేణు స్వామితో పూజలు, అందుకేనా...

ABN , First Publish Date - 2023-06-26T17:04:46+05:30 IST

పోలీసు వివాదంలో ఇరుకున్న నటి డింపుల్ హయతి తన ఇంట్లో యూట్యూబ్ లో పాపులర్ అయిన వేణు స్వామి తో పూజలు చేయించుకుంది.

DimpleHayathi: వేణు స్వామితో పూజలు, అందుకేనా...
Venu Swamy performing pooja at Dimple Hayati house

నటి డింపుల్ హయతి (DimpleHayathi) ఈమధ్య వార్తల్లో వున్న విషయం అందరికీ తెలిసిందే. ఆమె మీద ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే (Traffic DCP Rahul Hegde) తన వాహనాన్ని ధ్వంసం చేసిందని ఆమధ్య పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తరువాత డింపుల్ లాయర్ ఆ పోలీస్ ఆఫీసర్ కేవలం హరాస్ చెయ్యడానికే ఆలా చేసాడని, అందులో డింపుల్ తప్పులేదని చెప్పిన విషయం కూడా అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ వ్యవహారం కోర్టులో వుంది.

dimplehayathipooja1.jpg

ఇక కెరీర్ పరంగా చూస్తే డింపుల్ నటించిన 'రామబాణం' #RamaBanam కొన్ని వారాల క్రితం విడుదలై బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడిపోయింది. శ్రీవాస్ (Sriwaas) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో గోపీచంద్ (Gopichand) కథానాయకుడిగా నటించగా, జగపతి బాబు (JagapathiBabu), ఖుష్బూ (Khushbhu) ముఖ్యమైన పాత్రల్లో కనపడతారు. ఆ సినిమా సరిగ్గా నడవకపోవటం, ఆ తరువాత పోలీస్ ఆఫీసర్ తో వివాదం ఇలా ఉండటం డింపుల్ కొంచెం బాడ్ గా అనిపించింది అని పూజ చేయించిందని బోగట్టా.

dimplehayathipooja2.jpg

యూట్యూబ్ లో కొంచెం పాపులర్ అయిన వేణు స్వామి (VenuSwamy) ఈ పూజలు డింపుల్ ఇంటోలో చేయించినట్టుగా సాంఘీక మాధ్యమాల్లో ఫోటోలు వైరల్ అయ్యాయి. చిత్ర పరిశ్రమలో చాలామంది ఇలా పూజలు, గోపురాలు తిరగడం నమ్ముతారు. ఆమధ్య సమంత (Samantha) చాలా గుడిలు తరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు డింపుల్ హయతి మంచి జరగాలని ఇలా పూజలు చేయించుకుంది అని తెలిసింది.

Updated Date - 2023-06-26T17:04:46+05:30 IST