SSMB28: మహేష్ కి త్రివిక్రమ్ కి చెడిందా? అందుకేనా షూటింగ్ ఆగింది

ABN , First Publish Date - 2023-04-27T11:16:31+05:30 IST

ఏదైనా పెద్ద స్టార్ సినిమా షూటింగ్ ఆగితే దానికి ఎన్నో అనుమానాలు వస్తాయి. ఇప్పుడు మహేష్ బాబు (MaheshBabu), త్రివిక్రమ్ (TrivikramSrinivas) కాంబినేషన్ లో వస్తున్న #SSMB28 సినిమాకి కి ఆలాగే అయింది. ఇంతకీ ఏమైంది, ఎందుకు షూటింగ్ ఆగింది అంటే...

SSMB28: మహేష్ కి త్రివిక్రమ్ కి చెడిందా? అందుకేనా షూటింగ్ ఆగింది

మహేష్ బాబు (Mahesh Babu), త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) కాంబినేషన్ లో వస్తున్న #SSMB28 షూటింగ్ ప్రస్తుతం ఆగిపోయింది. ఎందుకు ఆగిందో అని అటు మహేష్ అభిమానులు, ఇటు #SSMB28 యూనిట్ సభ్యులకు కూడా అర్థం కావటం లేదు. మహేష్ బాబు వెకేషన్ కి వెళ్లి వచ్చిన తరువాత షూటింగ్ మొదలవుతుందని అనుకుంటున్న సమయంలో షూటింగ్ లేదు మళ్ళీ వాయిదా అనగానే అందరూ నిరుత్సాహ పడ్డారు. ఇంతకీ ఎందుకు ఆగింది, ఏమి జరుగుతోంది ఇటు అభిమానులు చాలా ఆందోళనలో వున్నారు.

SSMB28.jpg

సాంఘీక మాధ్యమం లో అయితే దీని గురించి చిలవలు పలవలుగా మాట్లాడుకుంటున్నారు. మహేష్ బాబు కి, త్రివిక్రమ్ శ్రీనివాస్ కి పడటం లేదు అని, అందుకే ఆగింది అని తెలిసింది. ఈలోగా నిర్మాతలు చినబాబు (Chinababu), నాగ వంశి (Naga Vamsi), మహేష్ బాబు ఇంటికెళ్లి కలిసినట్టుగా కూడా వార్తలు వచ్చాయి. మహేష్ బాబు షూటింగ్ ఎప్పుడు మొదలెట్టాలి అనే దానిమీద క్లారిటీ అడిగాడని, దానికి నిర్మాతలు ఒక వారం రోజుల్లో చెపుతామని కూడా నిర్మాతలకి అతి సన్నిహితమైన వ్యక్తి సాంఘీక మాధ్యమం లో పెట్టడం మరో వివాదానికి కూడా ఇది దారి తీసింది.

SSMB28.jpg

ఆ ట్వీట్ ని బట్టి చూస్తే, మహేష్ బాబు కి, నిర్మాతలకి మధ్య ఎదో జరుగుతోందని, షూటింగ్ ఆగడానికి వీళ్ళ మధ్యలో వున్న అపార్ధాలు చోటుచేసుకోవటమే (Differences) అని అంటున్నారు. మరి ఇంతకీ ఈ సినిమా షూటింగ్ జరుగుతుందా, సినిమా పూర్తవుతుందా అని కూడా అభిమానులు ఆందోళనలో వున్నట్టుగా సమాచారం. ఈ సినిమాకి పెట్టిన ముహూర్తం ఏంటో గానీ, మొదటి నుండీ ఈ సినిమాకి అవాంతరాలు ఎదురవుతూనే వున్నాయి. గత సంవత్సరం మొదలవ్వాల్సి ఈ సినిమా, ఏ సంవత్సరం మొదలయింది, కానీ ఇంతవరకు కనీసం పది శాతం కూడా అవలేదు అని అంటున్నారు. దీని మీద నిర్మాతలు గానీ, లేదా మహేష్ బాబు నుంచి గానీ ఏమైనా అధికారిక ప్రకటన వస్తే తప్ప, ఈ సినిమా మీద ఇలా అనేక అనుమానాలు వస్తూనే ఉంటాయి. ఇందులో పూజ హెగ్డే (Pooja Hegde), శ్రీలీల (Sreeleela) కథానాయికలుగా చేస్తున్నారు.

Updated Date - 2023-04-27T11:16:38+05:30 IST